అన్వేషించండి

E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!

E100 ఇథనాల్ ఇంధన వినియోగానికి అనుగుణంగా కేంద్రం మోటారు వాహన నిబంధనలను సవరించింది. E20, E85, B100 ఇంధనాల మార్పులు, మారుతి WagonR Flex Fuel వివరాలు తెలుసుకోండి.

E100 Flex-Fuel Vehicles: భారత్‌లో ఇథనాల్ ఆధారిత ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. E100 ఇంధనాన్ని ఉపయోగించే వాహనాలకు సంబంధించి మోటారు వాహన నిబంధనల్లో మార్పులు చేసింది. కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) 2026 అక్టోబర్ 23న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ సవరణలను ప్రకటించింది. ఇందులో.. E100, E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు సంబంధించిన నిబంధనలతో పాటు E20 పెట్రోల్, B100 బయోడీజిల్ ప్రస్తావనల్లోనూ మార్పులు ఉన్నాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఉన్న అన్ని పెట్రోల్ కార్లలో E100 ఇంధనాన్ని ఉపయోగించవచ్చని అర్థం కాదు. సంబంధిత ఇంధనానికి అనుగుణంగా రూపొందించిన లేదా మార్పులు చేసిన వాహనాల్లోనే దానిని వినియోగించాలి.

E100, E85 ఇంధనాలంటే ఏమిటి?

E100 అంటే 100 శాతం ఇథనాల్‌తో కూడిన ఇంధనం. అంటే, ఇందులో పెట్రోల్‌ మిక్సింగ్‌ అస్సలు ఉండదు, పూర్తిగా ఇథనాల్‌ మాత్రమే ఉంటుంది. E85లో గరిష్ఠంగా 85 శాతం ఇథనాల్ ఉంటుంది, మిగిలిన భాగంలో ప్రధానంగా పెట్రోల్ ఉంటుంది. ఈ ఇంధనాలను ఉపయోగించాలంటే వాహన ఇంజిన్, ఇంధన సరఫరా వ్యవస్థ సంబంధిత ఇంధనానికి అనుగుణంగా ఉండాలి.

ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్న సాధారణ పెట్రోల్ వాహనాలు.. E85 లేదా E100 ఇంధనాన్ని ఉపయోగించేందుకు అనుకూలంగా ఉండవు. అందుకే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ప్రత్యేకంగా రూపొందించడం లేదా అవసరమైన సాంకేతిక మార్పులు చేయడం ముఖ్యం.

MoRTH సవరించిన నిబంధనల్లో E85 ఇంధనంతో పాటు E100ను కూడా చేర్చారు. కంపెనీలు రూపొందించే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు వర్తించే ఇంధన వివరాలను కూడా సవరించారు. ఈ మార్పులు 2026 ఏప్రిల్‌లో విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా వచ్చాయి.

ఇది కూడా చదవండి: 

E10 స్థానంలో E20.. B10 స్థానంలో B100   

కొత్త సవరణల్లో ఉద్గారాల ధ్రువీకరణకు సంబంధించిన టేబుల్‌లోనూ మార్పులు చేశారు. E10 పెట్రోల్ ప్రస్తావనను E20 పెట్రోల్‌తో భర్తీ చేశారు.

E10లో.. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలిసి ఉంటుంది. E20లో ఇథనాల్ శాతం 20. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం ద్వారా సంప్రదాయ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, వాహనంలో ఏ ఇంధనాన్ని ఉపయోగించవచ్చన్నది తయారీ కంపెనీ సూచిస్తుంది.

అలాగే, ఉద్గార ధ్రువీకరణ పట్టికలో B10 ప్రస్తావనను B100తో భర్తీ చేశారు. B100 అంటే 100 శాతం బయోడీజిల్‌. 

E100 ఇంధనానికి అనుకూలమైన మారుతి కారు

ప్రస్తుతం భారత్‌లో E100 ఇంధనానికి అనుకూలంగా ఉన్న కారు.. Maruti Suzuki WagonR Flex Fuel. ఈ మోడల్‌ను రూ.7.24 లక్షల ప్రారంభ ధరతో కంపెనీ తీసుకొచ్చింది. ఈ కారులో 1.2 లీటర్, నాలుగు సిలిండర్ల K12N ఇంజిన్ ఉంటుంది. E100 ఇంధనానికి అనుగుణంగా ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు, ఇంధన పైపులు, ECUలో మార్పులు చేశారు. ఈ ఇంజిన్ 90 bhp గరిష్ఠ పవర్, 113.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

ఏ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనంలోనైనా.. ఇంధనానికి అనుగుణంగా ఇంజిన్ పనితీరును నియంత్రించే సాంకేతికత కీలకం. అందువల్ల, సాధారణ పెట్రోల్ కారులో వేరే రకం ఇంధనాన్ని నింపి ఉపయోగించడం సరైన పద్ధతి కాదు.

ఇది కూడా చదవండి: 

E85కు అనుకూలమైన బైక్‌లు ఏవి?

టూవీలర్‌ విభాగంలోనూ ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు అనుకూలమైన కొన్ని మోడళ్లు ఉన్నాయి. Suzuki Gixxer 250, Yamaha FZ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లు E85 వరకు ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగించగలవు. Yamaha FZ ధర రూ.1.24 లక్షల నుంచి, Suzuki Gixxer 250 ధర రూ.1.98 లక్షలు. కొన్ని Hero మోటార్‌సైకిళ్లలోనూ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలు, ఇంధన అనుకూలతలు మోడల్, వేరియంట్, తయారీ సంవత్సరం ఆధారంగా మారవచ్చు. కొనే ముందు కంపెనీ అధికారిక వివరాలను పరిశీలించడం మంచిది.

వాహనదారులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం

E100 వాహనాలకు లైన్‌ క్లియర్‌ అయిందంటే, దేశంలోని అన్ని పెట్రోల్ వాహనాలకు E100 ఇంధనాన్ని అనుమతించినట్లు కాదు. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న వాహనంలో కంపెనీ నిర్దేశించిన ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Nexon నుంచి Hyundai Creta వరకు.. పానోరమిక్ సన్‌రూఫ్ ఉన్న 10 కార్లు, మీ బడ్జెట్‌లోనే కొనొచ్చు!
రూ.10 లక్షలలోపే పానోరమిక్‌ సన్‌రూఫ్ కారు.. గాలిలో తేలుతూ వెళ్లే అనుభూతిని ఎంజాయ్‌ చేయండి!
KTM 200 Dukeలో క్లచ్‌ అవసరం లేకుండానే గేర్లు మార్చొచ్చు.. కొత్తగా క్విక్‌షిఫ్టర్, రైడ్ మోడ్స్‌, ట్రాక్షన్ కంట్రోల్
యూత్‌ఫుల్‌ ఫీచర్లతో KTM 200 Duke లాంచ్.. రైడింగ్‌ థ్రిల్‌ పెంచే నయా అప్‌గ్రేడ్స్!
రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
Embed widget