అన్వేషించండి

Tata Sierra Relaunched: టాటా సియెర్రా రీఎంట్రీ.. అదిరిపోయే డిజైన్ అండ్ పవర్ ఫుల్ ఫీచర్లు! నెలవారీ ఈఎంఐ ఎంత కట్టాలో తెలుసా

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఐకానిక్ టాటా సియెర్రా సరికొత్త లుక్ తో తిరిగి వచ్చింది. ఈ ఎస్‌యూవీ ధరలు, ఇంజిన్ ఆప్షన్లు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఈఎంఐ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Tata Sierra Launched in India Price Variants and Monthly EMI: ఇండియాలో గత కొంతకాలంగా ఎంతో హైప్ క్రియేట్ చేసిన కార్లలో టాటా సియెర్రా (Tata Sierra) ఒకటి. దశాబ్దాల విరామం తర్వాత, భారత ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ లో అత్యంత పాపులర్ అయిన బ్రాండ్ నేమ్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఐకానిక్ స్టైలింగ్ ఎలిమెంట్స్ ను నేటి తరం మోడరన్ ఫీచర్లతో మిక్స్ చేసి టాటా మోటార్స్ ఈ కారును డిజైన్ చేసింది. మార్కెట్ లో దీని ధర రూ. 11.49 లక్షల నుండి రూ. 21.29 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఈ కారు మొత్తం మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఇందులో ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంచుకోవచ్చు.

ధరలు ,వేరియంట్లు..
టాటా సియెర్రా బేస్ మోడల్ ధరలు చాలా కాంపిటీటివ్ గా ఉన్నాయి. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు రూ. 11.49 లక్షల నుండి ప్రారంభమై రూ. 17.99 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే టర్బో-పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 17.99 లక్షల నుండి రూ. 20.99 లక్షల వరకు ఉన్నాయి. ఇక డీజిల్ ప్రేమికుల కోసం ఉన్న వేరియంట్లు రూ. 12.99 లక్షల నుండి రూ. 21.29 లక్షల ధరలో లభిస్తాయి. మార్కెట్ లో ఎంజీ హెక్టర్, మహీంద్రా థార్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈఎంఐ లెక్కలు ఇలా..
మీరు సియెర్రాలో టాప్ ఎండ్ మోడల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే నెలవారీ ఎంత ఈఎంఐ (EMI) కట్టాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ లెక్కల కోసం టాటా సియెర్రా పోర్ట్‌ఫోలియోలో అత్యంత ఖరీదైన 'అకాంప్లిష్డ్+ 1.5 లీటర్ డీజిల్ AT' వేరియంట్ ను తీసుకున్నట్ల‌యితే, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.29 లక్షలు. లోన్ మొత్తం 100% ఎక్స్-షోరూమ్ ధరగా , వడ్డీ రేటు 9.5% గా పరిగణనలోకి తీసుకుంటే, వేర్వేరు కాలపరిమితులకు ఈఎంఐ ఈ విధంగా ఉంటుంది.

36 నెలల కాలపరిమితి:
ఒకవేళ మీరు 3 ఏళ్ల పాటు లోన్ చెల్లించాలనుకుంటే, నెలకు రూ. 68,198 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల మీరు మొత్తం చెల్లించే వడ్డీ రూ. 3,26,133 అవుతుంది.

48 నెలల కాలపరిమితి:
మీరు 4 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే, నెలవారీ ఈఎంఐ భారం రూ. 53,487 కు తగ్గుతుంది. ఈ సందర్భంలో మొత్తం వడ్డీ రూ. 4,38,384 గా ఉంటుంది.

60 నెలల కాలపరిమితి:
మరింత తక్కువ ఈఎంఐ కావాలనుకునే వారు 5 ఏళ్ల ఆప్షన్ ఎంచుకోవచ్చు. అప్పుడు నెలవారీ కట్టాల్సిన మొత్తం రూ. 44,713 కి వస్తుంది. అయితే ఇక్కడ మీరు కట్టే మొత్తం వడ్డీ రూ. 5,53,778 వరకు పెరుగుతుంది.

టాటా సియెర్రా కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్ అని చాలా మంది నమ్ముతారు. అందుకే టాటా మోటార్స్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. మీరు కూడా ఒక పవర్ ఫుల్ ఎస్‌యూవీని ఇంటికి తీసుకురావాలని చూస్తుంటే, ఈ వివరాలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీ బడ్జెట్ మరియు సౌకర్యాన్ని బట్టి సరైన టెన్యూర్ ఎంచుకుని లోన్ ప్లాన్ చేసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget