అన్వేషించండి

యూత్‌ నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు

Bajaj Pulsar N160 S & N160 SS పేరిట కొత్త వేరియంట్లు విడుదలయ్యాయి. కొత్త 4-వాల్వ్ ఇంజిన్, రైడ్ మోడ్స్, ఎలక్ట్రానిక్ థ్రాటిల్, TFT డిస్‌ప్లే వంటి మార్పులు వచ్చాయి.

Bajaj Pulsar N160 S, N160 SS: బజాజ్‌ ఆటో, తన పాపులర్‌ బైక్‌ Pulsar N160 సిరీస్‌లో రెండు కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది. Pulsar N160 S & Pulsar N160 SS పేరుతో వీటిని లాంచ్‌ చేసింది. కొత్త N160 S ధర రూ.1.34 లక్షలు. N160 SS ధర రూ.1.43 లక్షలు, ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. 

కొత్త వేరియంట్లతో పాటు ప్రస్తుత స్టాండర్డ్ N160 కూడా అమ్మకాలు కూడా కొనసాగుతాయి. ప్రస్తుత N160తో పోలిస్తే... కొత్త S వేరియంట్ ధర రూ.10,708 ఎక్కువ. టాప్ వేరియంట్‌ N160 SS ధర రూ.14,089 అధికంగా ఉంది.

కొత్తగా ఏం మారింది?
కొత్త Pulsar N160 S & SSలో ప్రధాన మార్పు - ఇంజిన్. ఇందులో కొత్త 164.5cc, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ 4-వాల్వ్ ఇంజిన్‌ను తీసుకొచ్చారు. ఇది 9,500rpm వద్ద 18.5hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 8,000rpm వద్ద 14.5Nm టార్క్ అందిస్తుంది.

ప్రస్తుత 2-వాల్వ్ ఇంజిన్‌తో పోలిస్తే శక్తి 16hp నుంచి 18.5hpకు పెరిగింది. అంటే అదనంగా 2.5hp పవర్‌ లభిస్తుంది. అయితే టార్క్ మాత్రం 14.65Nm నుంచి 14.5Nmకు స్వల్పంగా తగ్గింది.

ఇది కూడా చదవండి: 5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?

మరో కీలక మార్పు థ్రాటిల్ వ్యవస్థ. పాత మెకానికల్ థ్రాటిల్ స్థానంలో ఎలక్ట్రానిక్ థ్రాటిల్‌ను తీసుకొచ్చారు. దీనివల్ల బైక్‌లో వివిధ రైడ్ మోడ్స్‌ను అందించే అవకాశం ఏర్పడింది.

నాలుగు రైడ్ మోడ్స్
కొత్త N160 S & SSలో... Road, Rain, Sport & Off-road అనే నాలుగు రైడ్ మోడ్స్ ఉన్నాయి. రైడింగ్ పరిస్థితిని బట్టి వీటిని మార్చుకోవచ్చు. ఇవే కాకుండా Crawl Technology కూడా ఉంది. KTM బైక్‌లలో కనిపించే ఈ టెక్నాలజీ, తక్కువ వేగంతో బైక్‌ను నడిపేటప్పుడు ఉపయోగపడుతుంది. ఎక్కువ గేర్‌లో ఉన్నప్పటికీ తక్కువ క్లచ్ ఇన్‌పుట్‌తో బైక్ ముందుకు కదిలేలా ఇది సహాయపడుతుంది.

N160 SSలో అదనంగా ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. వాలుగా ఉండే రోడ్లపై వెనుక చక్రం అదుపు తప్పకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!

సస్పెన్షన్ & బ్రేకుల్లోనూ మార్పులు
కొత్త వేరియంట్లలో ముందు భాగంలో 33mm యూనిట్ల స్థానంలో 37mm USD ఫోర్కులు ఇచ్చారు. దీంతో ముందు సస్పెన్షన్ మరింత మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది. ముందు బ్రేక్ డిస్క్ సైజ్‌ కూడా పెరిగింది. పాత యూనిట్ స్థానంలో పెద్ద 300mm ఫ్రంట్ డిస్క్‌ ఇచ్చారు. 

మోనోషాక్, 14 లీటర్ల ఇంధన ట్యాంక్, 1,348mm వీల్‌బేస్ & 165mm గ్రౌండ్ క్లియరెన్స్‌లో మార్పులు లేవు. సీటు ఎత్తు 795mmగానే ఉంది. బైక్ కర్బ్ బరువు 151 కిలోలుగా కొనసాగుతోంది.

TFT డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణ
N160 SSలో మరో ముఖ్యమైన ఫీచర్ వచ్చింది. Bajaj మోటార్‌సైకిళ్లలో తొలిసారిగా 5 అంగుళాల TFT డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఇందులో Google Maps మిర్రరింగ్ సదుపాయం ఉంటుంది.

N160 Sలో మాత్రం LCD కన్సోల్‌నే కొనసాగించారు. టాప్ N160 SSలో అడ్జస్టబుల్ లీవర్లు కూడా ఉన్నాయి. Bluetooth & Wi-Fi కనెక్టివిటీ కూడా లభిస్తుంది.

రంగులు ఇవే
కొత్త N160 S & N160 SS వేరియంట్లను మూడు రంగుల్లో - Atlantic Blue, Pearl Metallic White & Brooklyn Black - కొనుగోలు చేయవచ్చు.

మొత్తంగా చూస్తే.. కొత్త Pulsar N160లో కేవలం డిజైన్ మార్పులు మాత్రమే కాకుండా ఇంజిన్, ఎలక్ట్రానిక్ థ్రాటిల్, రైడ్ మోడ్స్, సస్పెన్షన్, బ్రేకులు & కనెక్టివిటీ విషయంలో గణనీయమైన అప్‌గ్రేడ్స్ వచ్చాయి. ముఖ్యంగా N160 SSలో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ & Wi-Fi కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ బైక్‌ను మరింత ప్రీమియం మోడల్‌గా మార్చాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget