అన్వేషించండి

EPFO Updates:పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! ఫారమ్‌ 15G, 15H స్థానంలో కొత్త అప్లికేషన్! 

EPFO Updates:ఎంప్లాయీస్ ప్రావిడెంట్‌ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారుల కోసం రూల్స్ మార్చింది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం ఈ మార్పులు చేర్పులు చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పన్ను చట్టం 2025తో పాటు, EPFO కొత్త ఫామ్ 121 ప్రవేశపెట్టింది.
  • ఈ ఫామ్ 121 ద్వారా అన్ని వయసుల వారికి TDS మినహాయింపు సులభం.
  • ఫామ్ 121 సమర్పణకు గత రెండేళ్ల ITR వివరాలు తప్పనిసరి.
  • EPFO 8.25% వడ్డీ, UPI విత్‌డ్రా సౌకర్యాలు కూడా అందిస్తోంది.

EPFO Updates:కేంద్ర ప్రభుత్వం పాత ఆదాయపు పన్ను చట్టం, 1961ని క్రమంగా తొలగించి, దాని స్థానంలో మరింత ఈజీగా ఉండే ఐటీ చట్టం 2025ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం, పన్ను నిబంధనలను సులభతరం చేసే లక్ష్యంతో ఈపీఎఫ్‌ఓ ఏప్రిల్ 13 2026న క కీలక సర్క్యులర్ జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అధికారికంగా అమలులోకి వచ్చాయి. 

గతంలో 60 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులు టీడీఎస్ మినహాయింపు కోసం ఫామ్‌ 15Gని 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఫామ్‌ 15Hని ఉపయోగించేవారు. అయితే  ఈ రెండు ఫామ్‌ల వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగించడానికి వయసుతో సంబందం లేకుండా అందరికీ ఉపయోగపడేలా పామ్‌ 121ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 

Also Read: ఆధార్ భద్రతకు మూడు సూత్రాలు! సైబర్ మోసాలకు చెక్ పెట్టే టిప్స్‌!

ఫామ్ 121 అంటే ఏంటీ?

ఫామ్‌ 121 అనేది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం. తమ వార్షిక ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉందని భావించే వ్యక్తులు, పీఎఫ్ ఉపసంహరణలు, వడ్డీ డివెడెండ్లు, ఇతర ఆదాయ వనరులపై టీడీఎస్‌ కట్ అవ్వకుండా ఉండేందుకు దీనిని సమర్పించవచ్చు. ఇది మునుపటి రెండు ఫామ్‌ల కలయికగా పని చేస్తుంది. 

ఎవరు దీనిని సమర్పించవచ్చు

ఈ కొత్త ఫామ్ 121 కేవలం పీఎఫ్ ఖాతాదారులకే కాకుండా మరికొందరికి కూడా అందుబాటులో ఉంది. భారత్‌లో నివసిస్తున్న సాధారణ వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు, హిందు అవిభక్త కుటుంబాలు, నిర్దేశిత పరిమితిలోపు ఆదాయం కలిగిన ట్రస్ట్‌లు వంటి కొన్ని ఇతర సంస్థలు. ఈ ఫామ్ నింపాల్సి ఉంటుంది 

Also Read: స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI

షరతులు ఉన్నాయి!

సంబంధిత ఆర్థిక సంవత్సరంలో సదరు వ్యక్తి మొత్తం పన్ను బాధ్యతను సున్నా అయి ఉండాలి. ఇది వయస్సు ఆధారిత వ్యత్యాసాలు తొలగించి, అందరికీ  ఒకే రకమైన నిబంధనలను వర్తింపజేస్తుంది. ప్రతిసారి మీరు ఫామ్‌ 121 సమర్పించినప్పుడు, పారదర్శకత కోసం ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇస్తుంది. ఈ పామ్‌ ఫిల్ చేసే సమయంలో గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఎక్నాలెడ్జ్‌మెంట్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా మీరు పన్ను మినహాయింపునకు అర్హులేనని నిర్దారించుకుంటారు. ఖాతాదారులు  ఫామ్‌ను ఇన్‌కమ్ టాక్స్‌ డిపార్ట్మెంట్‌ అధికారిక పోర్టల్ ద్వారా పొందవచ్చు. 

ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

పీఎఫ్ చందాదారులు తమ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేటప్పుడు కొన్ని కీలక విషయాలను గమనించాలి. పీఎఫ్ ఉపసంహరణ 50 వేల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు టీడీఎస్ వర్తిస్తుంది. ఒక వేళ మీరు పాన్ కార్డు లింక్ చేయకపోతే ఈ పన్ను శాతం మరింత పెరుగుతుంది. ఫామ్121 అనేది ఒకసారి సమర్పిస్తే సరిపోదు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో దీనిని మళ్లీ సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో పీఎఫ్ వడ్డీ లేదా ఉపసంహరణలపై ఆటోమేటిక్‌గా టీడీఎస్ కట్ అవుతుంది. 

Also Read: మీ ఆధార్ కార్డు మీరే వాడుతున్నారా? ఇంకా ఎవరైనా వాడుతున్నారా? తక్షణమే ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి!

మరిన్ని సంస్కరణలు 

ఈపీఎప్ఓ కేవలం టాక్స్ నియమాల్లోనే కాకుండా ఖాతాదారుల సౌకర్యార్థం మరికొన్ని సంస్కరణలను కూడా చేపట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాకుండా, ఇన్‌ ఆపరేటివ్ అకౌంట్లలో వెయ్యి కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిక్‌గా రీఫండ్ ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించింది. యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయంతో కూడిన ఈపీఎఫ్‌వో 3.0 వెర్షన్‌ను కూడా సిద్ధం చేస్తోంది. మీ పీఎఫ్ ఖాతాలో కేవైసీ వివరాలను సి చూసుకోవడం, కొత్త ఫామ్‌ 121 గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిచడం మంచిది. 

Frequently Asked Questions

ఫామ్ 121 అంటే ఏమిటి?

ఫామ్ 121 అనేది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం. తమ వార్షిక ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉందని భావించే వ్యక్తులు, పీఎఫ్ ఉపసంహరణలు, వడ్డీ డివెడెండ్లు, ఇతర ఆదాయ వనరులపై టీడీఎస్ కట్ అవ్వకుండా ఉండేందుకు దీనిని సమర్పించవచ్చు.

ఫామ్ 121 ఎవరు సమర్పించవచ్చు?

భారత్‌లో నివసిస్తున్న సాధారణ వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు, హిందు అవిభక్త కుటుంబాలు, నిర్దేశిత పరిమితిలోపు ఆదాయం కలిగిన ట్రస్ట్‌లు వంటి కొన్ని ఇతర సంస్థలు ఈ ఫామ్ నింపాల్సి ఉంటుంది.

ఫామ్ 121 సమర్పించడానికి షరతులు ఏమిటి?

సంబంధిత ఆర్థిక సంవత్సరంలో సదరు వ్యక్తి మొత్తం పన్ను బాధ్యత సున్నా అయి ఉండాలి. ఈ ఫామ్ నింపేటప్పుడు గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఎక్నాలెడ్జ్&zwnj>మెంట్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి.

పీఎఫ్ ఖాతాదారులపై ఫామ్ 121 ప్రభావం ఏమిటి?

పీఎఫ్ ఉపసంహరణ 50 వేల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు టీడీఎస్ వర్తిస్తుంది. ఫామ్ 121ని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మళ్లీ సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో పీఎఫ్ వడ్డీ లేదా ఉపసంహరణలపై ఆటోమేటిక్&zwnj>గా టీడీఎస్ కట్ అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget