అన్వేషించండి

Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత

Khammam Kaviha: ఖమ్మంలో కవిత వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఖమ్మం ఆర్డీవో కవితతో చర్చలు జరిపినప్పటికీ, ఆమె తన పట్టు వీడలేదు.

Kavitha is fighting for Velugumatla people:  ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల బాధితుల పక్షాన నిలుస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జెడ్పీ సెంటర్ వద్ద బాధితులతో కలిసి ఆమె బైఠాయించడంతో భారీగా నిరసన వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఖమ్మం ఆర్డీవో కవితతో చర్చలు జరిపినప్పటికీ, ఆమె తన పట్టు వీడలేదు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఇక్కడికి వచ్చి, వెలుగుమట్ల బాధితులకు వారు గతంలో ఉన్న చోటే ఇంటి పట్టాలు మరియు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చే వరకు ఈ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని ఆమె తెగేసి చెప్పారు.

ఈ సందర్భంగా కవిత  స్థానిక మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థుల పుస్తకాలతో సహా ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అత్యంత అమానుషమని ఆమె మండిపడ్డారు.  ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే ఇంటికి మంచిది కాదు, అలాంటిది ఇంతమంది మహిళల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఈ పేదల ఉసురు ఖచ్చితంగా ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు తగులుతుంది అని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో పేదల ఇళ్లపైనే జులుం నడుస్తోందని, పెద్దల భవనాల జోలికి వెళ్లని బుల్డోజర్లు పేదల ఇళ్ల మీదకు రావడం రాజ్యాంగాన్ని కూనీ చేయడమేనని ఆమె విమర్శించారు.              

గతంలో వెలుగుమట్ల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భోజనాలు, హెల్త్ క్యాంపులు పెడుతూ తమ పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తోందని కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాధితుల ఆవేదనను కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఒక  ఎగ్జిబిషన్ లా చూసి వెళ్తున్నాయని, కానీ తాను మాత్రం సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు. బాధితులను ఒక కొట్టంలో వేసినట్లు ఇక్కడకు తెచ్చి పడేశారని, కనీసం మహిళలకు కనీస వసతులు కానీ, ఆరోగ్య శిబిరాలు కానీ ఏర్పాటు చేయకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.

జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఎవరికీ బాధితుల కష్టాలు పట్టడం లేదని, కనీసం జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటి వరకు బాధితులను పరామర్శించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత విమర్శించారు.  మా డిమాండ్ ఒక్కటే.. ఎక్కడైతే పేదల ఇళ్లను నేలమట్టం చేశారో, అదే స్థలంలో వారికి కొత్త ఇళ్లు కట్టించి ఇవ్వాలి. వేరే చోటికి వెళ్లమంటే మేము ఒప్పుకోము అని ఆమె డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీలు, ధర్మ సమాజ్ పార్టీ , ప్రజా సంఘాలతో కలిసి సమగ్ర కార్యాచరణతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆమె ప్రకటించారు.

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Jagtial Emotional Friendship Story: నిజాయితీకి నిలువెత్తు రూపం! 25 ఏళ్ల నాటి అప్పు తీర్చేందుకు కేరళ నుంచి తెలంగాణ కొచ్చిన ఇస్మాయిల్!
నిజాయితీకి నిలువెత్తు రూపం! 25 ఏళ్ల నాటి అప్పు తీర్చేందుకు కేరళ నుంచి తెలంగాణ కొచ్చిన ఇస్మాయిల్!
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
Embed widget