అన్వేషించండి

LPG Price Hike: పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్‌ ధరలు పెంపు!  ప్రజలపై ఎంత భారం పడుతుందంటే?

LPG Price Hike: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదలతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండర్‌ ధర కూడా పెరగనుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి.
  • పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 పెరిగే అవకాశం.
  • వంట గ్యాస్ సిలిండర్ ధర 40-50 రూపాయలు పెరిగే సూచన.
  • వచ్చే 5-7 రోజుల్లో ధరల పెంపుపై తుది నిర్ణయం.

LPG Price Hike: భారత్‌లో వాహనదారులకు, గృహిణులకు ఆందోళన కలిగించే వార్త ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. గత దాదాపు నాలుగేళ్లుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలలో త్వరలోనే మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ముడిచమురు ధరలను ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇంధన ధరల సవరణకు సిద్ధమవుతోంది. 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటర్‌కు రూ. 4 నుంచి ఐదు రూపాయలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేవలం వాహనదారులపై కాకుండా వంట గ్యాస్‌ వినియోగదారులపై కూడా భారం పడనుంది. గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్‌ ధఱ సుమారు 40 నుంచి 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. 2022 నుంచి రిటైల్ ఇంధన ధరలలో ఎటువంటి పెద్ద మార్పులు చేయలేదు. 

Also Read: భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!

ధరల పెంపునకు కారణాలు ఏంటీ? 

పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్‌ అస్థిరంగా మారింది. ఇది భారత్ వంటి దిగుమతులై ఆధారపడే దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా రిటైల్ ధరలను పెంచకపోవడంతో ఇండియన్ ఆయిల్‌, హెచ్‌పీసీఎల్ వంటి కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెరిగిన ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయకపోవడం వల్ల వారిపై భారం పెరుగుతోంది. చమురు ధరలను నియంత్రణలో ఉంచడానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి. దీని వల్ల బడ్జెట్‌ లక్ష్యాలను చేరుకోవడం కష్టతరమవుతోంది. 

Also Read: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!

పెంపు బాంబు ఎప్పుడు పేలుస్తారు?

ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రతిపాదిత ధరల పెంపుపై రాబోయే 5 నుంచి 7 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం కనీస స్థాయిలో ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. 

Also Read: కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ లో కార్తీక్ ఆర్యన్ షికారు.. లగ్జరీ కార్ల కలెక్షన్ లో మరో డైమండ్.. స్టైల్ కు కంఫర్ట్ తోడైతే..

ధరల పెంపు అనేది ఒక సున్నితమైన అంశం. ముఖ్యంగా ఆహారపు వస్తువుల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న సమయంలో, ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం క్వాలిబ్రేటెడ్‌ హైక్ అంటే దశలవారీగా లేదా నియంత్రిత పద్ధతిలో ధరలను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూడాలని భావిస్తోంది.

Also Read: మైలేజ్ ఇచ్చే బెస్ట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీలు ఇవే! లీటర్ కు 28 కిమీ ఇచ్చే హైబ్రిడ్ కార్ల లిస్ట్

ప్రభుత్వం ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒకవైపు చమురు కంపెనీల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం మరోవైపు సామాన్య వినియోగదారుడిని ద్రవ్యోల్బణం నుంచి రక్షించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. రాబోయే కొద్ది రోజులు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ కదలికలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత ఇంధన ధరల భవిష్యత్‌ను నిర్ణయించనున్నాయి. వినియోగదారులు తమ నెలవారీ బడ్జెట్‌లో మార్పులకు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. 

Frequently Asked Questions

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా?

అవును, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 4 నుండి 5 వరకు పెంచే అవకాశం ఉంది.

వంట గ్యాస్ (LPG) ధరలు కూడా పెరుగుతాయా?

అవును, గృహ అవసరాలకు వాడే LPG సిలిండర్ ధర సుమారు 40 నుండి 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.

ఇంధన ధరలు పెరగడానికి గల కారణాలు ఏమిటి?

పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. దీని వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ధరల పెంపుపై తుది నిర్ణయం ఎప్పుడు వెలువడనుంది?

రాబోయే 5 నుండి 7 రోజుల్లో ఈ ప్రతిపాదిత ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం తక్కువగా ఉండేలా చూస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget