అన్వేషించండి

 Top Fuel Efficient Petrol Mid Size SUVs: మైలేజ్ ఇచ్చే బెస్ట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఇవే! లీటర్ కు 28 కిమీ ఇచ్చే హైబ్రిడ్ కార్ల లిస్ట్

పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మిడ్ సైజ్ ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. మారుతి విక్టోరిస్, గ్రాండ్ విటారా, టొయోటా హైరైడర్ వంటి మోడళ్లు అత్యుత్తమ మైలేజీతో దూసుకుపోతున్నాయి.

Top Fuel Efficient Petrol Mid Size SUVs in India 2026 Mileage Guide: ఇండియాలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కారు కొనేవారు ముందుగా చూసేది మైలేజ్. ముఖ్యంగా మిడ్ సైజ్ ఎస్‌యూవీ (Mid-size SUV) సెగ్మెంట్ లో పోటీ తీవ్రంగా ఉంది. గతంలో కేవలం డీజిల్ కార్లు మాత్రమే ఎక్కువ మైలేజ్ ఇస్తాయనే పేరు ఉండేది. కానీ ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీ (Hybrid Technology) పుణ్యమా అని పెట్రోల్ కార్లు కూడా లీటర్ కు 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ట్రాఫిక్ లో రోజూ ప్రయాణించే వారికి, లాంగ్ డ్రైవ్స్ వెళ్లే వారికి ఈ కార్లు ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ లో అత్యధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ మిడ్ సైజ్ ఎస్‌యూవీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హైబ్రిడ్ కార్ల హవా..
మైలేజ్ రేసులో మారుతి సుజుకి, టొయోటా కంపెనీలు టాప్ లో ఉన్నాయి. మారుతి సుజుకి విక్టోరిస్ (Victoris), గ్రాండ్ విటారా (Grand Vitara), టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ (Hyryder) కార్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ తో వస్తున్నాయి. ఇందులో మారుతి విక్టోరిస్ ఏకంగా 28.65 కి.మీ మైలేజ్ ఇస్తూ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. గ్రాండ్ విటారా, హైరైడర్ కార్లు కూడా 27.97 కి.మీ మైలేజ్ అందిస్తున్నాయి. తక్కువ స్పీడ్ లో ఉన్నప్పుడు ఈ కార్లు కేవలం బ్యాటరీ (Electric Mode) మీద నడుస్తాయి. దీనివల్ల సిటీ ట్రాఫిక్ లో పెట్రోల్ ఖర్చు చాలా తగ్గుతుంది. పూర్తి ఎలక్ట్రిక్ కార్లకు మారడం ఇష్టం లేని వారికి ఇవి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్.

సాధారణ పెట్రోల్ వేరియంట్లు..
స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని భావించే వారి కోసం ఇవే కార్లు 1.5 లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజిన్ తో కూడా వస్తున్నాయి. మారుతి విక్టోరిస్ మాన్యువల్ వేరియంట్ 21.18 కి.మీ మైలేజ్ ఇస్తుండగా, గ్రాండ్ విటారా 21.11 కి.మీ, హైరైడర్ 21.12 కి.మీ మైలేజ్ ఇస్తున్నాయి. వీటిలో ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ కూడా ఉంది. ఏడబ్ల్యూడీ విభాగంలో టొయోటా హైరైడర్ 19.39 కి.మీ తో ముందంజలో ఉంది. తక్కువ ధరలో మంచి మైలేజ్ కావాలనుకునే వారికి ఈ నార్మల్ పెట్రోల్ వేరియంట్లు కరెక్ట్ గా సరిపోతాయి.

స్కోడా, సిట్రోయెన్ పర్ఫార్మెన్స్..
తాజాగా లాంచ్ అయిన స్కోడా కుషాక్ (Kushaq) కూడా మైలేజ్ పరంగా మెరుగైన ఫలితాలు ఇస్తోంది. దీని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ లో 19.66 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇక సిట్రోయెన్ బసాల్ట్ (Basalt) 19.5 కి.మీ, సి3 ఎయిర్ క్రాస్ 18.5 కి.మీ మైలేజ్ ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు కొత్త రెనో డస్టర్ (Duster) ఆటోమేటిక్ వేరియంట్ 18.45 కి.మీ మైలేజ్ ఇస్తోంది. ఈ కార్లు కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా మంచి పవర్, కంఫర్ట్ ను కూడా అందిస్తాయి.

హ్యుందాయ్ క్రెటా..
దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే హ్యుందాయ్ క్రెటా (Creta) కూడా ఈ లిస్ట్ లో ఉంది. క్రెటా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ డిసిటి వేరియంట్ 18.4 కి.మీ మైలేజ్ ఇస్తుంది. అదే నార్మల్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఆటోమేటిక్ లో 17.7 కి.మీ వరకు మైలేజ్ వస్తుంది. మైలేజ్ తో పాటు ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారు క్రెటా వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి మైలేజ్ పరంగా మారుతి విక్టోరిస్ రారాజుగా నిలవగా, టెక్నాలజీ పరంగా మిగిలిన కంపెనీలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. మీ అవసరానికి తగ్గట్టుగా ఈ లిస్ట్ నుండి ఒక మంచి కారును ఎంచుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

పాత కారు అమ్మి కొత్తది కొనాలా? లేక, పాత కారును కొత్త కారుతో ఎక్సేంజ్‌ చేయాలా? స్పిన్నీలో చాలా ఆప్షన్లు
సెకండ్‌హ్యాండ్‌ కారు అమ్మేవాళ్లకు, కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌.. స్పిన్నీలో మరిన్ని ఆప్షన్లు!
డీజిల్ కంటే తక్కువ ఖర్చు, 1100km పైగా రేంజ్‌.. ఈ డీజిల్‌ కిల్లర్‌ చాలా స్పెషల్‌ గురూ!
ఈ కారు 'డీజిల్‌ కిల్లర్‌' అట! దీనిని ఎందుకు ఆ పేరుతో పిలుస్తున్నారు? ఏంటి సీక్రెట్‌?
మీ బడ్జెట్‌లోనే మంచి ఆటోమేటిక్ కారు! రూ.7 లక్షల నుంచి స్టార్ట్.. బెటర్‌ మైలేజ్‌ కూడా!
25km మైలేజీ.. 6 ఎయిర్‌బ్యాగులు.. కేవలం రూ.7 లక్షల నుంచే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు!
ADAS ఉన్న కారులో ఈ పొరపాటు చేయవద్దు! విస్మరిస్తే ప్రాణాలకే ముప్పు! 
ADAS ఉన్న కారులో ఈ పొరపాటు చేయవద్దు! విస్మరిస్తే ప్రాణాలకే ముప్పు! 

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
DWCRA Tea Coffee Centres: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే ప్రణాళిక!
Ongole Radisson Hotel:100 కోట్లతో ఒంగోలు సమీపంలో 5-స్టార్ హోటల్‌-మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!
100 కోట్లతో ఒంగోలు సమీపంలో 5-స్టార్ హోటల్‌-మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన!
AP Water Projects: ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
ఒకే వారంలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు - నీటి కష్టాలకు చెక్ పెడుతున్న చంద్రబాబు మార్కు డెవలప్‌మెంట్!
Maharashtra Crime News: శ్రావణ మాసంలో మటన్ తినాలనుకున్నందుకు కొడుకును చంపిన తండ్రి! సాక్ష్యాలు ధ్వంసం చేసిన తల్లి!
శ్రావణ మాసంలో మటన్ తినాలనుకున్నందుకు కొడుకును చంపిన తండ్రి! సాక్ష్యాలు ధ్వంసం చేసిన తల్లి!
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా కమ్ బ్యాక్ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రోజా కమ్ బ్యాక్ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telangana Polytechnic Students Protest: పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
Embed widget