అన్వేషించండి

Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!

Telangana 22A Land Issues:తెలంగాణ దశాబ్దాలుగా ప్రజలను వేధిస్తున్న 22ఏ సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అధికారులకు మంత్రి మూడు రోజులు గడువు పెట్టారు. ప్రతి సోమవారం సమీక్షించాలని సూచించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో 22A ఆస్తుల రిజిస్ట్రేషన్ అడ్డంకి తొలగింపుకు ప్రభుత్వం సిద్ధం.
  • ప్రభుత్వ, ప్రైవేటు భూములను బై-నెంబర్లతో వేరుచేసి రిజిస్ట్రేషన్లు సులభతరం.
  • 22A దరఖాస్తులు మూడు రోజుల్లో పరిశీలన, ఆన్‌లైన్ డేటా తప్పనిసరి.
  • కలెక్టర్లు వారానికోసారి సమీక్ష, తప్పుచేసిన అధికారులపై చర్యలు.

Telangana 22A Land Issues:తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రధాన అడ్డంకిగా మారిన నిషేధిత ఆస్తుల జాబితా(22A) సమస్యకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం స్థలాలు, ప్రైవేటు భూములు కలిసి ఉండటం వల్ల తలెత్తుతున్న సాంకేతిక ఇబ్బందులు తొలగించి, అర్హులైన సామాన్య ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ పని మొదలు పెట్టింది. 

ఏంటీ 22A సమస్య? ఎందుకు జాప్యం జరుగుతోంది?

రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమితోపాటు ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా ఉన్నాయి. గతంలో ఏదైనా సర్వే నంబర్‌లో కొంత భాగం ప్రభుత్వం భూమి ఉంటే, ఆ సర్‌వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితా(22A)లో చేర్చేవారు. దీని వల్ల ఆ సర్వే నంబర్‌ పరిధిలో ఉన్న ప్లాట్లు లేదా ఇళ్లు కొన్న సామాన్య ప్రజలు తమ ఆస్తులను అమ్ముకోవాలన్నా, వేరొకరికి ట్రాన్స్‌ఫర్‌ చేయాలన్నా రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్‌- మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేంటి?

రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సబ్‌రిజిస్ట్రార్‌తో సమీక్ష నిర్వహించారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. సర్వే నంబర్‌లలోని ప్రభుత్వ భూమిని , ప్రైవేటు భూమిని వేరు చేస్తూ బై నెంబర్లు ఇవ్వడం ద్వారా స్పష్టత తీసుకురావాలని నిర్ణయించారు. దీని వల్ల ప్రభుత్వం భూమి మాత్రమే నిషేధిత జాబితాలో ఉంటుంది. మిగిలిన ప్రైవేటు భూమికి రిజిస్ట్రేషన్‌ మార్గం సుగమం అవుతుంది. 

22ఎ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ వచ్చే దరఖాస్తులను కేవలం మూడు రోజుల్లోనే పరిశీలించి, అవి పరిష్కారానికి అర్హమైనవా కావా అని తేల్చాలని స్పష్టం చేశారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన అన్ని జీవోలు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే - అవుట్‌ అనుమతులను ఆగస్టు 14వ తేదీలోగా ఆన్‌లైన‌లో అప్‌లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇకపై పీఓపీ దరఖాస్తులను తహశీల్దార్లకు పంపకుండా, నేరుగా కలెక్టర్లకే పంపాలని స్పష్టం చేశారు. తద్వారా నిర్ణయ ప్రక్రియ వేగవంతం అవుతుందని అన్నారు. 

జిల్లాల వారీగా పరిస్థితి 

ప్రస్తుతం ప్రభుత్వానికి అంది 950 దరఖాస్తుల్లో అత్యధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నుంచి 575 వినతులు వచ్చాయి. వీటిలో ప్రాథమికంగా 300 దరఖాస్తులు పరిష్కారానికి అర్హమైనవిగా గుర్తించారు. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లో కూడా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హెచ్‌ఎండీఏ లే-అవుట్లు, ప్రభుత్వ వేలం వేసిన భూములు కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల 22Aజాబితాలో చిక్కుకుపోయాయి. వీటికి కూడా మోక్షం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 

గతంలో జీవో 59, 166 వంటి వాటి ద్వారా ప్రభుత్వం భూముల్లోని నివాసాలను క్రమబద్ధీకరించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబర్లను అప్‌డేట్ చేయకపోవడంతో అవి ఇంకా ప్రభుత్వం భూములుగానే చూపిస్తున్నాయి. సబ్‌రిజిస్ట్రార్‌లు డాక్యుమెంట్‌లను క్షుణ్ణంగా పరిశీలించకుండానే, సర్వే నంబర్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిలిపి వేస్తున్నారు. ఇకపై ఆన్‌లైన్ డేటా ఆధారంగా మాత్రమే సబ్‌రిజిస్ట్రార్లు పనిచేయాలని, వారికి అదనపు అధికారాలు ఉండవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

22A సమస్యల పరిష్కారంపై ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్లు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. సబ్‌రిజిస్ట్రార్‌లకు కూడా పహానీలను చూసే విధంగా ఆన్‌లైన్‌ వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు. 

ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో రాజీ పడబోమని చెప్పిన మంత్రి పొంగులేటి, అమాయక ప్రజలు తమ సొంత ఆస్తుల విషయంలో ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పు చేసినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Frequently Asked Questions

22A సమస్య అంటే ఏమిటి?

అనేక సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమితోపాటు ప్రైవేటు భూమి కూడా ఉంది. గతంలో, కొంత భాగం ప్రభుత్వ భూమి ఉన్నా మొత్తం సర్వే నంబర్‌ను 22A జాబితాలో చేర్చేవారు. దీని వల్ల ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

22A సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి?

సర్వే నంబర్లలోని ప్రభుత్వ, ప్రైవేటు భూములను బై నంబర్లు ఇచ్చి వేరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వ భూమి మాత్రమే నిషేధిత జాబితాలో ఉంటుంది, ప్రైవేటు భూమి రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం అవుతుంది.

22A జాబితా నుంచి తొలగించాలని కోరుతూ వచ్చే దరఖాస్తులను ఎంత వేగంగా పరిశీలిస్తారు?

22A జాబితా నుంచి తొలగించాలని కోరుతూ వచ్చే దరఖాస్తులను కేవలం మూడు రోజుల్లోనే పరిశీలించి, అవి పరిష్కారానికి అర్హమైనవా కావా అని తేల్చాలని ఆదేశించారు.

22A సమస్య ఎక్కువగా ఏ జిల్లాల్లో ఉంది?

ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అనేక దరఖాస్తులు ఈ జిల్లాల నుంచే వచ్చాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget