అన్వేషించండి

Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !

తాడిపత్రిలో జరిగిన ఓ వివాహ వేడుకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు, తెలంగాణ కాంగ్రెస్ నేత మిద్దె శ్రీరామ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగి, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తాడిపత్రి వివాహ వేడుకలో జేసీ-రేవంత్ రెడ్డి వర్గాల ఘర్షణ.
  • జేసీ ప్రభాకర్ రెడ్డి మిద్దె శ్రీరామ్ రెడ్డిని నిలదీసి ఆగ్రహించారు.
  • మంత్రి సమక్షంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
  • జేసీ అనుచరులు శ్రీరామ్ రెడ్డి వాహనాలపై దాడి చేశారు.

High Tension at Tadipatri | తాడిపత్రి: జేసీ బ్రదర్స్ హవా కొనసాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు మిద్దె శ్రీరామ్ రెడ్డి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడికి దిగారని తెలుస్తోంది. జేసీ అనుచరులు శ్రీరామ్ రెడ్డికి చెందిన పలు వాహనాలపై రాళ్ల దాడికి పాల్పడి ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పెళ్లిలో కూడా రాజకీయాలు, రౌడీయిజం చేయడం ఏంటని బాధిత వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.

స్థానిక టీడీపీ నేత సంజీవరెడ్డి కుమారుడి వివాహ వేడుక ఆదివారం తాడిపత్రిలోని ఎస్ ఆర్ టీ ఫంక్షన్ హాల్‌ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు కందిగోపుల మురళి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు, దౌల్తాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ మిద్దె శ్రీరాం రెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే, వేడుకకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో సంజీవరెడ్డి సోదరుడైన మిద్దె శ్రీరామ్‌ రెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు. వెంటనే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లాలని’ డిమాండ్ చేశారు.


Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !

అక్కడే ఉన్న తాడిపత్రి వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రవర్తనపై వెంటనే స్పందించారు. ఫంక్షన్ హాల్ నుంచి మేమెందుకు బయటకు వెళ్లాలి?  అని సూటిగా ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే ఇరువర్గాల నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. తన మాట శ్రీరామ్ రెడ్డి, కందిగోపుల మురళీ వినకపోవడంతో అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి వెళ్లిపయారు. 

Also Read: AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!

జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోయిన కాసేపటికే ఆయన అనుచరులు ఫంక్షన్ హాల్ వద్దకు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ వర్గీయులతో గొడవకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు శ్రీరామ్ రెడ్డి సహా మరికొందరు నేతల కార్లను ధ్వంసం చేయడంతో వివాహానికి వచ్చిన అతిథులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తాడిపత్రిలో రాజకీయ విభేదాలు పెళ్లి ఫంక్షన్లలోనూ ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Frequently Asked Questions

తాడిపత్రి వివాహ వేడుకలో ఉద్రిక్తతకు కారణం ఏమిటి?

జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు మిద్దె శ్రీరామ్ రెడ్డిపై దాడి చేసి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఇది రాజకీయ విభేదాల వల్ల జరిగింది.

వివాదంలో ప్రధానంగా ఎవరు పాల్గొన్నారు?

జేసీ ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు మిద్దె శ్రీరామ్ రెడ్డి, మరియు వైఎస్సార్సీపీ నాయకుడు కందిగోపుల మురళి ఈ వివాదంలో ప్రధానంగా పాల్గొన్నారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?

ఈ ఘటన అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో స్థానిక టీడీపీ నేత సంజీవరెడ్డి కుమారుడి వివాహ వేడుకలో, ఎస్ ఆర్ టీ ఫంక్షన్ హాల్‌లో జరిగింది.

ఉద్రిక్తత ఎలా పెరిగింది?

జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీరామ్ రెడ్డిని బయటకు వెళ్లమని డిమాండ్ చేయగా, కందిగోపుల మురళి ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుచరులు వాహనాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత పెరిగింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget