అన్వేషించండి

Aadhaar Card Safety Tips 2026: ఆధార్ భద్రతకు మూడు సూత్రాలు! సైబర్ మోసాలకు చెక్ పెట్టే టిప్స్‌!

డిజిటల్ ఇండియాలో ఆధార్ కార్డు అనేది కేవలం ఒక గుర్తింపు కార్దు మాత్రమే కాదు. అది ప్రభుత్వ, ప్రైవేటు సేవలను అనుసంధానించే ఒక డిజిటల్ గ్లూ. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు దీనికి భద్రత చాలా అవసరం.

Aadhaar Card Safety Tips 2026: భారత్‌లో డిజిటల్ విప్లవం వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆధార్ కార్డు అనేది పౌరుల ఆర్థిక, సామాజిక సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ  ఆఫ్ ఇండియా జారీ చేసిన ఈ గుర్తింపు సంఖ్య నేడు బ్యాంకింగ్ రంగం నుంచి సిమ్ కార్డుల వరకు ప్రతి చోటా అనివార్యమైంది. అయితే ఇదే టైంలో మోసగాళ్లు కూడా ఆధార్‌ను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాల స్కామ్‌లకు పాల్పడుతున్నారు. 

ఆధార్ కార్డు అనేది ఒక వ్యక్తి వేలిముద్రలు, ఐరీస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలతో అనుసంధానమై ఉంటుంది. పాన్ కార్డు లేదా పాస్ పోర్టు వంటి ఇతర పత్రాల కంటే ఆధార కార్డు భిన్నమైంది. ఇది ఒక వ్యక్తి ఒకే అవసరం కోసం ఒకటి కంటే ఎక్కువ ఐడీలను కలిగి ఉండకుండా నిర్దారిస్తుంది. ప్రస్తుతం ఇది కేవైసీ ద్వారా బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 

ఆధార్ కార్డు వ్యక్తిగత సమాచారంతోపాటు బయోమెట్రిక్‌ వివరాలను కలిగి ఉంటుంది. కాబట్టీ ఇది సైబర్ నేరాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఆధార్ నంబర్‌ను ఉపయోగించి అనధికారికంగా నగదు  ఉపసంహరణ చేయడం లేదా ఇతర గుర్తింపు మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే మీ డేటాను బుల్లెట్ ప్రూఫ్ చేసుకోవడం చాలా అవసరం. 

మీ ఆధార్ కార్డును భద్రంగా ఉంచుకోవడానికి మూడు కీలక విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మీరు mAadhaar యాప్ లేదా అధికారిక UIDAI పోర్టల్‌ను ఉపయోగించి మీ బయోమెట్రిక్‌ వివరాలను లాక్ చేయవచ్చు. దీని వల్ల మీరు స్వయంగా వాటిని అన్ లాక్ చేసే వరకు ఎవరూ మీ ఆధార్ ఆధారిత పేమెంట్స్ సిస్టమ్‌ లావాదేవీలను నిర్వహించలేరు. హోటల్‌ బుకింగ్‌‌లు లేదా కొత్త సిమ్‌ కార్డులు తీసుకోవడం వంటి బ్యాంకింగ్ కాని అవసరాల కోసం మీ అధార్ కాపీని ఇచ్చేటప్పుడు మాస్క్డ్‌ ఆధార్‌ను ఉపయోగించండి. ఇది మీ ఆధార్‌లోని మొదటి 8 అంకెలను హైడ్ చేసి కేవలం చివరి నాలుగు అంకెలను చూపిస్తుంది. దీని వల్ల పూర్తి ఐడీ బయటకు తెలియదు. UIDAI వెబ్‌సైట్‌లో క్రమం తప్పకుండా మీ ఆధార్ అథంటికేషన్ హిస్టరీని చెక్ చేయండి. దీని ద్వారా మీ అనుమతి లేకుండా ఎవరైనా లేదా ఏదైనా సంస్థ మీ గుర్తింపును ధృవీకరించడానికి ప్రయత్నించిందో లేదే మీరు తెలుసుకోవచ్చు. 

ఆధార్‌ నంబ్‌ అనేది కేవలం ఒక గుర్తింపు సాధనం మాత్రమే, అతి తనంతట తానుగా పని చేసే కీ కాదు. మీరు మీ ఓటిపీని ఎవరికీ చెప్పకుండా జాగ్రత్త పడటం, మీ బయోమెట్రిక్స్‌ను లాక్ చేసి ఉంచినంత కాలం మీరు డబ్బు, సమాచారం సురక్షితంగా ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget