Australia Vs England 1st Test Ashes 2025 | యాషెస్‌లో చెలరేగిన బౌలర్లు
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ లో మొదటి రోజు బౌలర్లు చెలరేగారు. తొలి రోజే 19 వికెట్లు కుప్పకూలాయి. వచ్చినవాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్‌కు చేరారు. స్టార్క్ తూఫాన్ బౌలింగ్ కు ఇంగ్లండ్ కుప్పకూలితే.. స్టోక్స్ దెబ్బకు ఆసీస్ అతలాకుతలమైంది. చారిత్రాత్మక యాషెస్ సిరీస్ తొలి రోజు చాలా ఆసక్తికరంగా మారింది.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ 32.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో సెషన్ ముగిసేలోపే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు పడగొట్టగా, బ్రెండన్ డాగెట్ రెండు, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ జేక్ వెథరాల్డ్‌ను ఆర్చర్ ఎల్‌బీడబ్ల్యూ అవుట్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ వికెట్ ను కాపాడుకుంటూ రన్స్ చేస్తున్నారు. కానీ కొద్దిసేపటికే బెన్ స్టోక్స్ ఇద్దర్నీ అవుట్ చేశాడు. తొలి రోజే రెండు టీమ్స్ వి మొదటి ఇన్నింగ్స్ పూర్తి అయ్యాయి. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 123 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది.





















