అన్వేషించండి

TDP Lokesh regime: టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ చరిత్రలో కీలక ఘట్టం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ. చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, లోకేష్ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.

Lokesh era Starts in TDP:  తెలుగుదేశం పార్టీలో అధికారికంగా నాయకత్వ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి.   252 మందితో కూడిన నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం బాధ్యతల్లోకి వచ్చింది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం చంద్రబాబు కుమారుడిగా కాకుండా,  ఐదేళ్లలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో తిరిగి,  యువగళం పాదయాత్ర ద్వారా కేడర్‌లో భరోసా నింపిన లోకేష్‌కు ఇది లభించిన అసలైన గుర్తింపు. ఇప్పుడు అధికారిక హోదాతో పార్టీ పగ్గాలు చేపట్టడం ద్వారా టీడీపీలో లోకేష్ శకం ప్రారంభమవుతోందని అనుకోవచ్చు. 

లోకేష్ చేతుల్లోకి పార్టీ 

లోకేష్‌కు కొత్త బాధ్యతలు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉన్నందున, పార్టీ వ్యవహారాలను నమ్మకమైన, చురుకైన చేతుల్లో పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకోవడం వల్ల చంద్రబాబు కేవలం సూపర్ విజన్ కే పరిమితమై, పార్టీ వ్యూహరచనలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా అటు ప్రభుత్వం, ఇటు పార్టీ రెండూ బ్యాలెన్స్‌డ్‌గా నడవాలన్నదే అధిష్టానం ఆలోచన.

లోకేష్ ఆలోచన మేరకే కార్యవర్గం 

లోకేష్ తన ఇమేజ్‌ను మార్చుకోవడంలో విజయవంతమయ్యారు. 2019లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, గ్రౌండ్ లెవల్‌లో కార్యకర్తలతో మమేకమై వారి కష్టసుఖాల్లో తోడు నిలిచారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా, ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు తన టీమ్  తో కలిసి పని చేసే క్రమంలో, పార్టీలో తనదైన ముద్ర వేయడమే కాకుండా 2029 లక్ష్యంగా యువతను పెద్ద ఎత్తున పార్టీ వైపు ఆకర్షించే బాధ్యత ఆయనపై ఉంది.

పార్టీని జెన్ జీ కి దగ్గర చేసే పనితీరు

నూతన కార్యవర్గంలో 252 మందికి చోటు కల్పించడం వెనుక సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే, ఇటు యువతకు పెద్దపీట వేయడం ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. లోకేష్ సారథ్యంలో పని చేసే ఈ టీమ్.. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వంతెనలా పని చేయాల్సి ఉంటుంది. 

నారాలోకేష్‌కు అంత తేలిక కాదు!

లోకేష్‌కు ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిదే. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం ఒక ఎత్తు అయితే, ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీని పటిష్టం చేయడం మరో ఎత్తు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన లోకేష్, ఇప్పుడు తన పరిపాలన దక్షతను పార్టీ వ్యవహారాల్లో ఎలా చూపిస్తారో వేచి చూడాలి.   ప్రమాణస్వీకారం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు.. అది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ దిశను నిర్దేశించే ఒక నూతన అధ్యాయం అనుకోవచ్చు.                               

 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Cockroach Janata Party South India: దక్షిణాదిలో తేలిపోయిన కాక్రోచ్ ఉద్యమాలు - ఉత్తరాది ట్రెండ్స్‌ను దక్షిణ భారత యువత తిరస్కరిస్తోందా?
దక్షిణాదిలో తేలిపోయిన కాక్రోచ్ ఉద్యమాలు - ఉత్తరాది ట్రెండ్స్‌ను దక్షిణ భారత యువత తిరస్కరిస్తోందా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget