South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
గొప్ప గొప్ప ఆటగాళ్లు...అప్పటి జాక్ కలిస్, ఏబీ డివిలియర్స్ నుంచి నేటి మార్ క్రమ్, డెవాల్డ్ బ్రేవిస్ వరకూ...టాలెంట్ కి ఏమాత్రం కొదవ ఉండదు. సంవత్సరమంతా ఇరగదీస్తారు. సగర్వంగా ఐసీసీ ఈవెంట్స్ కి వస్తారు..లీగు దశల్లో తిరుగులేని ప్రదర్శనలు చేస్తారు. కానీ అదేం దురదృష్టమో తెలియదు కానీ నాకౌట్ స్టేజ్ లో మాత్రం చోక్ అయిపోతారు. క్రికెట్లో చోకర్స్ అని తమకు అక్కర్లేని ముద్ర వేయించుకున్న సౌతాఫ్రికాను మరోసారి దురదృష్టం వెంటాడింది. పూర్తి స్థాయి ఐసీసీ వరల్డ్ కప్ ను ఏదైనా ఫార్మాట్ లో గెలవాలన్న కోరిక వైట్ బాల్ క్రికెట్లో తీరేలా కనిపించటం లేదు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026 తీసుకుంటే...ఈ టోర్నీ అస్సలు సౌతాఫ్రికా ఓడిపోయిందే లేదు. లీగ్ దశలో, సూపర్ 8 లో మెరుపు విజయాలు సాధించింది. భారత్, న్యూజిలాండ్ లాంటి జట్లను చిత్తు చేసింది. కానీ కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో మళ్లీ న్యూజిలాండ్ చేతిలో చోక్ అయిపోయింది. అలా ఇలా కూడా కాదు అటు బ్యాటింగ్ లో ఫెయిల్..ఇటు బౌలింగ్ లో ఫెయిల్..క్యాచ్ లు కూడా డ్రాప్లు. అదేంటో కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు..సరైన సమయంలో అస్త్రం మంత్రం గుర్తు రానట్లు ఆగిపోతారు సఫారీలు. ఈ టోర్నీ మోస్తరు ప్రదర్శన మాత్రమే చేస్తూ సెమీస్ కి వచ్చిన న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ కి దూసుకువెళ్తే....బ్యాడ్ లక్ కి కేరాఫ్ అడ్రస్ లా సౌతాఫ్రికా మరోసారి కప్పు లేకుండానే ఇంటిదారి పట్టింది. 2024 టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయి తృటిలో కప్పు కోల్పోయిన సౌతాఫ్రికా...మరోసారి మెరుగైన ప్రదర్శనే చేసినా అదృష్టం మాత్రం ఈసారి కలిసి రాలేదు. ఇప్పటివరకూ ఐసీసీ ఈవెంట్స్ లో 1999లో ఛాంపియన్స్ ట్రోఫీ అప్పట్లో నాకౌట్ ట్రోఫీగా ఉన్నప్పుడు గెలవటం...గతేడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకోవటం మినహా ఇప్పటి వరకూ వైట్ బాల్ క్రికెట్లో మాత్రం పూర్తి స్థాయి వరల్డ్ కప్ ను మహా మహా యోధులు ఆడినా సౌతాఫ్రికా గెలుచుకోకపోవటం మాత్రం నిజంగా బాధాకరం.
ట్రెండింగ్ వార్తలు






















