Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాకప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Jemimah Rodrigues News: హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ద హండ్రెడ్ లీగ్ నుంచి ఇండియన్ స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ తప్పుకోగా ఆసీస్ ఆల్‌రౌండర్ చార్లీ నాట్ రీప్లేస్‌మెంట్ గా వచ్చింది.

Jemimah Rodrigues Ruled Out Of Hundred: ఇండియన్ ఉమెన్స్ టీమ్ స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ద హండ్రెడ్ లీగ్ నుంచి రూల్ అవుట్ అయింది. హామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ రావడంతో సౌథర్న్ బ్రేవ్ టీమ్ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. దాదాపు 60,000 పౌండ్లకు డైరెక్ట్ సైనింగ్ ద్వారా సౌథర్న్ బ్రేవ్‌లో చేరిన జెమిమా, ఈ సీజన్‌లో టాప్ పర్ఫార్మర్‌గా నిలిచింది. 6 ఇన్నింగ్స్‌లలో 143 రన్స్ చేసి బ్రేవ్ టీమ్ పాయింట్ల పట్టికలో 20 పాయింట్లతో ట్రెండ్ రాకెట్స్‌తో కలసి టాప్ ప్లేస్ లో ఉండటంలో కీ రోల్ ప్లే చేసింది.
India’s star batter Jemimah Rodrigues has been ruled out for the remainder of The Hundred due to a hamstring injury.#JemimahRodrigues #TheHundred #IndianCricket #CricketNews #WomensCricket pic.twitter.com/Cg3B8T8i6G
— GH Sports (@GHSports_) August 8, 2026
టూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు.. సౌథర్న్ బ్రేవ్‌కు హెవీ డామేజ్
25 ఏళ్ల జెమిమా ఈ సీజన్‌లో రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుంది. టోర్నమెంట్ క్రూషియల్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతున్న టైమ్ లో ఆమె దూరం కావడం సౌథర్న్ బ్రేవ్‌కు పెద్ద మైనస్. డైరెక్ట్ గా ఫైనల్‌కి క్వాలిఫై అవ్వడానికి మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ట్రెంట్ రాకెట్స్‌తో బ్రేవ్‌కి ఇంకా టూ మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. ఈ టైమ్ లో జెమిమా దూరమవ్వడం టీమ్ ని డిఫెన్స్ లో పడేసింది.
ఉమెన్స్ ఆసియా కప్ ముందు టెన్షన్.. ఆగస్టు 30న ఫస్ట్ మ్యాచ్
జెమిమా గాయం తీవ్రతపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మంత్ లోనే యూఏఈ వేదికగా ఉమెన్స్ ఆసియా కప్ స్టార్ట్ కాబోతుండటంతో, ముందు జాగ్రత్తగా ఆమె లీగ్ నుంచి తప్పుకుని ఉండవచ్చని తెలుస్తోంది. ఇండియా ఆగస్టు 30న థాయిలాండ్‌తో తన ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. మరో 22 రోజుల్లో ఆసియా కప్ స్టార్ట్ అవుతుండటంతో ఇండియన్ మేనేజ్‌మెంట్ అలర్ట్ అయింది.
ఆసీస్ ఆల్‌రౌండర్ చార్లీ నాట్ ఎంట్రీ.. బ్రేవ్ స్మార్ట్ మూవ్
జెమిమా ప్లేస్ లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చార్లీ నాట్ ను సౌథర్న్ బ్రేవ్ స్క్వాడ్ లోకి తీసుకుంది. 2024 ఎడిషన్‌లో బ్రేవ్ తరఫున ఆడిన చార్లీ నాట్ మళ్లీ యూటిలిటా బౌల్ కి రిటర్న్ అయింది. రీసెంట్ గా ఇంగ్లాండ్‌లో జరిగిన వైటాలిటీ బ్లాస్ట్‌లో ద బ్లేజ్ టీమ్ విన్ అవ్వడంలో 404 రన్స్ చేసి 27 వికెట్లు తీసి ఆమె మెరిసింది. జెమిమా లేకపోవడం టీమ్ ఇండియాకి కూడా బిగ్ హెడేక్ గా మారింది. ఆసియా కప్ లో అత్యంత విజయవంతమైన జట్టైన భారత్ కు ఇలాంటి సీనియర్ ప్లేయర్ అందుబాటులో లేకపోవడం కాస్త మైనస్ గా మారే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
Before You Go
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
ట్రెండింగ్ వార్తలు



















