అన్వేషించండి

UIDAI : స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI

Aadhaar App Mandatory : స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త ఆధార్ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాలేషన్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Aadhaar App Mandatory For All Smartphones : స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త ఆధార్ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాలేషన్ (Pre-installation) చేయాలనే ప్రతిపాదనపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చకు కేంద్ర ప్రభుత్వం ,పరిశ్రమ వర్గాలు తెరదించాయి. ఫోన్లలో ఆధార్ యాప్ ఉండటం తప్పనిసరి కాదని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. 

 ప్రతిపాదన దశలోనే.. ఉత్తర్వులు కావు!                                      

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు, ప్రభుత్వానికి మధ్య ఈ విషయంలో విభేదాలు తలెత్తాయన్న  ప్రచారం జరుగుతోంది.  ఈ ప్రతిపాదన ప్రస్తుతం సంప్రదింపుల దశలోనే ఉందని, దీనిని అమలు చేయాలని ఎవరికీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 2025 నవంబర్‌లో ఐటీ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం వివిధ స్టేక్‌హోల్డర్లతో చర్చలు జరుగుతున్నాయని, దీనిని ఇంకా కంపల్సరీ చేయలేదని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

పేద ప్రజల సౌకర్యం కోసమే ఈ ఆలోచన                       

ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వివరించింది. ముఖ్యంగా తక్కువ ధర కలిగిన ఫోన్లను వాడే పేద ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఈ ఆలోచన చేసినట్లు తెలిపింది.  తక్కువ మెమరీ, పరిమిత వనరులు ఉన్న ఫోన్లు వాడేవారు ప్లే స్టోర్ నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఇన్‌స్టాల్ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అదే ఫోన్ కొనేటప్పుడే అందులో యాప్ ఉంటే వారికి సులభంగా ఉంటుంది. యాప్ స్పేస్ గురించి వారు ఆందోళన చెందాల్సిన పని ఉండదు అని అధికారులు పేర్కొన్నారు.

వినియోగదారులదే తుది నిర్ణయం  

ఒకవేళ ఈ ప్రతిపాదన భవిష్యత్తులో అమల్లోకి వచ్చినా, ఆ యాప్‌ను వాడాలా వద్దా అనేది పూర్తిగా వినియోగదారుల ఇష్టమని ప్రభుత్వం స్పష్టం చేసింది.  గూగుల్ మ్యాప్స్ లాంటి యాప్‌లు ఫోన్లలో ముందే ఎలా వస్తాయో.. ఇది కూడా అంతే. ఫోన్‌లో యాప్ ఉన్నంత మాత్రాన వాడాలని రూల్ ఏమీ లేదు. అది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. వాడటం, వదిలేయడం అనేది యూజర్ల ఛాయిస్ అని అధికారులు వెల్లడించారు.    

ప్రస్తుతానికి ప్రభుత్వం మరియు స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తక్షణమే ఈ యాప్ ఫోన్లలో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget