అన్వేషించండి

T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు

IND vs NZ Final Highlights: భారత్ రికార్డ్ స్థాయిలో మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా సరికొత్త చరిత్ర లిఖించింది.

T20 World Cup Winner 2026: భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 కైవసం చేసుకోవడంలో భాగంగా పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని డిఫెండ్ చేసిన (వరుసగా రెండోసారి గెలిచిన) తొలి దేశంగా భారత్ అవతరించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 255 పరుగులు చేయగా, ప్రత్యర్థి కివీస్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. 

చరిత్ర సృష్టించిన భారత జట్టు

ఇప్పటివరకు వెస్టిండీస్, ఇంగ్లాండ్ కూడా రెండు సార్లు చొప్పున టీ20 వరల్డ్ ఛాంపియన్‌లుగా నిలిచాయి. అయితే టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని 3 సార్లు సాధించిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇండియా 2007లో నిర్వహించిన తొలి టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో తాజాగా టైటిల్ నిలుపుకుంది. ఏ జట్టు కూడా టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలవలేదు. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా కూడా భారత్ రికార్డు సృష్టించింది.

ఫైనల్‌లో అత్యధిక స్కోరు

టాస్ ఓడిపోయిన తర్వాత భారత జట్టు ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలతో పాటు ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్‌లతో అర్ధ సెంచరీలు సాధించారు. శాంసన్ 89 పరుగులు చేయగా, ఈ వరల్డ్ కప్‌లో అతనికిది వరుసగా మూడో అర్ధ సెంచరీ కావడం విశేషం. కాగా, ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు చేజారాయి. మరోవైపు అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు చేయగా.. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్ కిషన్ కూడా 25 బంతుల్లో 54 పరుగుల సహకారాన్ని అందించాడు. నాకౌట్ మ్యాచులలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు.

భారత్ 5 వికెట్లకు 255 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు రికార్డు కూడా భారత్ పేరిటే ఉండేది, 2024 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ 176 పరుగులు చేసింది. ఇప్పుడు ఇండియా తన సొంత రికార్డును మెరుగుపరుచుకుంటూ ఏకంగా 255 పరుగులు సాధించింది.

96 పరుగుల భారీ విజయం

256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు రేసులో ఉన్నట్లు కనిపించలేదు. టిమ్ సీఫెర్ట్ చేసిన 52 పరుగులు, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన 43 పరుగుల ఇన్నింగ్స్ మినహా ఏ కివీస్ బ్యాటర్ కూడా కనీసం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. పవర్ ప్లేలో వికెట్ కూడా కోల్పోకుండా 6 ఓవర్లలో ఏకంగా 92 పరుగులు చేసింది శాంసన్, అభిషేక్ జోడీ. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు ఇది.

భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. కానీ అంతకుముందే స్పిన్నర్ అక్షర్ పటేల్ ముగ్గురు బ్యాటర్లను అవుట్ చేసి కివీస్‌ను దెబ్బకొట్టాడు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ కూడా తలో వికెట్ తీసుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026: CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్
CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్ Viral Video
IPL 2026 SRH VS CSK Result Update: హ‌మ్మ‌య్య స‌న్ గెలిచింది.. చివ‌రి బంతికి గెలిచిన SRH.. స‌త్తా చాటిన మ‌లింగా, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో చెన్నై బోల్తా
హ‌మ్మ‌య్య స‌న్ గెలిచింది.. చివ‌రి బంతికి గెలిచిన SRH.. స‌త్తా చాటిన మ‌లింగా, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో చెన్నై బోల్తా
IPL 2026 CSK VS SRH Live Updates: స‌న్ రైజ‌ర్స్ డీసెంట్ స్కోరు.. అద‌ర‌గొట్టిన అభిషేన్, క్లాసెన్, రాణించిన కాంభోజ్, ఒవ‌ర్ట‌న్, CSKతో మ్యాచ్
స‌న్ రైజ‌ర్స్ డీసెంట్ స్కోరు.. అద‌ర‌గొట్టిన అభిషేన్, క్లాసెన్, రాణించిన కాంభోజ్, ఒవ‌ర్ట‌న్, CSKతో మ్యాచ్
Abhishek Sharma Fastest Fifty: ఐపీఎల్ కెరీర్‌లో అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. CSKపై మెరుపు ఇన్నింగ్స్
ఐపీఎల్ కెరీర్‌లో అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. CSKపై మెరుపు ఇన్నింగ్స్
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Embed widget