అన్వేషించండి

Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు

Nara Lokesh Foundation Stone Laid for Retaining Wall at Tadepalli | ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు.

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్నారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. తన సొంత నియోజకవర్గంలోని తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీల వరకు కృష్ణా నది కుడివైపు రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడ (Retaining Wall)ను నిర్మించనున్నారు. 

ఎన్నికల హామీని నిలబెట్టుకున్న నారా లోకేష్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు.  దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు కేవలం ఏడాది కాలంలోనే రూ.294.20 కోట్ల పరిపాలన అనుమతులు సాధించడంతో పాటు టెండర్ ప్రక్రియను కూడా పూర్తిచేశారు. భవిష్యత్ లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పట్టిష్టమైన డిజైన్ తో మహానాడులో రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నారు.


Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు

కేవలం సాధారణ గోడ కాకుండా భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేయనున్నారు. పైల్- రాఫ్ట్ సాంకేతికతతో భూకంపాలతో పాటు నీటి ధృతిని తట్టుకునేలా నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తైతే  మహానాడు కాలనీ, సుందరయ్య నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50వేల మంది ప్రజలు వరద సమస్య నుంచి విముక్తి పొందుతారు. రాజధాని అమరావతి పరిధిలోని కీలక ప్రాంతాలకు, జాతీయ రహదారి-65కు రిటైనింగ్ వాల్ రక్షణగా నిలవనుంది.


Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు దాసరి కృష్ణ, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nidadavolu - Duvvada Railway Line: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నిడదవోలు - దువ్వాడ మధ్య 10వేల కోట్లతో కొత్త రైల్వే లైన్
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
PM Matru Vandana Yojana: మహిళలకు రూ.11 వేలు ఆర్థిక సాయం.. పీఎం మాతృ వందన స్కీమ్ వివరాలివే!
మహిళలకు రూ.11 వేలు ఆర్థిక సాయం.. పీఎం మాతృ వందన స్కీమ్ వివరాలివే!
Narasapuram -Tirupati Train: నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs 2026: మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు -  ప్రకాష్ రాజ్ రియాక్షన్
IPL 2026: CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్
CSK బ్యాటర్ ఔటవ్వాలని SRH ఫ్యాన్ చేతబడి.. రిజల్ట్ చూస్తే షాక్ Viral Video
US Iran War Updates: హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
హర్మూజ్‌పై మరోసారి ఉద్రిక్తత- ఇరాన్ బ్లాక్ మెయిల్ చేసే స్థితిలో లేదన్న డొనాల్డ్ ట్రంప్
Shruti Haasan: ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది
Love Failure: అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
అమ్మను బాగా చూసుకోండి బాబాయ్.. ప్రేమ విఫలమై తిరుపతిలో విద్యార్థి ఆత్మహత్య
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Suzuki Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి
Koratala Siva: దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్
Embed widget