అన్వేషించండి

MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!

Kamal Haasan Election Symbol: తమిళనాడు ఎన్నికల్లో ఏ గుర్తుపై పోటీ చేయాలో అనే అంశంపై లోకనాయకుడు కమల్‌హాసన్‌కు చిక్కు వచ్చి పడింది. ఉదయించే సూర్యుడి గుర్తుపై పోటీ చేయాలని డీఎంకే ఒత్తిడి చేస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కమల్ హాసన్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు బదులు సూర్యుడు గుర్తుతో పోటీ.
  • DMK సూచనతో ఎన్నికల్లో గెలుపునకు వ్యూహాలు రచిస్తున్నారు.
  • కమల్ హాసన్ పార్టీకి రాజ్యసభతో పాటు రెండు అసెంబ్లీ సీట్లు కేటాయింపు.
  • వేరే గుర్తుతో పోటీ చేస్తే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని నాయకుల అభిప్రాయం.

Kamal Haasan MNM Election Symbol: తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపే లక్ష్యంగా పార్టీ వ్యూహప్రతి వ్యూహాలతో పరీక్షను ఎదుర్కోవాలని సిద్ధమవుతున్నారు. అందుకే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఈ పరిస్థితిలో లోకనాయుకుడు కమల్ హాసన్‌కు అనుకోని చిక్కు వచ్చి పడింది. ఆయన పార్టీ గుర్తు టార్జ్ లైట్ కాదని, తమ గుర్తు ఉదయించే సూర్యుడు సింబల్‌పై పోటీ చేయాలని డీఎంకే ఒత్తిడి తీసుకొస్తోంది. దీనికి కమల్ హాసన్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా సాయంత్రం ప్రకటించనున్నారు. 

ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నేతృత్వంలోని కూటమిలో భాగస్వామిగా ఉన్న కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మైయం (MNM) ఇప్పుడు చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. తన బ్రాండ్‌గా ఉన్న టార్చ్‌లైట్ (కాగడా) గుర్తుతోనే ఎన్నికలకు వెళ్లాలని భావించారు. గత ఎన్నికల్లో ఆయనకు అనుకున్న సీట్లు రాకపోయినా మంచి ఓట్లు మాత్రం వచ్చాయి. అందుకే ఆయనకు కాగడా గుర్తును శాశ్వత గుర్తుగా మార్చేశారు. అయితే ఇప్పుడు ఆ గుర్తును వదిలి డీఎంకే గుర్తు ఉదయించే సూర్యుడు గుర్తుపై పోటీ చేయాలని స్టాలిన్ ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.  

డీఎంకే కూటమిలో చేరిన కమల్‌ హాసన్‌కు ఒక రాజ్యసభ సీటు కేటాయించారు. అంతే కాకుండా ఆయనకు ఉన్న పేరును దృష్టిలో పెట్టుకొని మరో రెండు అసెంబ్లీ సీట్లు కూడా కేటాయించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఆ రెండు అసెంబ్లీ సీట్లలో కూడా డీఎంకే సింబల్‌తోనే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే కమల్ హాసన్ హవా రాజకీయంగా తగ్గిందని డీఎంకే భావిస్తోంది. అందుకే ఆయన తన కాగడా గుర్తుతో పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇది ప్రత్యర్థి పార్టీలకు మేలు చేస్తుందని కూడా చెబుతున్నారు.  

గెలుపొందేందుకు ఉన్న ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకూడదని స్టాలిన్ వ్యూహం రచిస్తున్నారు. అందుకే తనతో కలిసి వచ్చే చిన్న చిన్న మిత్ర పక్షాలను డీఎంకే గుర్తుపై పోటీ చేయంచాలని ప్లాన్ చేస్తున్నారు. దీని వల్ల ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉండదని, పోల్ మేనేజ్మెంట్ కూడా ఈజీ అవుతుందని స్కెచ్ వేశారు. అన్నింటి కంటే ముఖ్యంగా రేపు సీట్లు అటు ఇటు తేడాగా వచ్చినా వారు కూటమి నుంచి వెళ్లిపోయే ఛాన్స్ ఉండదనే దీర్ఘ ఆలోచనతో ఈ ఎత్తుగడ వేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

డీఎంకే ఎత్తుగడ ఎలా ఉన్నా కమల్‌హాసన్ ఇలా వేరే పార్టీ గుర్తుపై పోటీ చేస్తే మాత్రం పార్టీకి భారీ నష్టం జరుగుతుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పార్టీ రోజురోజుకు బలహీనపడుతుందని, గుర్తుపై పోటీ చేయకుంటే పార్టీని ఎవరూ కాపాడలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టాలిన్ కూటమిలో భాగస్వాములుగా ఉన్న వారికి సీట్ల కేటాయింపును పూర్తి చేశారని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 28 అసెంబ్లీ స్థానాలు, 2 రాజ్యసభ సీట్లు, ఎండీఎంకేకు 4 అసెంబ్లీ స్థానాలు, సీపీఐకి ఐదు అసెంబ్లీ స్థానాలు, కమల్‌హాసన్ పార్టీకి రెండు, ఇడియన్ యూనయన్ ముస్లీం లీగ్‌కు రెండు, కొంగునాడుమక్కల్ నేషనల్ పార్టీకి రెండు స్థానాలు కేటాయించారు. మిగతా పార్టీలకు కూడా సీట్ల కేటాయింపులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అటు విజయకాంత్ స్థాపించిన డీఎండీఏకే నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఒక రాజ్యసభ ఇస్తామని చెప్పారు. అయితే వాళ్లు మాత్రం ఆరు అసెంబ్లీ సీట్లు కోరుతున్నారు.  

Frequently Asked Questions

కమల్ హాసన్ పార్టీ ఎన్నికల్లో ఏ గుర్తుపై పోటీ చేయనుంది?

కమల్ హాసన్ పార్టీ మొదట టార్చ్ లైట్ గుర్తుపై పోటీ చేయాలని భావించింది. కానీ ఇప్పుడు డీఎంకే ఒత్తిడి మేరకు ఉదయించే సూర్యుడు గుర్తుపై పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

డీఎంకే పార్టీ కమల్ హాసన్ పార్టీపై ఎందుకు ఒత్తిడి తెస్తోంది?

ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని, ప్రత్యర్థి పార్టీలకు మేలు చేస్తుందని డీఎంకే భావిస్తోంది. అందువల్ల, డీఎంకే గుర్తుపై పోటీ చేస్తే ఓట్లు చీలిపోకుండా ఉంటాయని వారి ఆలోచన.

కమల్ హాసన్ పార్టీకి డీఎంకే కూటమిలో ఎన్ని సీట్లు కేటాయించారు?

కమల్ హాసన్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు, రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అయితే, అసెంబ్లీ సీట్లలో కూడా డీఎంకే గుర్తుతోనే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు.

కమల్ హాసన్ పార్టీ నాయకులు వేరే గుర్తుపై పోటీ చేయడంపై ఏమంటున్నారు?

కమల్ హాసన్ వేరే పార్టీ గుర్తుపై పోటీ చేస్తే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ రోజురోజుకు బలహీనపడుతుందని, గుర్తుపై పోటీ చేయకుంటే పార్టీని ఎవరూ కాపాడలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget