అన్వేషించండి

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌

Renault కంపెనీ, తన Kiger, Triber & Kwid కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. Kigerపై రూ.68,000 వరకు, Triberపై రూ.60,000 వరకు, Kwidపై రూ.40,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

Renault Car Discounts August 2026: కొత్త కారు కొనబోతున్నవాళ్లకు రెనాల్ట్‌ ఒక శుభవార్త చెప్పింది. ఈ నెలలోనే (ఆగస్టు 2026) కారు కొనేవాళ్లకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా విడుదలైన Duster మినహా మిగతా అన్ని మోడళ్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్లు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు చేసిన బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.

ఈ నెలలో Renault Kigerపై అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. Kwidపై తక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. Kiger & Triber కొనుగోలుదారులకు లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

రెనాల్ట్‌ కైగర్‌
ఈ నెలలో Renault Kiger కొనేవాళ్లకు గరిష్ఠంగా రూ.68,000 వరకు ప్రయోజనాలు అందుతాయి. కేరళ & గుజరాత్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో రూ.20 వేల వరకు నగదు డిస్కౌంట్ ఉంది. పాత వాహనాన్ని ఎక్స్‌ఛేంజ్ చేయడం లేదా స్క్రాపేజ్ కింద ఇచ్చేవాళ్లకు రూ.25 వేల వరకు అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఇప్పటికే Renault వాహనం ఉన్న వారికి రూ.18 వేల వరకు లాయల్టీ బెనిఫిట్ కూడా ఉంది. అదనంగా రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు.

కేరళ & గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రం Kigerపై ఆఫర్లు కొంత భిన్నంగా ఉన్నాయి. అక్కడ క్యాష్‌ డిస్కౌంట్ గరిష్ఠంగా రూ.50 వేల వరకు ఉంది. ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనం కూడా రూ.50 వేల వరకు లభిస్తుంది. లాయల్టీ బెనిఫిట్ & కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రం మిగతా రాష్ట్రాల మాదిరిగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం Renault Kiger ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.10.40 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి: రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు

రెనాల్ట్‌ ట్రైబర్‌
Renault Triberపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. కేరళ & గుజరాత్ మినహా ఇతర రాష్ట్రాల్లో ఈ MPVపై గరిష్ఠంగా రూ.60,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.15 వేల నగదు డిస్కౌంట్ ఉంది. స్క్రాపేజ్ కింద రూ.25 వేల వరకు లేదా ఎక్స్‌ఛేంజ్ కింద రూ.15 వేల వరకు బెనిఫిట్‌ పొందొచ్చు. అదనంగా రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు.

కేరళ & గుజరాత్ రాష్ట్రాల్లో Triberపై నగదు డిస్కౌంట్ రూ.30 వేల వరకు ఉంది. ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనం కూడా రూ.30 వేల వరకు లభిస్తోంది. స్క్రాపేజ్ & కార్పొరేట్ బెనిఫిట్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. Triber ఎక్స్‌షోరూమ్ ధర ప్రస్తుతం రూ.5.81 లక్షల నుంచి రూ.8.53 లక్షల మధ్య ఉంది.

ఇది కూడా చదవండి: TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌

రెనాల్ట్‌ క్విడ్‌
ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ Renault Kwidపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రూ.15,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్ & రూ.25,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తోంది. మొత్తంగా, రూ.40 వేల వరకు ప్రయోజనం పొందొచ్చు.

అయితే Kwid కోసం ప్రకటించిన ఈ ఆఫర్ అన్ని రాష్ట్రాలకు ఒకేలా వర్తించదు. కేరళ, అస్సాం, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్ & ఆంధ్రప్రదేశ్‌లో నగదు డిస్కౌంట్ రూ.30 వేల వరకు ఉంది. స్క్రాపేజ్ బెనిఫిట్ మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. Kwid ఎక్స్ షోరూమ్ ధర రూ.4.53 లక్షల నుంచి రూ.5.61 లక్షల వరకు ఉంది.

నగరాన్ని బట్టి, డీలర్‌ను బట్టి, స్టాక్ లభ్యతను బట్టి ఈ ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చని రెనాల్ట్‌ తెలిపింది. అందువల్ల, కొత్త కారు బుక్‌ చేసే ముందే మీ దగ్గరలోని Renault డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget