అన్వేషించండి

Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్

Maoists surrender : దేవ్‌జీ దళానికి చెందిన మావోయిస్టులంతా సరెండర్ అయ్యారు. సరెండర్ అయ్యే వారందరికీ భద్రత, ప్యాకేజీ కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Maoists surrender in the presence of CM Revanth Reddy:  తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత , జనజీవన స్రవంతిలోకి వారిని ఆహ్వానించే క్రమంలో ఒక భారీ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఏకంగా 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించి లొంగిపోయారు. దశాబ్దాల కాలంగా అడవుల్లో సాయుధ పోరాటం చేస్తున్న ఇంతటి భారీ సంఖ్యలో సభ్యులు ఒకేసారి లొంగిపోవడం రాష్ట్ర శాంతిభద్రతల చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో డిజిపి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 అగ్రశ్రేణి నాయకత్వం లొంగుబాటు 

లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నారు.  మొత్తం 130 మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు , ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు , 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు  , 46 మంది ఏరియా కమిటీ సభ్యులు ,  70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. పార్టీ వ్యూహరచనలో,  కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించే ఇంతమంది అగ్రశ్రేణి నేతలు లొంగిపోవడం వల్ల మావోయిస్టు క్యాడర్‌కు పెద్ద దెబ్బ తగిలినట్లయింది.   

 భారీగా ఆయుధాల అప్పగింత

కేవలం వ్యక్తులు మాత్రమే కాకుండా, అత్యాధునిక ఆయుధాలను కూడా వారు పోలీసులకు అప్పగించారు. మొత్తం 124 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 1 ఇన్సాస్ ఎల్ఎంజి  రైఫిల్, 31 ఏకే-47 రైఫిళ్లు, 21 ఇన్సాస్ రైఫిళ్లు, 20 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 18 .303 రైఫిళ్లు,  ఇతర 33 రకాల ఆయుధాలు ఉన్నాయి.                         

 ప్రభుత్వ భరోసా - పునరావాసం 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హింసను వీడి జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున ప్రకటించిన పునరావాస ప్యాకేజీలను తక్షణమే అందిస్తామని, వారి కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా, చర్చలు మరియు ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమస్యల పరిష్కారం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.  130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు. లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నాం. శాంతియుత మార్గాలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. గణపతి ఆరోగ్యం బాగోలేదని తెలిసిందని.. ఆయన సరెండర్ అయితే రక్షణ కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.                       


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Public Meeting: ఈ 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ఏడాది తరువాత మళ్లీ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ బాస్!
రేపు జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ఏడాది తరువాత మళ్లీ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ బాస్!
తెలంగాణలో మహిమాన్విత నారసింహ క్షేత్రాలివే!
తెలంగాణలో మహిమాన్విత నారసింహ క్షేత్రాలివే!
Free MMTS Travel In Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం
Zolgensma injection cost:  పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
 పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Embed widget