అన్వేషించండి

Affordable Bikes With Cruise Control: బడ్జెట్ బైకుల్లోనూ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. లాంగ్ రైడ్స్ ఇక మరింత ఈజీ! అతి తక్కువ ధరలో లభించే టాప్ 5 మోటార్ సైకిళ్లు ఇవే

ప్రీమియం బైకుల్లో మాత్రమే కనిపించే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఇప్పుడు బడ్జెట్ బైకుల్లోనూ అందుబాటులోకి వచ్చింది. లాంగ్ జర్నీలను సులభతరం చేసే ఈ ఫీచర్ కలిగిన టాప్ 5 చౌకైన బైకుల వివరాలు తెలుసుకుందాం.

Top 5 Most Affordable Bikes With Cruise Control in India: ఒకప్పుడు క్రూయిజ్ కంట్రోల్ లాంటి లగ్జరీ ఫీచర్లు కేవలం ఖరీదైన కార్లు లేదా లక్షల రూపాయల విలువ చేసే ప్రీమియం బైకుల్లో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. వాహన తయారీ సంస్థలు సామాన్యులకు అందుబాటులో ఉండే బడ్జెట్ బైకుల్లో కూడా ఈ మోడరన్ టెక్నాలజీని అందిస్తున్నాయి. ముఖ్యంగా హైవేల మీద లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ప్రతిసారీ ఎగ్జిలరేటర్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకే స్పీడ్ ను మెయింటైన్ చేసేలా ఈ ఫీచర్ సహాయపడుతుంది. మీరు తక్కువ బడ్జెట్ లో క్రూయిజ్ కంట్రోల్ ఉన్న బైక్ కోసం చూస్తుంటే, ఈ లిస్ట్ మీ కోసమే..

హీరో గ్లామర్ ఎక్స్ (Hero Glamour X)..
ఇండియ‌న్ టూవీలర్ మార్కెట్ లో ఈ సెగ్మెంట్ లోనే మొదటిసారి క్రూయిజ్ కంట్రోల్ ను ప్రవేశపెట్టి హీరో మోటోకార్ప్ అందరినీ ఆశ్చర్యపరిచింది. హీరో గ్లామర్ ఎక్స్ ప్రారంభ ధర రూ. 86,567 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. అయితే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ దీని డిస్క్ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధర రూ. 95,786 (ఎక్స్-షోరూమ్). దేశంలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగిన అత్యంత చౌకైన బైక్ ఇదే. రోజువారీ ఆఫీస్ పనులకు వెళ్తూనే, అప్పుడప్పుడు లాంగ్ జర్నీలు చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ (Hero Xtreme 125R)..
ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన బైక్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్. ఇందులో 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 11.5 హెచ్‌పి పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. దీని టాప్-స్పెక్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఇచ్చారు. దీని ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్పోర్టీ లుక్ తో పాటు సేఫ్టీ, టెక్నాలజీ కోరుకునే యువతకు ఇది బాగా నచ్చుతుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ (Hero Xtreme 160R 4V)..
హీరో కంపెనీ నుంచి క్రూయిజ్ కంట్రోల్ కలిగి ఉన్న మూడో బైక్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ. ఈ బైక్ లోని ఈటీబీ (ETB) వేరియంట్ లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 1,36,500 (ఎక్స్-షోరూమ్). ఇందులో 163.2 సీసీ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 17 హెచ్‌పి పవర్, 14.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్ ఫుల్ ఇంజిన్ తో పాటు హైటెక్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 (TVS Apache RTX 300)..
టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చిన అపాచీ ఆర్టీఎక్స్ 300లో అన్ని వేరియంట్లలోనూ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ను స్టాండర్డ్ గా ఇచ్చారు. ఇందులో 299 సీసీ లిక్విడ్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 35.5 హెచ్‌పి పవర్, 28.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ బైక్ చాలా దూకుడుగా ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్ వల్ల హైవేల మీద ప్రయాణం చాలా స్మూత్ గా సాగుతుంది.

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 (TVS Apache RTR 310)..
ఈ లిస్ట్ లో ఐదో స్థానంలో ఉన్న బైక్ టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310. దీని ప్రారంభ ధర రూ. 2.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 312.12 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 35 హెచ్‌పి పవర్, 28.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. మోడరన్ ఫీచర్లు, అగ్రెసివ్ డిజైన్ తో పాటు లాంగ్ రైడ్స్ లో సౌకర్యాన్ని ఇచ్చే క్రూయిజ్ కంట్రోల్ దీని సొంతం. ఈ సెగ్మెంట్ లో అత్యంత స్టైలిష్ బైకుల్లో ఇది ఒకటి.

మొత్తానికి చూస్తే, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ఇప్పుడు బడ్జెట్ పరిమితులను దాటి సామాన్యులకు చేరువైంది. దీనివల్ల లాంగ్ రైడ్స్ లో రైడర్లకు అలసట తగ్గుతుంది. మైలేజ్ కూడా మెరుగ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఐదు బైకుల్లో మీ అవసరాలకు తగ్గట్టుగా బెస్ట్ మోడల్ ను ఎంచుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget