అన్వేషించండి

Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం

Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఏకకాలంలో పలు మిల్లులు, గోదాములపై దాడులు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు దాడులు.
  • కర్మన్‌ఘాట్ దాడులలో యంత్రాలు, బియ్యం బస్తాలు సీజ్.
  • మాఫియా పాలిష్ చేసిన బియ్యాన్ని అధిక ధరకు విక్రయిస్తుంది.
  • నిందితులపై పీడీ యాక్ట్, బయోమెట్రిక్ ట్రాకింగ్ చర్యలు.

Hyderabad Ration Rice Scam: హైదరాబాద్ పరిధిలో దర్జాగా సాగుతున్న భారీ రేషన్ బియ్యం మాఫియా అక్రమాలను సివిల్ సప్లైస్, విజిలెన్స్ చెక్ పెట్టాయి. పేదలకు ప్రభుత్వం అతి తక్కువ ధరకు లేదా ఉచితంగా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని దళారులు అక్రమ మార్గాల్లో సేకరించి, వాటిని రీ-సైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కర్మన్‌ఘాట్‌లో టాస్క్‌ఫోర్స్ దాడి

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కర్మన్ ఘాట్ పరిసరాల్లోని ప్రముఖ రైస్ డిపోలు, గోదాములపై ఉన్నతాధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన రేషన్ బియ్యం సంచులు, కల్తీ ప్రాసెసింగ్ యంత్రాలను అధికారులు సీజ్ చేశారు.  

రైస్ మాఫియా    

రేషన్ లబ్ధిదారుల నుంచి లేదా రేషన్ డీలర్ల నుంచి అతి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని మాఫియా ఏజెంట్లు సేకరిస్తారు. ఇలా సేకరించిన లావు బియ్యాన్ని రైస్ మిల్లులు, డిపోల్లో ప్రత్యేక యంత్రాల ద్వారా పాలిష్ పట్టిస్తారు. దీనివల్ల బియ్యం తెల్లగా, సన్న బియ్యం మాదిరిగా కనిపిస్తాయి.  రీ సైకిల్ చేసిన ఈ బియ్యాన్ని ప్రముఖ, పేరుగాంచిన బ్రాండెడ్ కంపెనీల కవర్లు, డూప్లికేట్ బ్యాగుల్లో ప్యాక్ చేస్తారు. మార్కెట్లో ఈ కల్తీ బియ్యాన్ని కిలో రూ. 80 నుంచి రూ. 100 వరకు విక్రయిస్తూ వినియోగదారులను దారుణంగా మోసం చేస్తున్నారు.

Also Read: పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ - ఎలుకల మలం, నాసిరకం ఆయిల్స్.. ఫుడ్ సేఫ్టీ బిగ్ షాక్!

 ప్రభుత్వం చర్యలు

రేషన్ బియ్యాన్ని పదే పదే పాలిష్ చేయడం ద్వారా వాటిలో ఉండాల్సిన పోషకాలు కోల్పోతాయి. ప్రాసెసింగ్ సమయంలో వాడే రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేషన్ అక్రమ తరలింపునకు సహకరిస్తున్న డీలర్లు, మిల్లుల యజమానులు, దళారులపై పి.డి. యాక్ట్  కింద కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా బయోమెట్రిక్ ట్ర్యాకింగ్, జీపీఎస్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ తెలిపింది.

Also Read: కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?

Frequently Asked Questions

హైదరాబాద్ రేషన్ బియ్యం కుంభకోణం అంటే ఏమిటి?

పేదల కోసం ఉచితంగా లేదా తక్కువ ధరకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, వాటిని రీ-సైక్లింగ్ చేసి మార్కెట్లో అధిక ధరకు విక్రయించడమే ఈ కుంభకోణం. ఈ బియ్యాన్ని సన్నబియ్యంలా మార్చి, ప్రముఖ బ్రాండ్ల పేరుతో అమ్ముతున్నారు.

రేషన్ బియ్యం మాఫియాపై ఎవరు దాడులు చేశారు మరియు ఏమి స్వాధీనం చేసుకున్నారు?

సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌తో సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన రేషన్ బియ్యం సంచులు మరియు కల్తీ ప్రాసెసింగ్ యంత్రాలను ఈ దాడుల్లో సీజ్ చేశారు.

రీసైకిల్ చేసిన రేషన్ బియ్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటి?

రేషన్ బియ్యాన్ని పదే పదే పాలిష్ చేయడం వల్ల వాటిలోని పోషకాలు కోల్పోతాయి. ప్రాసెసింగ్ సమయంలో వాడే రసాయనాల వల్ల వినియోగదారులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

రేషన్ అక్రమ తరలింపునకు సహకరిస్తున్న డీలర్లు, మిల్లుల యజమానులు, దళారులపై పీ.డీ. యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నారు. భవిష్యత్తులో బయోమెట్రిక్ ట్రాకింగ్, జీపీఎస్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ తెలిపింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Karimnagar Development: రాజకీయాలను పక్కనబెట్టి కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి.. రూ.4 కోట్ల పనులకు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన
రాజకీయాలను పక్కనబెట్టి కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి.. రూ.4 కోట్ల పనులకు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Embed widget