అన్వేషించండి

Royal Enfield Sales April 2026 Growth: సేల్స్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ రికార్డు.. ఏప్రిల్ లో లక్షకు పైగా బైకుల అమ్మకం! ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లోకి 'ఫ్లైయింగ్ ఫ్లీ' ఎంట్రీ

Royal Enfield Sales April Growth:ఏప్రిల్ 2026లో రాయల్ ఎన్ ఫీల్డ్ 1,13,164 బైకులను విక్రయించి 31 శాతం వృద్ధి సాధించింది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లైయింగ్ ఫ్లీ సి6 మోడల్‌ను కూడా లాంచ్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏప్రిల్ 2026లో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాలు 31% పెరిగాయి.
  • కంపెనీ తొలి ఎలక్ట్రిక్ బైక్ 'ఫ్లైయింగ్ ఫ్లీ సి6' మార్కెట్లోకి వచ్చింది.
  • రాయల్ ఎన్ ఫీల్డ్ మూడవ అత్యంత బలమైన ఆటోమొబైల్ బ్రాండ్ గా నిలిచింది.
  • హిమాలయన్ 450 మోడల్ గ్లోబల్ సేల్స్ లో 38,000 యూనిట్లు దాటింది.

Royal Enfield Sales April 2026 Growth Driven by Flying Flea C6 Electric: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield) కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27ను ఘనంగా ప్రారంభించింది. ఏప్రిల్ 2026 నెలలో కంపెనీ ఏకంగా 1,13,164 మోటార్ సైకిళ్లను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంతో (86,559 యూనిట్లు) పోలిస్తే ఇది 31 శాతం పెరుగుదల. ముఖ్యంగా ఇండియాలో రాయల్ ఎన్ ఫీల్డ్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. దేశీయ మార్కెట్ లో ఏప్రిల్ లో 1,04,129 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే లోకల్ సేల్స్ లో 37 శాతం భారీ వృద్ధి నమోదైంది. అయితే ఎగుమతుల (Exports) విషయంలో మాత్రం కొంత వెనుకబాటు కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లకు పంపిన బైకులు 14 శాతం తగ్గి 9,035 యూనిట్లకు పరిమితమయ్యాయి.

ఎలక్ట్రిక్ యుగంలోకి అడుగు..
రాయల్ ఎన్ ఫీల్డ్ చరిత్రలో ఏప్రిల్ 2026 ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ 'ఫ్లైయింగ్ ఫ్లీ సి6' (Flying Flea C6) ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రెట్రో స్టైలింగ్ తో పాటు మోడరన్ టెక్నాలజీతో వచ్చిన ఈ బైక్ కు కస్టమర్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 'సిటీ ప్లస్' ఎలక్ట్రిక్ మొబిలిటీ విజన్ లో భాగంగా కంపెనీ ఈ అడుగు వేసింది. ప్రస్తుతం బెంగళూరులోని తొలి రిటైల్ అవుట్లెట్ ద్వారా దీన్ని విక్రయిస్తున్నారు. భవిష్యత్తులో దశలవారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Also Read: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!

గ్లోబల్ గుర్తింపు - కొత్త మోడళ్లు..
బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం, 2026లో ప్రపంచంలోనే మూడవ అత్యంత బలమైన ఆటోమొబైల్ బ్రాండ్ గా రాయల్ ఎన్ ఫీల్డ్ నిలిచింది. అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో కంపెనీ సక్సెస్ అయింది. ఇక లోకల్ మార్కెట్ లో పాపులర్ అయిన హంటర్ 350 (Hunter 350) లైనప్ ను మరింత విస్తరించింది. కొత్తగా 'బేస్ ప్రీమియం' వేరియంట్ తో పాటు మరిన్ని కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. నగరాల్లో ఉండే యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ అప్‌డేట్స్ ఉన్నాయి. అలాగే అడ్వెంచర్ ఇష్టపడే వారి కోసం 'హిమాలయన్ బేస్ క్యాంప్ - లడఖ్ ఎడిషన్' పేరుతో సెప్టెంబర్ లో ఒక భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తోంది.

Also Read: భారత్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే టాప్ 5 టర్బో పెట్రోల్ ఎస్‌యూవీలు! లో బడ్జెట్‌లో పవర్‌ఫుల్‌ కార్లు!

హిమాలయన్ 450 జోరు..
ప్రపంచవ్యాప్తంగా హిమాలయన్ 450 (Himalayan 450) మోడల్ తన కేటగిరీలో బెస్ట్ సెల్లింగ్ బైక్ గా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇండియా, బ్రెజిల్ వంటి దేశాల్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది గ్లోబల్ సేల్స్ లో 38,000 యూనిట్ల మార్కును ఇది దాటేసింది. బైకులతో పాటు లైఫ్ స్టైల్ విభాగంపై కూడా కంపెనీ ఫోకస్ పెట్టింది. రాయల్ ఎన్ ఫీల్డ్ అపారెల్ విభాగంలో 125 ఏళ్ల చరిత్రను ప్రతిబింబించేలా 'హెరిటేజ్ కలెక్షన్' ను లాంచ్ చేసింది. అలాగే క్లాసిక్ 500 (Classic 500) స్కేల్ మోడల్ రేంజ్ లో మెడల్లియన్ బ్రాంజ్, ఆరెంజ్ ఎంబర్ అనే రెండు కొత్త రంగులను జత చేసింది. 964 చిన్న భాగాలతో తయారైన ఈ సూక్ష్మ నమూనాలు బైక్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Also Read: మైలేజ్ ఇచ్చే బెస్ట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఇవే! లీటర్ కు 28 కిమీ ఇచ్చే హైబ్రిడ్ కార్ల లిస్ట్

కంపెనీ ధీమా..
ఏప్రిల్ పెర్ఫార్మెన్స్ పై ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి. గోవిందరాజన్ స్పందిస్తూ, కొత్త ఆర్థిక సంవత్సరాన్ని బలమైన వృద్ధితో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, త‌మ తొలి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లైయింగ్ ఫ్లీ సి6 కు వస్తున్న స్పందన మాలో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. ప్రపంచస్థాయిలో టాప్ 3 బ్రాండ్ గా నిలవడం త‌మ బాధ్యతను మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులతో కస్టమర్ల ముందుకు వస్తామ‌ని తెలిపారు. మొత్తానికి రాయల్ ఎన్ ఫీల్డ్ తన పాత క్లాసిక్ లుక్ ను కాపాడుకుంటూనే, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

Frequently Asked Questions

రాయల్ ఎన్ ఫీల్డ్ ఏప్రిల్ 2026లో ఎన్ని బైకులు విక్రయించింది?

ఏప్రిల్ 2026లో రాయల్ ఎన్ ఫీల్డ్ మొత్తం 1,13,164 మోటార్ సైకిళ్లను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 31 శాతం పెరుగుదల.

రాయల్ ఎన్ ఫీల్డ్ యొక్క మొదటి ఎలక్ట్రిక్ బైక్ పేరు ఏమిటి?

రాయల్ ఎన్ ఫీల్డ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ను 'ఫ్లైయింగ్ ఫ్లీ సి6' (Flying Flea C6) పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది.

2026లో ప్రపంచంలో మూడవ అత్యంత బలమైన ఆటోమొబైల్ బ్రాండ్ గా ఏది నిలిచింది?

బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం, 2026లో ప్రపంచంలోనే మూడవ అత్యంత బలమైన ఆటోమొబైల్ బ్రాండ్ గా రాయల్ ఎన్ ఫీల్డ్ నిలిచింది.

హిమాలయన్ 450 మోడల్ ఏ దేశాలలో బాగా అమ్ముడవుతోంది?

హిమాలయన్ 450 మోడల్ ముఖ్యంగా ఇండియా, బ్రెజిల్ వంటి దేశాల్లో బాగా అమ్ముడవుతోంది మరియు దాని కేటగిరీలో బెస్ట్ సెల్లింగ్ బైక్ గా దూసుకుపోతోంది.

టాప్ హెడ్ లైన్స్

Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
పెట్రోల్‌తో 24.77km, సీఎన్‌జీతో 34.47km.. 2026 టయోటా గ్లాంజా మైలేజీకి ఫిదా అవ్వాల్సిందే!
టయోటా గ్లాంజా, మారుతి బలెనో, హ్యుందాయ్‌ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌ - ఏ కారు మైలేజ్‌ ఎక్కువ?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget