అన్వేషించండి

India vs England 2nd Semi Final: ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!

India vs England, 2nd Semi-Final: 2026 టీ20 ప్రపంచ కప్‌లో రెండో సెమీఫైనల్ ఈరోజు భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 8న న్యూజిలాండ్‌తో ఫైనల్ ఆడుతుంది.

ముంబై: టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. సాయంత్రం ఆరున్నర గంటలకు టాస్ పడనుండగా, 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 8న జరగనున్న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను ఓడించింది. అప్పట్లో ఇంగ్లీష్ జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఆపై ఫైనల్ గెలిచి ఛాంపియన్‌ అయింది. ఇప్పుడు ఇండియాకు ఆ లెక్క సరిచేసే అవకాశం వచ్చింది. అయితే, ఇంగ్లాండ్ జట్టు సైతం పటిష్టంగా కనిపిస్తోంది. నేటి రాత్రి జరగనున్న మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది. 

వాంఖడే స్టేడియం పిచ్ రిపోర్ట్

ముంబైలోని వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలం. కానీ ఈసారి భారత్ - ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ పిచ్‌పై కొంచెం గడ్డి కనిపిస్తోంది. అయినప్పటికీ, ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ హై స్కోరింగ్ మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇదే స్టేడియంలో ఏడాది క్రితం ఇంగ్లాండ్‌పై అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచులో అభిషేక్ రాణిస్తే ఇంగ్లాండ్ బౌలర్లకు చిక్కులు తప్పవు. 

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో లైవ్ చూడవచ్చు. ఇక మొబైల్‌లో మ్యాచ్ చూడాలనుకునే ప్రేక్షకులు జియోస్టార్ (JioStar) యాప్‌లో మ్యాచ్ వీక్షించవచ్చు. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో కామెంటరీని ఆస్వాదించవచ్చు.

భారత తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ తుది జట్టు (అంచనా): ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

 

హ్యారీ బ్రూక్: ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ టోర్నమెంట్‌లో ఫామ్‌లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉండి పరుగులు చేయడమే అతని బలం. బ్రూక్ వేగవంతమైన, తెలివైన బ్యాటింగ్ చేయడంలో దిట్ట. భారత బౌలర్లు అతనిపై ప్రత్యేక వ్యూహాన్ని రచించాల్సి ఉంటుంది.

జోఫ్రా ఆర్చర్: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఏ జట్టుకైనా ప్రమాదకారే. ఈ వరల్డ్ కప్‌లో అతను ఖచ్చితమైన బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కొత్త బంతితో స్వింగ్, డెత్ ఓవర్లలో యార్కర్లు వేయగల సామర్థ్యం భారత్ టాప్ ఆర్డర్‌కు సవాలుగా మారవచ్చు.

విల్ జాక్స్: ఇంగ్లాండ్ జట్టులో అత్యంత దూకుడుగా ఆడే ఆటగాళ్లలో ఒకడు. అతడి ఆఫ్ స్పిన్ కూడా జట్టుకు ఉపయోగకరం. భారత్ మిడిల్ ఆర్డర్‌లో పలువురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. వారిని అడ్డుకోవడంలో జాక్స్ బౌలింగ్ కీలక పాత్ర పోషించవచ్చు.

ఆదిల్ రషీద్ ఇంగ్లాండ్ అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ భారత్‌పై ప్రభావవంతంగా ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో అతను పరుగులు కంట్రోల్ చేస్తాడు. వికెట్లు తీసి భారత బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారవచ్చు.

ఫిల్ సాల్ట్: ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కుదురుకుంటే మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. అధిక స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తాడు. పవర్‌ప్లేలో పెద్ద షాట్లు ఆడతాడు. వాంఖడే వంటి బ్యాటింగ్‌కు అనుకూల స్టేడియంలో సాల్ట్ బ్యాట్ గనుక బ్యాట్ ఝుళిపిస్తే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Kumar Reddy Buys Range Rover: SRH యంగ్ సెన్సేషన్ నితీష్ రెడ్డి గ్యారేజ్ లోకి కొత్త అతిథి.. కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ కొన్న తెలుగు కుర్రాడు!
SRH యంగ్ సెన్సేషన్ నితీష్ రెడ్డి గ్యారేజ్ లోకి కొత్త అతిథి.. కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ కొన్న తెలుగు కుర్రాడు!
Josh Inglis to Join LSG Squad: LSG ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. జట్టులోకి ఆస్ట్రేలియా పవర్ హిట్టర్! ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు  రెడీ!
LSG ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. జట్టులోకి ఆస్ట్రేలియా పవర్ హిట్టర్! ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు  రెడీ!
IPL 2026 MI Huge Victory VS GT: ముంబై బంప‌ర్ విక్ట‌రీ.. గుజ‌రాత్ ను ఘోరంగా చిత్తు చేసిన ఎంఐ.. తిల‌క్ సెంచ‌రీ, రాణించిన అశ్వ‌నీ కుమార్
ముంబై బంప‌ర్ విక్ట‌రీ.. గుజ‌రాత్ ను ఘోరంగా చిత్తు చేసిన ఎంఐ.. తిల‌క్ సెంచ‌రీ, రాణించిన అశ్వ‌నీ కుమార్
Tilak Varma Smashes 45 Ball Century: క్లాస్ పీకిన పాండ్యా.. రికార్డు సెంచరీతో తిలక్ విధ్వంసం.. 19 ఏళ్ల రికార్డును స‌మం చేసిన తెలుగు స్టార్
క్లాస్ పీకిన పాండ్యా.. రికార్డు సెంచరీతో తిలక్ విధ్వంసం.. 19 ఏళ్ల రికార్డును స‌మం చేసిన తెలుగు స్టార్
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambati Rambabu: ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు, రీజన్ ఇదే
ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు, రీజన్ ఇదే
Apple New CEO : టిమ్ కుక్ తర్వాత జాన్ టెర్నస్.. యాపిల్ సీఈఓ శాలరీ ఎంత ఉంటుందో తెలుసా?
టిమ్ కుక్ తర్వాత జాన్ టెర్నస్.. యాపిల్ సీఈఓ శాలరీ ఎంత ఉంటుందో తెలుసా?
Ponnam Prabhakar Letter To Chandrababu: తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు.. ఎన్డీయే నేతల వ్యాఖ్యలపై చంద్రబాబుకు పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు.. ఎన్డీయే నేతల వ్యాఖ్యలపై చంద్రబాబుకు పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
Nitish Kumar Reddy Buys Range Rover: SRH యంగ్ సెన్సేషన్ నితీష్ రెడ్డి గ్యారేజ్ లోకి కొత్త అతిథి.. కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ కొన్న తెలుగు కుర్రాడు!
SRH యంగ్ సెన్సేషన్ నితీష్ రెడ్డి గ్యారేజ్ లోకి కొత్త అతిథి.. కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ కొన్న తెలుగు కుర్రాడు!
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’ మూవీకోసం కయాదు లోహర్ అన్ని అవకాశాలు వదులుకుందా?
‘ది ప్యారడైజ్’ మూవీకోసం కయాదు లోహర్ అన్ని అవకాశాలు వదులుకుందా?
US Iran Peace Talks: రెండో విడత చర్చలపై సస్పెన్స్.. అమెరికా బృందం రెడీ, పాక్‌కు వెళ్లని ఇరాన్ ప్రతినిధులు
రెండో విడత చర్చలపై సస్పెన్స్.. అమెరికా బృందం రెడీ, పాక్‌కు వెళ్లని ఇరాన్ ప్రతినిధులు
Jana Sena expansion : జనసేన విస్తరణకు పవన్ కల్యాణ్ కసరత్తు - దక్షిణాది రాష్ట్రాలన్నింటి నుంచి చేరికలు - సైలెంట్ ఆపరేషన్ జరుగుతోందా?
జనసేన విస్తరణకు పవన్ కల్యాణ్ కసరత్తు - దక్షిణాది రాష్ట్రాలన్నింటి నుంచి చేరికలు - సైలెంట్ ఆపరేషన్ జరుగుతోందా?
Chiranjeevi Bobby : చిరు బాబీ మూవీ టైటిల్ ఫిక్స్? - మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా...
చిరు బాబీ మూవీ టైటిల్ ఫిక్స్? - మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా...
Embed widget