అన్వేషించండి

Affordable Mileage Bikes: మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!

Affordable Mileage Bikes: భారత్‌లో బైక్ కొనాలనే ఆలోచన వచ్చినప్పుడు మొదట ఆలోచించేది మైలేజీ. అలాంటి మంచి ఇంధన సామర్థ్యం ఉన్న బైక్‌ల గురించి ఇక్కడ చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతీయ మార్కెట్లో అధిక మైలేజీ ఇచ్చే బైకులపై దృష్టి సారించారు.
  • హీరో స్ప్లెండర్, టీవీఎస్ రైడర్, హోండా ఎస్పీ 125 బైకులు ప్రాచుర్యం పొందాయి.
  • కొత్త టెక్నాలజీతో పాటు ఎలక్ట్రిక్ బైకులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
  • అవసరాలకు అనుగుణంగా హీరో, టీవీఎస్, బజాజ్ బైకులు ఎంచుకోవచ్చు.

Affordable Mileage Bikes: భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో టూ వీలర్‌ అనేది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు. అది మధ్యతరగతి కుటుంబ ప్రణాళికలో భాగంగా ఉంటుంది. రోజువారీ ఆఫీసు పనులకు వెళ్లే వారైనా లేదా సుదూర ప్రయాణాలు చేసే వారైనా, ప్రతి లీటరు పెట్రోలుకు ఎన్ని కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చు అనే అంశంపై చర్చించుకుంటారు. బైక్ కొనే ముందు వీటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇతర విషయాలు గురించి ఆలోచిస్తారు. 

మైలేజీ అనేది ఒ లీటర్‌ ఇంధనంతో వాహనం ఎంత దూరం ప్రయాణించగలదో చెబుతుంది. 2026లో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ మార్పులు, ఇతర మోడళ్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే బైక్‌లను తీసుకొస్తున్నాయి. వాటి గురించి ఇక్కడ చూద్దాం. 

Also Read: మైలేజ్ ఇచ్చే బెస్ట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఇవే! లీటర్ కు 28 కిమీ ఇచ్చే హైబ్రిడ్ కార్ల లిస్ట్

ప్రస్తుత కాలంలో రవాణా ఖర్చులు పెరగడం వల్ల ప్రతి ఒక్కరూ పొదుపు వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, యువత తమ దైనందిన ప్రయాణాల్లో ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తారు. కేవలం మైలేజీ మాత్రమే కాకుండా, సరసరమైన ధర, తక్కువ నిర్వహణ ఖర్చులు కూడా ఈ బైక్‌లకు డిమాండ్ పెంచుతున్నారు. 

భారత్ మార్కెట్‌లో ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్న కొన్ని పాపులర్‌ మోడళ్ల గురించి వాటి ఎక్స్‌షో రూమ్ ధరలు చూస్తే ఇలా ఉన్నాయ. 

హీరో స్ప్లెండర్‌ ప్లస్‌ 

ఇది కొన్ని ఏళ్ల నుంచి భారతీయులకు నమ్మకమైన బైక్‌గా ఉంది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర 76,177 నుంచి ప్రారంభమవుతుంది. ఇది లీటర్‌కు సుమారు 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని XTEC వేరియంట్‌ అయితే 73 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 

టీవీఎస్ రైడర్‌

యువతను ఆకట్టుకునే స్టైలిష్‌ లుక్‌తో వస్తున్న బైక్ టీవీఎస్ రైడర్. ఇది 71.9 కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. దీని ప్రారంభ ధర 82,860 రూపాయలుగా ఉంది. మీ ఉండే ప్రాంతం బట్టి రేటు మారవచ్చు. 

హోండా ఎస్పీ 125 

124 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో 63 కిలోమీటర్‌ మైలేజీని ఇచ్చే ఈ బైక్ ధర 88,528గా ఉంది. 

బజాబ్‌ ప్లాటినా 110

మైలేజీకి పెట్టింది పేరు ప్లాటినా, ఇది 69,832 దరతో 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌

గరిష్టంగా 83.09 కిలోమీట్ల మైలేజీతో ఈ విభాగంలో టాప్‌లో దూసుకెళ్తున్న బైక్ ఇది. 

టూవీలర్స్‌ తయారీదారులు ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు.  ఏప్రిల్‌ 2026లో టీవీఎస్ సంస్థ తన పాపులర్‌ మోడల్  రైడర్‌ 125లో సరికొత్త రంగులను తీసుకొచ్చింది. దీని టాప్ 2 వేరియంట్లు ఇప్పుడు మూడో ఎక్స్‌ట్రీమ్‌ 125ఈ బైక్ తన అగ్రెసివ్ స్టైలింగ్‌, ఫీచర్లతో 125సీసీ విభాగంలో కొత్త సంచలనాన్ని సృష్టిస్తోంది. దీని ధర 90,800గా ఉంది. 

Also Read: వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే

కేవలం పెట్రోల్‌ బైక్‌లే కాకుండా, ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది. ఓబెన్ రోర్ ఎవో వంటి కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు 99,999 ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి ఇంధన ఖర్చును పూర్తిగా సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. 

మీ అవసరాలకు తగిన బైక్‌ను ఎంచుకోవడానికి చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మీరు రోజుకు యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తుంటే, 70+కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే హీరోస్ హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌, టీవీఎస్‌ స్పోర్ట్ వంటి వాటిని ఎంచుకోవడం ఉత్తమం. యాభై వేల లోపు అయితే టీవీ ఎస్‌ ఎక్స్‌ఎల్‌100 వంటి మొపెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. మైలేజీతోపాటు లుక్ కూడా కావాలనుకునే వారు బజాజ్ పల్సరస్‌ ఎస్‌ 125 వంటి స్పోర్ట్స్ లుక్ బైక్‌లను పరిశీలించవచ్చు. 

భారత్‌ మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ టూవీలర్‌ కొత్త కొత్త మోడల్స్‌ను మైలేజీ టార్గెటెడ్‌గానే లాంచ్ చేస్తున్నాయి. ఇందులో లెటెస్ట్ టెక్నాలజీని కూడా యాడ్ చేస్తున్నాయి.  

Frequently Asked Questions

మైలేజ్ అంటే ఏమిటి?

మైలేజ్ అనేది ఒక లీటర్ ఇంధనంతో వాహనం ఎంత దూరం ప్రయాణించగలదో తెలియజేస్తుంది. ఇది బైక్ ఎంచుకోవడంలో ముఖ్యమైన అంశం.

భారతదేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కొన్ని ప్రముఖ బైకులు ఏవి?

హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ రైడర్, హోండా SP 125, బజాజ్ ప్లాటినా 110, మరియు టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ వంటి బైకులు ఎక్కువ మైలేజ్ అందిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ బైకుల ప్రయోజనం ఏమిటి?

ఎలక్ట్రిక్ బైకులు ఇంధన ఖర్చును సున్నాకు తగ్గిస్తాయి. ఇవి పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందిస్తాయి.

రోజుకు ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఏ బైకులు ఉత్తమం?

మీరు రోజుకు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తుంటే, హీరో HF డీలక్స్ లేదా టీవీఎస్ స్పోర్ట్ వంటి 70+ కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే బైకులు మంచి ఎంపిక.

టాప్ హెడ్ లైన్స్

BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget