అన్వేషించండి

E85 and E100 Ethanol: పెట్రోల్ రేట్లకు చెక్ పెట్టేందుకు సర్కార్ భారీ ప్లాన్.. దేశంలోకి రాబోతున్న ఈ85 , ఈ100 ఇంధనాలు! దిగుమతుల తగ్గించడంపై ఫోకస్

పెట్రోల్ లో ఇథనాల్ శాతాన్ని భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ85 , ఈ100 ఇంధనాల వాడకంపై రోడ్డు రవాణా శాఖ కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చింది.

E85 and E100 Ethanol Blended Fuels in India: ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో మరో విప్లవాత్మక మార్పు రాబోతోంది. పెట్రోల్ ధరల సెగను తగ్గించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమ శాతాన్ని మరింత పెంచేలా 'ఈ85' (E85) 'ఈ100' (E100) ఇంధనాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 27, 2026న ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌కు అవసరమైన సవరణలు చేయాలని ఇందులో ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై ప్రజల నుండి అభిప్రాయాలను కోరుతున్నారు. ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

ఏమిటీ ఈ85 , ఈ100?
ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం, ఈ85 ఇంధనం అంటే ఇందులో 85 శాతం ఇథనాల్, కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ఇక ఈ100 విషయానికి వస్తే, ఇది దాదాపు పూర్తి స్థాయి ప్యూర్ ఇథనాల్ ఇంధనం. గత ఏడాది అంటే 2025లో భారత ప్రభుత్వం పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలిపే (E20) లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ20 ఇంధనం అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు దానికి మించి ఇథనాల్ వాడకాన్ని పెంచడం ద్వారా విదేశాల నుండి దిగుమతి చేసుకునే క్రూడాయిల్ పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇంధన వర్గీకరణలో మార్పులు..
కేవలం కొత్త ఇంధనాలను ప్రవేశపెట్టడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న ఇంధన లేబులింగ్ విధానంలో కూడా మార్పులు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటివరకు పెట్రోల్ ను ఈ10 లేదా ఈ అని పిలిచేవారు, ఇకపై దీన్ని ఈ10/ఈ20 గా అప్ డేట్ చేయనున్నారు. అలాగే కొత్తగా రాబోయే ఈ85, ఈ100 కేటగిరీలను అధికారికంగా గుర్తించనున్నారు. ఇదే తరహా మార్పులు డీజిల్ విభాగంలో కూడా రాబోతున్నాయి. బయో డీజిల్ బ్లెండింగ్ పరిమితిని బీ10 నుండి ఏకంగా బీ100 వరకు పెంచాలని సూచించారు. అంటే భవిష్యత్తులో మనకు పూర్తిగా జీవ ఇంధనం (Bio-based Diesel) తో నడిచే డీజిల్ వాహనాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

టెక్నికల్ అప్‌డేట్స్..
ఇంధనాలతో పాటు కొన్ని సాంకేతిక మార్పులను కూడా ఈ నోటిఫికేషన్ లో చేర్చారు. హైడ్రోజన్ ఫ్యూయల్ కు సంబంధించిన టెక్నాలజీ పేరును ఇకపై 'హైడ్రోజన్+సీఎన్' నుండి 'హైడ్రోజన్+సీఎన్జీ' (Hydrogen+CNG) గా మార్చనున్నారు. దీంతో పాటు ఉద్గారాల నిబంధనల (Emission Regulations) పరంగా కొన్ని కేటగిరీల్లో వాహనాల స్థూల బరువు పరిమితిని కూడా సవరించారు. గతంలో ఉన్న 3,000 కిలోల పరిమితిని ఇప్పుడు 3,500 కిలోలకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పుల వల్ల లాజిస్టిక్స్ ,రవాణా రంగంలో మరింత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది.

మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వాహన తయారీ సంస్థలకు కొత్త సవాలుగా మారనుంది. ఎందుకంటే అధిక శాతం ఇథనాల్ తో నడిచేలా ఇంజిన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది లాంగ్ రన్ లో దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులకు కూడా ఇథనాల్ తయారీ ద్వారా అదనపు ఆదాయం లభించే ఛాన్స్ ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Nirmal News: నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget