అన్వేషించండి

Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!

Iran New Supreme Leader: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో కుమారుడు మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరుగుతోంది.

Iran New Supreme Leader: టెహ్రాన్: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. మరోవైపు ఇరాన్ సైతం అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు అమెరికా సైనిక స్థావరాలు, బేస్ క్యాంపులను టార్గెట్ చేసుకుని ఎయిర్ స్ట్రైక్స్‌తో బదులిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే నియంతగా పేరున్న ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఎవరు చేపట్టబోతున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది. 

ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి ఎంత ముఖ్యమైనది?
ఇరాన్‌లో సుప్రీం లీడర్ అనేది దేశంలోనే అత్యంత శక్తివంతమైన పదవి. సైన్యం, న్యాయవ్యవస్థ, మీడియా, విదేశీ విధానంతో పాటు ప్రధాన వ్యూహాత్మక నిర్ణయాలపై తుది అధికారం సుప్రీం లీడర్‌కు ఉంటుంది. అధ్యక్షుడు ప్రభుత్వాన్ని నడిపిస్తారు, కానీ తుది నియంత్రణ సుప్రీం లీడర్ వద్దే ఉంటుంది. కనుక సుప్రీం లీడర్ మరణిస్తే, అధికార మార్పిడి ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. ఇరాన్ రాజ్యాంగం ఈ పరిస్థితికి సంబంధించి స్పష్టమైన ప్రక్రియను నిర్ణయించింది.

ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అధికారాన్ని ఎవరు చేపట్టారు?
ఖమేనీ మృతి తరువాత ముగ్గురు సభ్యుల కౌన్సిల్‌ చేతికి దేశ పాలనా పగ్గాలు చేరినట్లు ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్‌ఎన్‌ఏ ప్రకటించింది. ఈ కౌన్సిల్‌లో అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌‌తో పాటు న్యాయ వ్యవస్థ చీఫ్, గార్డియన్‌ కౌన్సిల్‌లోని ఒక జ్యూరీ సభ్యుడితో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్‌ తాత్కాలికంగా ఇరాన్‌ పాలనా బాధ్యతలు చూసుకుంటుంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం 88 మంది సభ్యులతో కూడిన 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' (Assembly of Experts) కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంటుంది. ఈ సంస్థ మతపరమైన వ్యక్తులతో నిండి ఉంటుంది. సుప్రీం లీడర్ మరణం తర్వాత, ఈ సంస్థ సమావేశమై కొత్త నాయకుడి పేరును ఖరారు చేస్తుంది. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు దేశంలో 40 రోజుల సంతాప దినాలను కూడా ప్రకటించారు.

మోజ్తబా ఖమేనీ ఎవరు?
అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ 1969లో మషహద్‌లో జన్మించారు. ఆయన మతపరమైన వాతావరణంలో విద్యనభ్యసించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో ఆయన రివల్యూషనరీ గార్డ్స్‌తో కలిసి పనిచేశారు.
ఆయన చాలా కాలం నుంచి తన తండ్రికి పరిపాలనలో సలహాలు ఇస్తున్నారు. తెర వెనుక ఉండి అనేక ముఖ్యమైన నిర్ణయాలలో ఆయన కీలక పాత్ర పోషించారని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఎటువంటి పెద్ద ప్రభుత్వ పదవిని చేపట్టనప్పటికీ, సైన్యంతో పాటు పారా మిలిటరీ బలగాలతో మోజ్తబా ఖమేనీకి మంచి సంబంధాలు ఉన్నాయి.

2009 నిరసనల సమయంలో తెరపైకి మోజ్తబా పేరు
2006లో ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ సమయంలో సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ పేరు చర్చలోకి వచ్చింది. నిరసనలను కఠినంగా అణచివేయడంలో ఆయన పాత్ర ఉందని ఆరోపణలు సైతం వచ్చాయి. ఇప్పుడు ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలు స్వీకరిస్తారని దేశంలో రాజకీయ చర్చ మొదలైంది. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం సమయంలో వంశపారంపర్యంగా అధికారాన్ని ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అందువల్ల, ఆయన ఎంపికపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఇతర అభ్యర్థులు ఎవరు?
సుప్రీం లీడర్ పదవి కోసం అనేక పేర్లు తెరమీదకు వస్తున్నాయి. 

హుజ్జత్-ఉల్-ఇస్లాం మొహ్సిన్ కౌమీ: ఈయనను ఖమేనీకి సన్నిహిత సలహాదారుగా భావిస్తారు.

అయతుల్లా అలీరెజా అరాఫీ: ఈయన ఇరాన్ మదర్సా వ్యవస్థకు అధిపతి మరియు గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు.

అయతుల్లా మొహ్సిన్ అరాకీ: ఈయన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌లో పాత సభ్యుడు.

జి.హెచ్. మొహ్సేనీ ఎజేయీ: ఈయన ప్రస్తుతం న్యాయవ్యవస్థ అధిపతిగా ఉన్నారు.

అయినప్పటికీ, తాజా నివేదికల ప్రకారం అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా ఎంపికైనట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget