అన్వేషించండి

2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ - పానోరమిక్ సన్‌రూఫ్‌, భారీ టచ్‌స్క్రీన్‌, 540 డిగ్రీ కెమెరా, కొత్త ఫీచర్లతో లాంచ్‌

2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ రూ.13.69 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. పానోరమిక్ సన్‌రూఫ్‌, 540 డిగ్రీ కెమెరా, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌, కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

Mahindra Scorpio N facelift Price And Features Telugu: మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటైన మహీంద్రా స్కార్పియో N.. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌గా మార్కెట్లోకి వచ్చింది. మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ ప్రారంభ ధరను రూ.13.69 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. అత్యాధునిక సాంకేతికత, కొత్త సౌకర్యాలు & ప్రీమియం ఫీచర్లతో కంపెనీ ఈ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. అయితే ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు, ఫీచర్లు & డిజైన్ అప్‌డేట్‌లపైనే దృష్టి పెట్టింది.

ఇంటీరియర్‌
కొత్త స్కార్పియో Nలో అతిపెద్ద ఆకర్షణ 12.3 అంగుళాల ఫ్రీ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. గతంలో ఉన్న 8 అంగుళాల యూనిట్ స్థానంలో దీన్ని అమర్చారు. అలాగే, 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా జోడించారు. దీంతో డ్రైవింగ్ సమయంలో వాహనానికి సంబంధించిన సమాచారం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

తొలిసారిగా, పానోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా స్కార్పియో Nలో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు.. 540 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, కొత్త సెంటర్ కన్సోల్ స్విచ్‌లు & అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ ఫీచర్‌ కూడా యాడ్‌ అయ్యాయి. ఇందులో ఇంజిన్ పనితీరు, రోల్‌, పిచ్‌, కంపాస్‌, ఆల్టీమీటర్‌, G ఫోర్స్ వంటి వివరాలను డ్రైవర్ ప్రత్యక్షంగా చూడవచ్చు.

ఫీచర్లు
ముందు వరుస ప్రయాణికుల కోసం 65W USB Type C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌ను కంపెనీ అందించింది. వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, Adrenox కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, Alexa బిల్ట్ ఇన్‌, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్‌, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్‌, 12 స్పీకర్ల Sony ఆడియో సిస్టమ్‌, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి. ఈ SUVను 6 సీటర్ & 7 సీటర్ లేఅవుట్‌లలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు

సేఫ్టీ
భద్రత పరంగా కూడా మహీంద్రా ఎలాంటి రాజీ పడలేదు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్‌, హిల్ హోల్డ్‌, హిల్ డిసెంట్ కంట్రోల్‌, నాలుగు చక్రాల డిస్క్ బ్రేక్‌లు, డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్‌, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. టాప్ ఎండ్ Z8L వేరియంట్‌లో Level 2 ADAS కూడా ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, లేన్ కీప్ అసిస్ట్‌, లేన్ డిపార్చర్ వార్నింగ్‌, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్‌, స్మార్ట్ పైలట్ అసిస్ట్‌, హై బీమ్ అసిస్ట్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఎక్స్‌టీరియర్‌
బయటి డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. స్కార్పియో Nకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన బాక్సీ స్టైల్‌ను అలాగే కొనసాగించింది. క్రోమ్ ఆరు స్లాట్ గ్రిల్‌, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌, C ఆకారంలోని LED DRLs, నిలువుగా ఉన్న LED టెయిల్ ల్యాంప్స్‌, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌, రూఫ్ రైల్స్‌, సైడ్ స్టెప్స్‌, ఎత్తైన బాడీ డిజైన్ యథాతథంగా ఉన్నాయి. అయితే, టాప్‌ వేరియంట్లలో కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు. ఎవెరెస్ట్ వైట్‌, గెలాక్సీ గ్రే, ఓషియానిక్‌, స్టెల్త్ బ్లాక్‌, డీప్ ఫారెస్ట్ అనే ఐదు రంగుల్లో ఈ SUV అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌

ఇంజిన్ 
ఈ కారులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 203 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 370 Nm టార్క్‌, ఆటోమేటిక్‌తో 380 Nm టార్క్ లభిస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ రెండు ట్యూనింగ్‌లలో అందుబాటులో ఉంది. తక్కువ వేరియంట్లలో 132 hp పవర్‌, 300 Nm టార్క్‌, టాప్‌ వేరియంట్లలో 175 hp పవర్‌, మాన్యువల్‌తో 370 Nm & ఆటోమేటిక్‌తో 400 Nm టార్క్‌ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ & 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

అన్ని వేరియంట్లలో Rear Wheel Drive స్టాండర్డ్‌గా ఉంటుంది. ఎంపిక చేసిన డీజిల్ వేరియంట్లలో 4XPLOR Four Wheel Drive సిస్టమ్‌ను అందించారు. ఇందులో Snow, Mud & Ruts, Sand టెర్రైన్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే Zip, Zap & Zoom డ్రైవ్ మోడ్‌లు కూడా కొనసాగుతున్నాయి. 

మొత్తంగా చూస్తే.. 2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో మెకానికల్ మార్పులు లేకపోయినా, కొత్త ఫీచర్లు & సాంకేతికతతో ఈ SUVని మరింత ప్రీమియంగా మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget