అన్వేషించండి

Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భూగర్భ బంకర్‌ను ఇజ్రాయెల్ ఎలా బద్దలు కొట్టింది..? CIA,మోసాద్ ఏళ్ల తరబడి పన్నిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? డేటా, అల్గారిథమ్స్ బంకర్ బస్టర్ ZZZఎఎ విధ్వంసకర చరిత్రను ఇక్కడ చదవండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇజ్రాయెల్, సీఐఏ ఏళ్లపాటు గూఢచర్యంతో ఖమేనీ కదలికలపై నిఘా పెట్టాయి.
  • టెహ్రాన్ ట్రాఫిక్ కెమెరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను హ్యాక్ చేసి సమాచారం సేకరించారు.
  • 200 యుద్ధ విమానాలు, క్షిపణులతో ఖమేనీ భూగర్భ నివాసంపై దాడి చేశారు.
  • ఆధునిక యుద్ధాలు డేటా, అల్గారిథమ్స్, తక్షణ నిర్ణయాలపై ఆధారపడి మారాయి.

US-Isrel vs Iran War: టెహ్రాన్ నగరం… ఉదయం 8గంటలకు ఆ రోజు కూడా రోజూ లాగానే నడుస్తోంది. కానీ  ఓ గంటసేపట్లోనే ఊహకందని విధ్వంసం వాళ్ల కళ్లకు కనిపించింది. ఇజ్రాయెల్‌లోని  1200 మైళ్ల దూరం నుంచి వచ్చిన సూపర్‌ జెట్లు.. ఆ దేశ సుప్రీం లీడర్‌  ఖమైనీ భూగర్భ గృహాన్ని కూలచేశాయి. ఆయన్ను ఖతం చేశాయి. మిలటరీ దాడుల చరిత్రలోనే అత్యంత పకడ్బందీగా.. సంక్లిష్టంగా జరిగిన ఈ ఆపరేషన్ డికాపిటేషన్ (Operation Decapittion)ఎలా జరిగిందో చూద్దాం.. 

డికాపిటేషన్ అంటే శిరచ్చేధం. ఇక్కడ చెప్పుకోవాలంటే ఇరాన్‌ను తల లేని మొండెం చేయడమే. ఇరాన్ ఐడెంటిటీ ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీ.. ఆయన్ను పడగొడితే ఇరాన్‌ను పడగొట్టినట్లే. యుద్ధమంటే వారాలు, నెలల తరబడీ సాగనవసరం లేదని నిరూపించిన ఆపరేషన్ ఇది. 
 
ఇరానీయన్ సుప్రీం లీడర్ ఖమైనీ బంకర్‌ను బద్ధలకొట్టం వెనుక.. CIA , మోసాద్  ఏళ్ల తరబడీ సాగించిన ఇంటెలెజెన్స్‌ ఆపరేషన్ ఉంది. ఇరాన్‌లో కమ్యునికేషన్ వ్యవస్థలను బద్ధలు కొట్టి.. అక్కడి సీసీ కేమెరాలను హ్యాక్ చేసి, తమ మనుషులను ఖమేనీ కోర్ టీమ్‌లోకి పంపించి.. శాటిలైట్  చానళ్లతో ఆనవాళ్లు రాబట్టి.. ఎయిర్ డిఫెన్స్‌ను ఏమార్చి.. 200 ఫైటర్‌జెట్లను పంపించి..  ఇలా చాలా చాలా చేసి.. ఏక్‌దమ్ ఓకేసారి నేలమట్టం చేశారు.

వెంటాడిన నీడలు..
అయతుల్లా అలీ ఖమేనీని కొన్నేళ్లుగా CIA, MOSSAD  వెంటాడుతున్నాయి ఇజ్రాయెల్ గూఢచారులు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను తమ అరచేతిలోకి తెచ్చుకున్నారు. "మాకు టెహ్రాన్ నగరం మా జెరూసలేం అంత బాగా తెలుసు"  అని ఒక ఇజ్రాయెల్ గూఢచారి అధికారి వ్యాఖ్యానించడం వెనుక ఉన్న అసలు రహస్యం.. టెహ్రాన్ వీధుల్లోని ట్రాఫిక్ కెమెరాలు . అవును, టెహ్రాన్ నగరంలోని దాదాపు ప్రతి ట్రాఫిక్ కెమెరాను ఇజ్రాయెల్ ఏళ్ల క్రితమే హ్యాక్ చేసింది. ఆ కెమెరాల ద్వారా వచ్చే ప్రతి దృశ్యం ఎన్‌క్రిప్ట్  చేసి మరీ నేరుగా టెల్ అవీవ్‌లోని సర్వర్లకు చేరేది.  ఖమేనీ కార్యాలయం ఉన్న  పాశ్చర్ స్ట్రీట్  కెమెరాను కూడా  ఇజ్రాయెల్‌ తన ఆధీనంలోకి తీసుకోగలిగిందంటే వాళ్లు ఏ రేంజ్ లో టెహ్రాన్‌లోకి చొచ్చుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క కెమెరా ద్వారా ఖమేనీ కదలికలను పసిగట్టేవారు. బాడీగార్డులు తమ వ్యక్తిగత కార్లను ఎక్కడ పార్క్ చేస్తారు, వారు ఏ సమయంలో విధులకు వస్తారు, వారి దినచర్య ఏమిటి అనేవన్నీ ఇజ్రాయెల్ విశ్లేషకులు కూర్చొని గమనించేవారు. ఇజ్రాయెల్ ఇంటిలెజెన్స్ ఓ సీక్రెట్ అల్గారిథమ్ ను కూడా రూపొందించింది. దీని ఆధారంగా ఖమేనీ భద్రతా సిబ్బంది అడ్రెస్‌లు వారి ఫోన్ నెంబర్లు, ప్రయాణించే మార్గాలతో డేటాబేస్ సిద్ధం అయింది. కొన్ని కోట్ల డేటా పాయింట్లు విశ్లేషించి ఖమేనీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో సమావేశం కాబోతున్నారో గంటల ముందే పసిగట్టే స్థాయికి మొసాద్ చేరుకుంది.  

ఇంకోవైపు CIA తన మనుషులను ఖమేనీ కోర్ గ్రూపులో చేర్చింది. ఆ రోజు.. ఉదయం ఖమేనీ తన మిలటరీ వ్యూహకర్తలు, నేషనల్ సెక్యురీటీ అడ్వైజర్, రాజకీయ ప్రముఖలతో పాశ్చర్ స్ట్రీట్‌లోని తన నివాసంలో సమావేశం అవుతున్నట్లు ఆ లీడ్ కూడా కన్ఫామ్ చేశారు. 
మోసాద్ వెంటనే  ఖమేనీ ఉన్న పాశ్చర్ స్ట్రీట్ సమీపంలోని  12 మొబైల్ టవర్లనుహ్యాక్ చేసి జామ్ చేసింది. ఎవరైనా ఖమేనీ భద్రతా సిబ్బందికి ఫోన్ చేస్తే అది నిరంతరం  బిజీ అని వచ్చేలా చేశారు. దీనివల్ల దాడి జరగబోతోందని ఎవరైనా హెచ్చరించాలనుకున్నా ఆ సమాచారం లోపలికి వెళ్లకుండా కట్టడి చేశారు. శనివారం ఉదయం ఖమేనీ తన కార్యాలయంలో సమావేశానికి వస్తున్నట్లు ట్రాఫిక్ కెమెరాలు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిర్ధారించుకున్న ఇజ్రాయెల్..   ఆపరేషన్ మొదలు పెట్టింది. 
దీనికి ముడంచెల వ్యూహాన్ని చేపట్టారు. ముందుగా వాళ్ల రాడార్‌లోకి డికాయ్ ఆపరేషన్ చేసి.. వాటిని కన్ఫ్యూజ్ చేశారు. పక్కనే ఉన్న సముద్రంలో నుంచి టామ్‌హాక్ క్షిపణులు వెళ్లి.. ఎయిర్‌డిఫెన్స్ ను నాశనం చేశాయి. అంతే కాదు. రాబోయే ఎయిర్‌ క్రాఫ్ట్‌లకు ఎయిర్ ఫీల్డ్‌ను క్లియర్ చేసి పెట్టాయి. ఆ తర్వాత F-35,  F-22లు , B2 స్పిరిట్ బాంబర్లు విధ్వంసం చేశాయి. దీనిపై డీటెయిల్డ్‌ గా ఈ కథనంలో చూడండి. 

Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

టెహ్రాన్‌పై దూసుకెళ్లిన 200 యుద్ధ విమానాలు- బంకర్లను ఎలా బద్దలు కొట్టారంటే..

ఇక ఆరోజన టామ్ హాక్‌లు ఎయిర్‌ఫీల్డ్‌ను క్లియర్ చేశాక.. 200  సూపర్‌జెట్లు టెహ్రాన్‌ మీదకు దూసుకెళ్లాయి. టామ్‌హాక్‌లు మిగిల్చిన పని పూర్తి చేయడం తో పాటు.. మిగిలిన లక్ష్యాలను కూల్చేశాయి. ఈ 200 సూపర్‌జెట్లు మధ్యలో ఓ స్పెషన్ స్క్వాడ్రన్ ఉంది. దాని లక్ష్యం మాత్రం అలీ ఖమైనీ అధికారిక నివాసం బైత్ రెహ్బరీ సముదాయం.  ఇది బంకర్ బస్టర్ మ్యూనిషన్లతో రెడీ గా ఉంది. ఈ  బంకర్ బస్టర్లు భూమిపైనే కాదు.. భూమిలోపల ఉన్న కాంక్రీట్‌ బిల్డింగులను కూడా చేధించి లోపలకు వెళ్లాక పేలతాయి. బైత్ రహ్బరీ సాధారణ నివాసం కాదు. ఇది బహుళ స్థాయిల భూగర్భ నిర్మాణం. డికాపిటేషన్ స్ట్రైక్‌లో ప్రధానసూత్రం — “నాయకత్వం ఒకే చోట ఉన్నప్పుడు దాడి చేయాలి.” ఏకంగా 30 మ్యూనిషన్లను ఆ ఇంటిపై వేశారని అంచనా.. ఆ దెబ్బతో ఆ చుట్టుపక్కల చిన్నపాటి భూకంపమే వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్.. ఆ దేశంలోని ముఖ్యమైన మిలటరీ, రాజకీయ నాయకత్వం భూమి పొరల్లో కలిసిపోయారు. అతను ఆ సమయంలో లెవల్‌-2 బంకర్‌లో కాకుండా కాస్త పైన ఉన్న బంకర్‌లో ఉండటం కూడా ఇజ్రాయెల్. యుఎస్‌కు కలిసొచ్చింది. 


Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

ఆధునిక యుద్ధం తీరే మారుతోంది.

కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: ఇప్పటి యుద్ధం కేవలం బాంబుల గురించి కాదు.
ఇది డేటా గురించి.. అల్గారిథమ్స్ గురించి..  తక్షణ తీసుకోవలసిన నిర్ణయాల గురించి.. చూశారుగా మోస్సాద్, CIA ఎంత షార్ప్‌గా ప్లాన్ ఎగ్దిక్యూట్ చేశాయో..  ఓ వెబ్ సిరీస్ తీసేంత మెటీరియల్ ఉంది. త్వరలో ఎలాగో ఇవి డాక్యుమెంటరీలుగా వస్తాయి. 

టాప్ హెడ్ లైన్స్

Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల టూరిస్టులు సహా 18 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల టూరిస్టులు సహా 18 మంది మృతి!
Breaking News: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
US Iran War Latest Updates: ట్రంప్ హత్య కుట్ర జరిగిందన్న ఇజ్రాయెల్! రెచ్చిపోయిన అమెరికా! ఇరాన్‌పై దాడికి అసలు కారణం ఇదే! 
ట్రంప్ హత్య కుట్ర జరిగిందన్న ఇజ్రాయెల్! రెచ్చిపోయిన అమెరికా! ఇరాన్‌పై దాడికి అసలు కారణం ఇదే! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget