అన్వేషించండి

Tata Motors Launches Curvv ev SeriesX: టాటా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 502 కిమీ రేంజ్! అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే

టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్‌ను విడుదల చేసింది. 55 కిలోవాట్ బ్యాటరీ, అదిరిపోయే రేంజ్, అధునాతన ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా మోటార్స్ కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ విడుదల, ప్రారంభ ధర రూ. 16.99 లక్షలు.
  • 55 kWh బ్యాటరీతో 502 కిమీ ARAI రేంజ్, 167 HP పవర్.
  • పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, లెవల్ 2 ADAS ఫీచర్లు.
  • రెండు వేరియంట్లలో లభ్యం, రూ. 16.99 లక్షల నుండి రూ. 19.49 లక్షల వరకు.

Tata Motors Launches Curvv ev SeriesX in India Price Range: ఇండియ‌న్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో అగ్రగామి గా ఉన్న టాటా మోటార్స్, తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కర్వ్‌లో సరికొత్త 'సిరీస్ ఎక్స్' (SeriesX) మోడళ్లను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. వినియోగదారులకు తక్కువ ధరలో లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అందించాలనే లక్ష్యంతో టాటా ఈ సిరీస్‌ను తీసుకువచ్చింది. అకాంప్లిష్డ్ ఎక్స్ 55, ఎంపవర్డ్ ఎక్స్ 55 అనే రెండు ప్రధాన వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది.

బ్యాటరీ పవర్ , రేంజ్..
టాటా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ లో 55 కిలోవాట్ (kWh) భారీ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 167 హెచ్‌పి పవర్, 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ (ARAI) సర్టిఫికేషన్ ప్రకారం ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 502 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. రోజువారీ సిటీ డ్రైవింగ్‌తో పాటు ఊళ్లకు వెళ్లే లాంగ్ జర్నీలకు కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. నిజమైన డ్రైవింగ్ పరిస్థితు ల్లో ఇది దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా మొదటి ఓనర్ కోసం హై-వోల్టేజ్ బ్యాటరీపై 15 ఏళ్ల లైఫ్ టైమ్ వారంటీ ఇవ్వడం వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

Also Read: టాటా సియెర్రా రీఎంట్రీ.. అదిరిపోయే డిజైన్ అండ్ పవర్ ఫుల్ ఫీచర్లు! నెలవారీ ఈఎంఐ ఎంత కట్టాలో తెలుసా

ఇంటీరియర్ ,అదిరిపోయే ఫీచర్లు..
ఈ కారు ఇంటీరియర్ పరంగా కూడా ఎంతో విలాసవంతంగా ఉంటుంది. 'అకాంప్లిష్డ్ ఎక్స్ 55' వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్ ప్లే వంటి సౌకర్యాలు ఉన్నాయి. భద్రత కోసం 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఇక వెంటిలేటెడ్ సీట్లు, లెదరెట్ అప్హోల్స్టరీ ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి.

మరోవైపు 'ఎంపవర్డ్ ఎక్స్ 55' వేరియంట్ మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జేబీఎల్ (JBL) 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు అదనం. వెనుక సీట్లను కూడా Reclining సదుపాయం ఇందులో ఉంది. భద్రత పరంగా చూస్తే ఇందులో 'లెవల్ 2 ADAS' టెక్నాలజీ ఉంది. ఇది రోడ్డు మీద ప్రమాదాలను పసిగట్టి డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది.

Also Read: బడ్జెట్ బైకుల్లోనూ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. లాంగ్ రైడ్స్ ఇక మరింత ఈజీ! అతి తక్కువ ధరలో లభించే టాప్ 5 మోటార్ సైకిళ్లు ఇవే 

ధరలు మరియు వేరియంట్ల వివరాలు..
టాటా మోటార్స్ కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్‌ ను కాంపిటీటివ్ ధరల్లో తీసుకువచ్చింది.

అకాంప్లిష్డ్ ఎక్స్ 55: రూ. 16.99 లక్షలు

ఎంపవర్డ్ ఎక్స్ 55: రూ. 19.19 లక్షలు

ఎంపవర్డ్ ఎక్స్ 55 డార్క్: రూ. 19.49 లక్షలు

ఈ కొత్త వేరియంట్లు రావడం వల్ల 55 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ ఇప్పుడు గతంలో కంటే తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. స్టైలిష్ లుక్, ఎక్కువ రేంజ్, అధునాతన టెక్నాలజీ కోరుకునే వారికి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే ఒక గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని మరింత ప్రోత్సహించే దిశగా టాటా వేసిన ఈ అడుగు మార్కెట్ లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Frequently Asked Questions

టాటా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ ప్రారంభ ధర ఎంత?

టాటా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ ప్రారంభ ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

టాటా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ లో ఏయే వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి?

టాటా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ అకాంప్లిష్డ్ ఎక్స్ 55, ఎంపవర్డ్ ఎక్స్ 55, మరియు ఎంపవర్డ్ ఎక్స్ 55 డార్క్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

టాటా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ తో ఎంత దూరం ప్రయాణిస్తుంది?

ARAI సర్టిఫికేషన్ ప్రకారం, ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ తో 502 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. వాస్తవ డ్రైవింగ్ పరిస్థితుల్లో దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

టాటా కర్వ్ ఈవీ సిరీస్ ఎక్స్ లో ఎలాంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి?

ఈ కారులో 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, మరియు 'లెవల్ 2 ADAS' టెక్నాలజీ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget