అన్వేషించండి

FASTag Placement Rule: ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు NHAI హెచ్చరిక.. ఆ ప‌ని చేయ‌కపోతే బ్లాక్‌లిస్ట్ తప్పదు! కొత్త రూల్స్ తీసుకువచ్చిన అధికారులు

ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనం విండ్‌స్క్రీన్ మీద అతికించని పక్షంలో దాన్ని బ్లాక్‌లిస్ట్ చేస్తామని NHAI హెచ్చరించింది. అలాగే ఫాస్ట్‌ట్యాగ్ పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

NHAI Guidelines for Mandatory FASTag Placement Rule: ఇండియాలో హైవేల మీద ప్రయాణించే వారికి ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీతో పనిచేసే ఈ సిస్టమ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ గా పేమెంట్లు జరుగుతాయి. అయితే ఇటీవల చాలా మంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుర్తించింది. ముఖ్యంగా ట్యాగ్‌ను వాహనం అద్దానికి అతికించకుండా, టోల్ వద్దకు రాగానే చేత్తో పట్టుకుని చూపిస్తున్నారు. దీనివల్ల స్కానింగ్ సరిగ్గా అవ్వక ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ హెచ్ ఏ ఐ తాజాగా కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

స్క్రీన్ కే ఉండాలి - లేదంటే బ్లాక్‌లిస్ట్..
నేషనల్ హైవే అథారిటీ నిబంధనల ప్రకారం.. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనం ముందు అద్దం (Windscreen) మీద నిర్దేశించిన చోట ఖచ్చితంగా అతికించి ఉండాలి. అప్పుడే ప్లాజాల వద్ద ఉండే ఆర్‌ఎఫ్ఐడీ రీడర్లు దాన్ని సులభంగా స్కాన్ చేస్తాయి. కానీ కొంతమంది యూజర్లు దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎన్ హెచ్ ఏ ఐ, నిబంధనలు పాటించని వారి ఫాస్ట్‌ట్యాగ్‌లను బ్లాక్‌లిస్ట్ చేస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో బారియర్ లెస్ టోలింగ్ (Barrier-free tolling) సిస్టమ్స్ వస్తున్న నేపథ్యంలో ఈ రూల్స్ మరింత కఠినంగా అమలు కానున్నాయి.

అతికించడం వల్ల కలిగే లాభాలు..
ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌స్క్రీన్ మీద ఫిక్స్ చేయడం వల్ల ప్రయాణం స్మూత్ గా సాగుతుంది. టోల్ వద్ద స్కానింగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది అనవసరమైన ఆలస్యాన్ని తగ్గిస్తుంది. అలాగే ఒకే ట్యాగ్‌ను వేర్వేరు వాహనాల మీద వాడే మోసాలకు కూడా ఇది అడ్డుకట్ట వేస్తుంది. ఒక్కసారి ట్యాగ్‌ను అద్దానికి అతికించిన తర్వాత దాన్ని తీయడం కష్టం కాబట్టి, మోసపూరిత పనులకు ఆస్కారం ఉండదు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ స్కామ్..
మరోవైపు ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు. ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ (Annual Pass) పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉండే ఈ ఫేక్ సైట్ల ద్వారా ప్రజల పర్సనల్ డేటాను, బ్యాంక్ వివరాలను దొంగిలిస్తున్నారు. దీనిపై ఎన్ హెచ్ ఏ ఐ ప్రజలను హెచ్చరించింది. ఎప్పుడూ కూడా ప్రభుత్వం గుర్తింపు పొందిన 'రాజ్ మార్గ్ యాత్ర' (Rajmargyatra) యాప్ ద్వారానే ఫాస్ట్‌ట్యాగ్ సేవలను పొందాలని సూచించింది.

సురక్షితంగా ఉండటానికి చిట్కాలు..
ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేటప్పుడు వచ్చే స్పాన్సర్డ్ లింక్స్ లేదా తెలియని లింక్స్ మీద క్లిక్ చేయవద్దు. ఏదైనా పేమెంట్ చేసే ముందు వెబ్‌సైట్ యూఆర్ఎల్ (URL) కరెక్టో కాదో చెక్ చేసుకోండి. ఓటీపీ (OTP), కార్డ్ వివరాలు, లాగిన్ పాస్‌వర్డ్స్ వంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేయకూడదు. ఏదైనా వెబ్‌సైట్ అనుమానాస్పదంగా అనిపించినా లేదా అనవసరమైన పర్మిషన్లు అడిగినా వెంటనే దాన్ని క్లోజ్ చేయాలి. వాహనదారులు ఈ జాగ్రత్తలు పాటిస్తే తమ ప్రయాణం సురక్షితంగా ఉండటమే కాకుండా సైబర్ మోసాల నుండి కూడా రక్షణ పొందవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Defender 110: ఇండియాలో తయారీతో రూ.34 లక్షలు తగ్గిన డిఫెండర్ 110 రేటు.. నవంబర్ 15 నుంచి డెలివరీలు
ఇండియాలో తయారీ వల్ల ఈ లగ్జరీ SUV ధర ఏకంగా రూ.34 లక్షలు తగ్గింది, మీరూ కొంటారా?
హ్యుందాయ్ లాంచ్ చేయనున్న కొత్త Electric SUV, టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ !
హ్యుందాయ్ లాంచ్ చేయనున్న కొత్త Electric SUV, టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ !
Wrong e-Challan: ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్‌ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
పొరపాటున మీకు ట్రాఫిక్‌ చలాన్ వచ్చిందా? కంగారు వద్దు.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి!
KTM 200 Duke కొత్త ఫీచర్లు లీక్.. 25hp పవర్‌తో మరింత స్పోర్టీ రైడింగ్, ధర స్వల్పంగా పెరిగే అవకాశం!
KTM 200 డ్యూక్‌ భలే అప్‌డేట్‌ అయిందిగా.. యూత్‌ స్పీడ్‌కు తగ్గట్లుగా కొత్తగా క్విక్‌షిఫ్టర్‌, రైడ్‌ మోడ్స్‌!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
Bigg Boss Season 10 Today October 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Embed widget