అన్వేషించండి

Maruti Brezza లేక Kia Syros .. ఏ కాంపాక్ట్ SUV కొంటే మంచిది ? పవర్‌ట్రెయిన్, ఫీచర్లు, ధర వివరాలు

Maruti Brezza vs Kia Syros | మారుతి బ్రెజ్జా, కియా సైరోస్ SUVలు తమదైన రీతిలో అద్భుతంగా ఉన్నప్పటికీ, ఇంజిన్, ఫీచర్లు, ధర పరంగా ఇవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.

ప్రస్తుతం బైకుల నుంచి కార్లకు షిఫ్ట్ అవుతున్నారు. అందులోనూ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. మీరు కొత్త SUV కొనాలని ఆలోచిస్తుంటే కియా సైరోస్ (Kia Syros), మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) లాంటి బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండు ఎస్‌యూవీల విషయంలో వాహనదారులను కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్లుగా ఉన్నాయి. ఈ రెండు కార్లు వాటి ధర, ఫీచర్ల పరంగా బెస్ట్. కానీ ఇంజన్, ఫీచర్లు, స్పేస్, ధర పరంగా వీటి మధ్య కొన్ని విషయాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఆ విషయాలను తెలుసుకుంటే మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోవచ్చు. 

ఇంజన్, మైలేజ్
మొదట ఇంజన్ విషయానికి వస్తే.. మారుతి బ్రెజ్జాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇస్తున్నారు. ఇది దాదాపు 103 PS పవర్, 136 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మైలేజ్ పరంగా చాలా మంచిదని కస్టమర్లు చెబుతున్నారు. ఈ ఎస్‌యూవీ లీటరుకు దాదాపు 19- 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు.

కియా సైరోస్ ఇంజన్, ఫీచర్లు
కియా సైరోస్‌లో మీకు మరిన్ని ఆప్షన్లు లభిస్తాయి. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఇస్తున్నారు. అంటే పవర్, ఛాయిస్ పరంగా సైరోస్ కాస్త ముందంజలో ఉంది. 

ఫీచర్ల పరంగా చూస్తే.. కియా సైరోస్ మరింత మోడ్రన్, లేస్ట్ ఫీచర్లతో వచ్చిన SUV. ఇందులో పెద్ద పనోరమిక్ డిస్‌ప్లే, డ్యూయల్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు మారుతి బ్రెజ్జాలో కూడా మంచి ఫీచర్లు ఇచ్చారు. సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నప్పటికీ, ఇది కియా సైరోస్ అంత మోడ్రన్, హైటెక్ కారులా అనిపించదు.

సేఫ్టీ, బూట్ స్పేస్
సేఫ్టీ పరంగా కూడా రెండు SUVలు బాగుంటాయి. కియా సైరోస్‌లో లెవెల్-2 ADAS వంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ఇతర ఫీచర్లు అందించారు. మారుతి బ్రెజ్జాలో కూడా ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ కెమెరా, పార్కింగ్ సెన్సార్ల వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇవి రోజువారీ డ్రైవింగ్‌కు సరిపోతాయి. ఇక స్పేస్ విషయానికి వస్తే కియా సైరోస్ కాస్త ముందంజలో ఉంటుంది. ఇందులో దాదాపు 390 లీటర్ల బూట్ స్పేస్ వల్ల ఎక్కువ లగేజీ పెట్టుకోవచ్చు.

బ్రెజ్జా ధర, బూట్ స్పేస్
మారుతి బ్రెజ్జాలో దాదాపు 328 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ధర విషయానికి వస్తే కాస్త తక్కువ ధరలో లభించే SUV. దీని ప్రారంభ ధర సుమారు రూ. 8.26 లక్షలకు మొదలవుతుంది. కాగా కియా సైరోస్ ప్రారంభ ధర కాస్త ఎక్కువగా దాదాపు రూ. 8.40 లక్షలుగా ఉంటుంది. ఆయా రాష్ట్రాలు, నగరాలలో ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధరల మధ్య సైతం వ్యత్యాసాన్ని మీరు గమనిస్తారు. 

మీరు ఎక్కువ పవర్, సరికొత్త ఫీచర్లు, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటే.. కియా సైరోస్ మీకు బెస్ట్ ఛాయిస్. అయితే మీరు మంచి మైలేజ్ ఇచ్చే, తక్కువ ధరలో లభించేది కోరుకుంటే.. మారుతి సుజుకి బ్రెజ్జా తీసుకోవచ్చు. మీ అవసరం, బడ్జెట్‌ను బట్టి ఈ రెండింటిలో ఏది కొనాలో డిసైడ్ చేసుకోవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget