By: Arun Kumar Veera | Updated at : 30 Dec 2024 11:33 AM (IST)
VID గురించి తెలిస్తే ఆధార్ నంబర్‌ను ఉపయోగించరు! ( Image Source : Other )
Virtual ID Number On Aadhar Card: భారత ప్రజల గుర్తింపు & ప్రయోజనాల కోసం, ఉడాయ్ (UIDAI), భారత ప్రభుత్వం తరపున ఆధార్ కార్‌లను జారీ చేస్తోంది. ఈ రోజుల్లో ఈ కార్డ్ ఉంటేనే అన్ని పనులు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా, ఆధార్ కార్డ్‌ను ID ప్రూఫ్‌గా అడుగుతున్నారు. ఉడాయ్, ఆధార్ కార్డ్‌తో పాటు 16 అంకెల తాత్కాలిక కోడ్‌ను కూడా జారీ చేస్తుంది. మీ కార్డ్‌లో ఆధార్ నంబర్ కింద ఈ 16 అంకెల సంఖ్యను కనిపిస్తుంది, దీనిని వర్చువల్ ID అంటారు. ఆధార్ ధృవీకరణ సమయంలో ఇది ఉపయోగపడుతుంది.
ఆధార్ నంబర్ - వర్చువల్ ఐడీ అనుసంధానం
16 అంకెల వర్చువల్ ఐడీ మీ ఆధార్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది. వర్చువల్ IDలోని 16 నంబర్‌లు మీ ఆధార్‌లోని 12 నంబర్‌లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడాయి. సాధారణంగా, వర్చువల్ IDని e-KYC ధృవీకరణ కోసం ఉపయోగిస్తారు. చాలా సందర్భాల్లో, మనం అనేక ఆన్‌లైన్ పోర్టళ్లలో మన ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ ఆధార్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయడం ఆ సంస్థకు సులభం అవుతుంది. ఒక్కోసారి ఇది తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. కానీ.. మీరు ఆధార్ నంబర్ స్థానంలో వర్చువల్ ఐడీని పూరించినప్పుడు, ఐడీ ప్రూఫ్ అందించాల్సిన అవసరం అక్కడ నెరవేరుతుంది, ఇతర వివరాలేవీ అవతలి వ్యక్తికి కనిపించవు. అంటే, ఆధార్‌లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరూ మోసపూరితంగా యాక్సెస్ చేయలేరు.
ఆధార్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయినట్లు గతంలో చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి, ప్రభుత్వాన్ని & ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, UIDAI వర్చువల్ IDని తీసుకువచ్చింది. దీనిలో అతి పెద్ద ఫీచర్ ఏంటంటే.. ఆధార్ నంబర్ నుంచి VIDని రూపొందించవచ్చు, కానీ VID నుంచి మీ ఆధార్ నంబర్‌ను కనిపెట్టలేరు. VIDలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే దీనికి గడువు తేదీ అంటూ ఉండదు. అంటే, మీరు కొత్త VIDని జెనరేట్ చేసే వరకు ఇప్పటికే ఉన్న VID చెల్లుబాటులో ఉంటుంది.
వర్చువల్ IDని అనేకసార్లు జెనరేట్ చేయొచ్చు?
వర్చువల్ ID నంబర్ స్థిరంగా ఉండదు, ఇది తాత్కాలికం. దీనిని మీరు ఆన్‌లైన్‌లో మీకు కావలసినన్నిసార్లు జెనరేట్ చేయొచ్చు. మీ ఆధార్ కార్డ్‌కు భద్రత కల్పించడంతో పాటు, మోసాలు జరిగే ప్రమాదాన్ని ఇది దాదాపుగా తగ్గిస్తుంది.
వర్చువల్ IDని ఎలా జెనరేట్ చేయాలి?
వర్చువల్ IDని రూపొందించడం కూడా చాలా సులభం. దీని కోసం మీరు UIDAI అధికారిక పోర్టల్‌లోకి వెళ్లండి లేదా mAadhaar యాప్‌ను ఉపయోగించండి. UIDAI సైట్‌లోకి వెళ్లి, ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ, వర్చువల్ ID (VID) జనరేటర్‌పై క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఇంకా సింపుల్‌గా కావాలంటే.. myaadhaar.uidai.gov.in/genericGenerateOrRetriveVID డైరెక్ట్ లింక్ ద్వారా మీ 16 అంకెల వర్చువల్ IDని రూపొందించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! - ప్రభుత్వం కరవు భత్యాన్ని ఎంత పెంచుతుందంటే?
Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా "జీరో టాక్స్" - చట్టాన్ని మీ చుట్టం చేసుకోవచ్చు!
Multiple Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా, తగ్గుతుందా?
Dividend: 17 నెలల పసివాడు సంపాదించిన డివిడెండ్ రూ.3.3 కోట్లు - ఎవరీ ఏకాగ్ర?
Gold Creates New Records: 7 రోజుల్లో 5 రికార్డ్‌లు బద్ధలు - అక్షయ తృతీయ నాడు రేటు ఎలా ఉండొచ్చు?
Cheaper Life Insurance: చవకైన జీవిత బీమా కావాలా?, ఈ 7 సింపుల్ ట్రిక్స్ ప్రయత్నించండి
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్ నుంచి ఏపీకి తరలింపు