అన్వేషించండి

Iran War: US-ఇజ్రాయెల్ త్రిముఖ వ్యూహం: ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్ ఎందకు ఆపలేకపోయిందంటే..!

Iran Israel war: ఇజ్రాయెల్.. యుఎస్ మిస్సైళ్ల దాడిని ఇరాన్ ఎయిర్‌  డిఫెన్స్ సిస్టమ్ దానిని ఎందుకు ఆపలేకపోయింది..?ఎందుకంటే ఈసారి యుఎస్ అమలు చేసిన మూడంచెల త్రిశూల వ్యూహానికి ఇరాన్ బిత్తరపోయింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇజ్రాయెల్-అమెరికా సైబర్, డెకాయ్, వైమానిక దాడులతో ఇరాన్‌ను ఆశ్చర్యపరిచాయి.
  • నకిలీ డేటా, డెకాయ్ డ్రోన్లతో ఇరాన్‌ రాడార్‌ వ్యవస్థలను తప్పుదోవ పట్టించారు.
  • మిస్సైల్ సైట్లు, బ్యాలిస్టిక్ లాంచర్లు, సైనిక పరిశ్రమలపై మూడు దశల దాడి చేశారు.
  • ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, విమానాల నిరంతర దాడులతో ఇరాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు.

Iran War:  యుద్ధం అంటే గగనతలంలో గర్జించే జెట్లు, నేలపై పేలే బాంబులు అనుకుంటాం. కానీ ఈసారి కథ అక్కడి నుంచి మొదలుకాలేదు. ఇరాన్‌పై దాడి చేయాలనుకున్న ఇజ్రాయెల్-U.S అద్భుతమైన స్కెచ్ వేశాయి. బాంబర్లు, జెట్లు ఇలా దాడిచేస్తే.. ఇరాన్ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ వారిని అడ్డుకుంటుందని తెలుసు. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేశాయి. అసలు యుద్ధం మొదలైంది ఆకాశంలో కాదు... రాడార్‌ స్క్రీన్‌లపైనే.. US-ISRAEL చేపట్టిన సైబర్, Decoy,  ఎయిర్ అటాక్‌లకు ఇరాన్ బిత్తరపోయింది.  ఆధునిక వార్‌ఫేర్ ఏలా మారిపోతోందో ఈ అటాక్ కళ్లకు కట్టింది. 

ఇరాన్ కళ్లకు గంతలు కట్టిన అమెరికా..

ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేకపోయింది? సూటిగా చెప్పాలంటే — ప్రత్యర్థి సాంకేతిక సామర్థ్యం పూర్తిగా ఇరాన్‌కు అందనంత స్థాయిలో ఉంది. ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్‌ను చేధించడం కోసం యుఎస్ సైబర్ వార్‌ఫేర్‌ను ఉపయోగించింది. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, సైబర్ ఆపరేషన్లు కలిసి రాడార్‌లలోకి నకిలీ డేటాను పంపించాయి. అంటే పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు ఇరాన్‌ వైపు దూసుకొస్తున్నట్లుగా స్క్రీన్‌పై కనిపిస్తుంది.కానీ అవన్నీ వాస్తవాలు కావు. ఇరాన్‌లోని  స్వదేశీ బావర్ వ్యవస్థలైనా, రష్యా నుంచి వచ్చిన S-300, S-400 బ్యాటరీలైనా — ఒకేసారి వచ్చిన డిజిటల్ దాడిని తట్టుకోలేకపోయాయి. రాడార్ ఆపరేటర్‌కు ఏది నిజం? ఏది మోసం? అర్థం కాని పరిస్థితి.

ఇదే సమయంలో వందల సంఖ్యలో ADM-160 Miniature Air Launched Decoys (MALD) డీకాయ్ డ్రోన్లు ప్రయోగించారు. ఇవి చిన్నవే. కానీ రాడార్‌కు మాత్రం F-15లు, F-16ల పెద్ద స్క్వాడ్రన్‌లా కనిపిస్తాయి. టెహ్రాన్ వైపు భారీ దళం దూసుకొస్తున్నట్టే సిగ్నల్ వస్తుంది. ఇక ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా వాళ్ల వెంట పడుతుంది. Decoy డ్రోన్లను డీల్ చేయడంలో ఇరాన్ ఎయిర్‌డిఫెన్స్‌ సిస్టమ్ బిజీగా ఉన్న సమయంలోనే F-35, F-22లు ఇరాన్‌ భూభాగంపైకి వెళ్తాయి. అసలేం జరుగుతుందో ఇరాన్‌కు అర్థమయ్యే లోపు  వారి రక్షణ ముఖద్వారం బద్ధలైపోయింది.


Iran War: US-ఇజ్రాయెల్ త్రిముఖ వ్యూహం: ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్ ఎందకు ఆపలేకపోయిందంటే..!

US-ISrael  సంయుక్త దళాలు ఈ ఆపరేషన్ ను మూడు దశల్లో చేయాలని నిర్ణయించాయి. ఈ త్రిముఖ దాడితో ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి.

మొదటి దశ: టెహ్రాన్, ఇలామ్, ఖుజెస్టాన్ ప్రాంతాల్లోని సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సైట్లు, రాడార్ స్టేషన్లు, గాలి రక్షణ హెడ్‌క్వార్టర్స్‌ను టార్గెట్ చేశారు.
రెండో దశ: బ్యాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లు, నిల్వ కేంద్రాలపై దాడులు.
మూడో దశ: సైనిక తయారీ పరిశ్రమలపై దృష్టి. దీర్ఘకాల యుద్ధ సామర్థ్యాన్ని బలహీనపరచడం లక్ష్యం.

అసలు దాడి సముద్రం నుంచి..

. ఇక అసలైన భౌతిక దాడి సముద్రంపై నుంచి మొదలైంది. ఇరాన్‌కు దగ్గరలో ఉన్న అమెరికన్ Destroyers  నుంచి Tomahawk మిస్సైల్స్ పైకి లేచాయి. ఇవి శత్రు రాడార్‌లకు దొరక్కుండా చాలా తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి.అంతకుముందే F-౩5,  F-22 రాప్టర్లు వెళ్లడంతో అప్పటికే  రాడార్‌లపై తప్పుడు లక్ష్యాలు, ఎలక్ట్రానిక్ జ్యామింగ్ — ఈ కలయికతో ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్ విచ్చిన్నం అయింది. ఆ సమయంలో చాలా తక్కువ ఎత్తులో వచ్చి టామ్‌హాక్స్‌ S-300, S-400 రాడార్ సైట్లు, కమాండ్ బంకర్లపై దాడి చేశాయి. సో.. శత్రుదేశాల ఎటాక్స్‌ను డేగకళ్లతో పర్యవేక్షించే డిఫెన్స్ సిస్టమ్‌కు కళ్లే లేకుండా పోయాయి. ఇరాన్‌ గగనతలంపైకి తమ ఫైటర్‌జెట్లు దూసుకువెళ్లేలా సేఫ్‌ కారిడార్‌ను విజయవంతంగా సృష్టించిన తర్వాత అసలు కథ మొదలైంది. 


Iran War: US-ఇజ్రాయెల్ త్రిముఖ వ్యూహం: ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్ ఎందకు ఆపలేకపోయిందంటే..!

సిల్వర్‌ బుల్లెట్స్ అటాక్

ఎయిర్‌డిఫెన్స్, మిలటరీ స్థావరాలను ధ్వంసం చేశాక.. ఇక మిగిలిన లక్ష్యాలను చేధించడానికి బాంబర్స్ వచ్చేశాయి. అవి ఒకేసారి JDAM బాంబులు, మిస్సైళ్లను తీసుకెళ్లగలవు. ఇందుకోసం B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లను తెచ్చారు. ఇవి భూమి మీదనే కాదు.. భూమిలోపల ఉండే బంకర్లను కూడా ధ్వంసం చేయగలుగుతాయి. అదే సమయంలో జోర్డాన్, UAEలోని అమెరికన్ బేస్‌ల నుంచి.. F-15E Strike Eagles దూసుకొచ్చాయి. ఒక్కో జెట్ 19 JDAMలు లేదా 28 చిన్న డయామీటర్ బాంబులు మోసుకెళ్లగలదు. ఇవి ప్రధానంగా మూవింగ్ టార్గెట్స్ ను చేధిస్తాయి. అంటే వాహనాలపై నుంచి ప్రయోగించే Surface to Air Missile సిస్టమ్‌ను గుర్తించి దానని ధ్వంసం చేస్తుందన్నమాట..  లోయల్లో దాగి ఉన్న మొబైల్ మిస్సైల్ లాంచర్లు, కమాండ్ సెంటర్లపై దాడులు జరిపాయి.ఎంతగా ప్లాన్‌ చేశారు అంటే ఒకసారి దాడి చేసిన తర్వాత ఇవి తిరిగి వెళ్లవు. మళ్లీ దాడి చేయడానికి వీలుగా వీటికి ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే Mid Air Fueling  కూడా చేశారు. అందుకే ఇంధనాన్ని నింపుకుని వచ్చి మళ్లీ మళ్లీ దాడులు చేశాయి. ఇజ్రాయెల్, యుఎస్ అంత కచ్చితమైన స్కెచ్‌ వేశాయి. 

Iran War: US-ఇజ్రాయెల్ త్రిముఖ వ్యూహం: ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్ ఎందకు ఆపలేకపోయిందంటే..!

ఫ్లోటింగ్ ఎయిర్‌బేస్‌లు రంగంలోకి వచ్చాయి. 

ఓ పక్క వైమానిక దళం డిస్ట్రక్షన్ చేసేస్తుంటే.. దానికి సపోర్ట్‌గా U.S Navy రంగంలోకి వచ్చింది. రెండు గంటల తర్వాత US ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు అరేబియా సముద్రం నుంచి ఆపరేషన్ మొదలుపెట్టింది. 
F/A-18 సూపర్ హార్నెట్లు యాంటీ రాడియేషన్ మిస్సైళ్లతో మిగిలిన రాడార్‌లను వేటాడాయి. 
F-35Cలు ఇంటెలిజెన్స్ సేకరణతో పాటు హై రిస్క్ టార్గెట్‌లపై దాడి చేశాయి. 
E-2 హాకాయ్ ఎయిర్‌క్రాఫ్ట్ మొత్తం గగనతల చలనాన్ని కోఆర్డినేట్ చేసింది. 
 
ఇరాన్‌ ను ఊపిరి తీసుకోకుండా ముప్పేట దాడి చేశారు. ఎంతలా అంటే ప్రతీ 30 సెకన్లకు ఒక విమానం లాంచ్ అయ్యేలా ఆపరేషన్ సాగింది. అంటే ఇరాన్‌ గగనతలంపై ఏ రేంజ్‌లో విమానాలు గుంపు ఎగిరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని వైపులా నుంచి దాడిని ఇరాన్‌ చేధించలేకపోయింది. అందుకే సూర్యోదయానికి చేతులెత్తేసింది. 

అందనంత దూరం.. అత్యంత క్లిష్టం 

ఇజ్రాయెల్ యుఎస్ ఒక్కరోజులోనే ప్రధాన టార్గెట్లను చేధించాయి కానీ.. ఇది అనుకున్నంత ఈజీ అయితే కాలేదు. సెంట్రల్ ఇరాన్ చేరుకోవాలంటే.. దాదాపు 900 నుంచి 1200మైళ్ల దూరం జెట్లు ప్రయాణించాలి. పైగా జోర్డాన్, సిరియా, ఇరాక్ గగనతలాల పైనుంచి లేదా వాటిని తప్పించుకుని వెళ్లాలి. అంతదూరం ప్రయాణిస్తున్నప్పుడు మిడ్ ఎయిర్ ఫ్యూయలింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి. జియాగ్రఫికల్, ఫంక్షనింగ్ చాలెంజ్‌లు ఉన్న ఈ ఆపరేషన్‌లో ప్రతీ అడుగూ కచ్చితంగా జాగ్రత్తగా వేయాల్సిందే. 

ఇరాన్ ప్రతి దాడి 

దాడికి సమాధానంగా ఇరాన్ Operation Truthful Promise 4 పేరిట భారీ మిస్సైల్, డ్రోన్ దాడి ప్రారంభించింది. దూరంగా ఉన్న అమెరికాను ఏం చేయలేక యుఎస్‌ మిత్రదేశాలపై దాడులు మొదలు పెట్టింది.  యూఏఈలోని Al Dhafra Air Baseపై దాడి చేశారు. బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ Fifth Fleet ప్రధాన కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేశారు. సోమవారం సాయంత్రానికి  ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయంపై కూడా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

డికాయ్ ఆపరేషన్స్, సైబర్ ఎటాక్, వంటివి ఫ్యూచర్ వార్‌ఫేర్‌లో ఏ రీతిలో ప్రాధాన్యం వహిస్తున్నాయో ఈ ఆపరేషన్ చెబుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
ABP Desam Top 10, 17 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 17 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget