అన్వేషించండి

Aadhar Card: మీ ఆధార్ కార్డు మీరే వాడుతున్నారా? ఇంకా ఎవరైనా వాడుతున్నారా? తక్షణమే ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి! 

Aadhar Card: ప్రతి చిన్న, పెద్ద పనికి ఆధార్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. అది బ్యాంకింగ్ అయినా లేదా సిమ్ కార్డ్ కొనుగోలు అయినా. ఈ క్రమంలో దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా UIDAI ప్రత్యేక చర్యలు చేపట్టింది.
  • myAadhaar పోర్టల్ ద్వారా మీ ఆధార్ వినియోగ చరిత్రను తెలుసుకోండి.
  • అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే ఫిర్యాదు చేయడానికి హెల్ప్ లైన్ కలవండి.
  • బయోమెట్రిక్ లాక్ ఫీచర్ ద్వారా మీ ఆధార్ భద్రతను పెంచుకోండి.

Aadhar Card: మనకు ఆధార్‌ ప్రతి రోజూ చిన్న పనులకు కూడా అవసరమయ్యే డాక్యుమెంట్ అయ్యింది. అది బ్యాంకింగ్ అయినా లేదా సిమ్ కార్డ్ కొనుగోలు అయినా చివరకు బస్‌లో ప్రయాణం చేయాలన్నా సరే ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఇలా ప్రతి చోట ఆధార్ ఆడుగుతున్న టైంలోనే కొన్ని చోట్ల దుర్వినియోగం అయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే కచ్చితంగా దీని గురించి మీరు తెలుసుకోవాల్సింది. లేకుంటే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. ఈ 12 అంకెల ప్రత్యేక IDని కొందరు దుర్వినియోగం చేసి బ్యాంకు మోసాలకు పాల్పడిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. అందువల్ల, మీ ఆధార్ సురక్షితంగా ఉందని, దుర్వినియోగం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఆధార్‌ను రక్షించడానికి UIDAI (భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ) అనేక ఆన్‌లైన్ టూల్స్, సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి, భద్రపరచడానికి ఉన్న మార్గాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా, myAadhaar పోర్టల్‌కి వెళ్లండి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను  ఎంటర్ చేయండి. లాగిన్ విత్ OTP ఎంపికపై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP  వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేయండి. 

లాగిన్ అయిన తర్వాత, అథంటింకేషన్ హిస్టరీ విభాగానికి వెళ్లండి. ఇక్కడ మీరు మీ ఆధార్ వినియోగం గురించి వివరాలు తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజుల సమాచారాన్ని చూడవచ్చు. మీరు ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ గమనించినట్లయితే, వెంటనే UIDAIకి ఫిర్యాదు చేయండి.

మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే, UIDAI వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1947 కు కాల్ చేయండి. మీ ఫిర్యాదును help@uidai.gov.in కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చు. మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఈ సర్వీస్‌ UIDAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీని కోసం అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించండి. లాక్/అన్‌లాక్ ఆధార్ విభాగంపై క్లిక్ చేయండి. సూచనలు, మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవండి. మీ వర్చువల్ ID (VID), పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. సెండ్‌ OTP  అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేసి, మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయండి.

మీ బయోమెట్రిక్ డేటా లాక్  చేసిన తర్వాత, దానిని ఎప్పుడైనా అన్‌లాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ మీ అనుమతి లేకుండా ఎవరూ మీ బయోమెట్రిక్ డేటాను యాక్సెస్ చేయలేరు. మీ ఆధార్‌ను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే చర్య తీసుకోండి. మీ ఆధార్‌ను సురక్షితంగా ఉంచడానికి బయోమెట్రిక్ లాక్‌ని ఉపయోగించండి. తెలియని ప్రదేశాల్లో ఆధార్ కార్డును  ఉపయోగించకపోవడం మంచిది.  

Frequently Asked Questions

నా ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఎలా చూసుకోవాలి?

మీ ఆధార్ కార్డు వినియోగాన్ని myAadhaar పోర్టల్ లో అథంటికేషన్ హిస్టరీ ద్వారా పర్యవేక్షించవచ్చు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే UIDAIకి ఫిర్యాదు చేయండి.

ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి బయోమెట్రిక్ లాక్ ఎలా ఉపయోగించాలి?

UIDAI వెబ్ సైట్ లో 'లాక్/అన్‌లాక్ ఆధార్' విభాగంలో మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయవచ్చు. దీని కోసం VID, పేరు, పిన్ కోడ్, క్యాప్చా అవసరం.

ఆధార్ దుర్వినియోగం గురించి UIDAIకి ఎలా ఫిర్యాదు చేయాలి?

UIDAI వెబ్ సైట్ లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు, టోల్‌ఫ్రీ నంబర్ 1947 కు కాల్ చేయవచ్చు లేదా help@uidai.gov.in కు ఇమెయిల్ పంపవచ్చు.

బయోమెట్రిక్ డేటా లాక్ చేస్తే, దానిని ఎప్పుడు అన్‌లాక్ చేయవచ్చు?

మీ బయోమెట్రిక్ డేటాను ఎప్పుడైనా అన్‌లాక్ చేయవచ్చు. ఇది మీ అనుమతి లేకుండా మీ డేటాను ఎవరూ యాక్సెస్ చేయకుండా చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget