T20 World Cup Prize Money: టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి టీమ్ ఇండియా ఛాంపియన్‌గా నిలిస్తే భారీ ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి ఈ ట్రోఫీ నెగ్గిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.

T20 World Cup 2026 Prize Money: నెల రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన టీ20 వరల్డ్ కప్ ముగిసింది. మార్చి 8న రాత్రి జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్ స్టేజ్, ఆపై సూపర్-8, సెమీఫైనల్ సవాళ్లను అధిగమించి టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడ్డాయి. అయితే టీ20 వరల్డ్ కప్ నెగ్గిన జట్టుకు, రన్నరప్, ఇతర జట్లకు ప్రైజ్ మనీ రూపంలో ఎంత లభిస్తుందో పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. స్తే ఎంత నగదు అందుకోనుందో ఇక్కడ తెలుసుకోండి:
విజేతకు దక్కే ప్రైజ్ మనీ ఎంత?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), టీ20 వరల్డ్ కప్ 2026 కోసం 13.5 మిలియన్ అమెరికా డాలర్ల ప్రైజ్ పూల్‌ను నిర్ణయించింది. ఈ మొత్తం భారత కరెన్సీలో రూ. 120 కోట్లకు పైగా ఉంటుంది. ఈ 120 కోట్ల నుండే విజేత, రన్నరప్, ఇతర జట్లకు ప్రైజ్ మనీ పంపిణీ చేస్తారు.
🚨 T20 WORLD CUP PRIZE MONEY IN EVERY EDITION IN INDIAN RUPEES 🚨
— VIKAS (@Vikas662005) March 8, 2026
2007 - 2.02 CR
2009 - 3.63 CR
2010 - 4.57 CR
2012 - 5.34 CR
2014 - 6.71 CR
2016 - 10.75CR
2021 - 12.00 CR
2022 - 13.20 CR
2024 - 20.42 CR
2016 - 27.48 CR.......See more pic.twitter.com/ETr5fp82nu
విజేతగా నిలిచిన భారత జట్టుకు 3 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 27.48 కోట్లకు సమానం. ఫైనల్‌లో ఓడిపోయిన న్యూజిలాండ్ (రన్నరప్) జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 14.65 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.
మిగిలిన జట్లపై కూడా కాసుల వర్షం
కేవలం ఫైనల్‌కు చేరిన జట్లకే కాకుండా, సెమీఫైనల్‌లో ఓడిపోయిన జట్లకు భారీగా నజరానా లభిస్తుంది. సెమీఫైనల్‌లో ఓడిపోయిన ప్రతి జట్టుకు సుమారు రూ. 7.24 కోట్లు ఇస్తుంది ఐసీసీ. ఇక సూపర్-8కి చేరుకుని సెమీఫైనల్‌కు వెళ్లలేకపోయిన ప్రతి జట్టుకు దాదాపు రూ. 3.48 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తాయి.
గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయిన ప్రతి జట్టుకు దాదాపు రూ. 2.29 కోట్లు అందిస్తుంది. 2024 టీ20 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని 20 శాతం వరకు భారీగా పెంచారు. తరువాత బీసీసీఐ సైతం ఛాంపియన్ భారత జట్టుకు ప్రత్యేక నగదు బహుమతులు ప్రకటించనుందని తెలిసిందే.
ట్రెండింగ్ వార్తలు

















