అన్వేషించండి

మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు

Malaika Arora Thar Roxx: ఇది కంపెనీ 5-డోర్ Thar Roxx ఆధారంగా రూపొందించిన ప్రత్యేక ఎడిషన్. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఇందులో అనేక కాస్మెటిక్ మార్పులు చేశారు. వివరాలు

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బాలీవుడ్ నటి మలైకా అరోరా కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసింది.
  • ఈ థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ ప్రత్యేక డిజైన్, ఫీచర్లు కలిగి ఉంది.
  • దీని ఆన్-రోడ్ ధర రూ.23 లక్షలు; అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

బాలీవుడ్ నటి మలైకా అరోరా కొనడంతో ఓ వాహనం ట్రెండ్ అవుతోంది. గతంలో ఆమెకు పలు వాహనాలు ఉన్నప్పటికీ తాజాగా Mahindra Thar Roxx Star Edition కొనుగోలు చేశారు. ఆ వాహనానికి పూజ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Mahindra ఈ స్పెషల్ ఎడిషన్‌ను ఇటీవల లాంచ్ చేయగా.. ఇది కంపెనీకి చెందిన ప్రముఖ Thar Roxx లిమిటెడ్ ఎడిషన్ అని తెలిసిందే.

ఈ ఎడిషన్‌ను స్ట్రాంగ్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యంతో పాటు ప్రీమియం డిజైన్, మోడ్రన్ ఫీచర్లు కోరుకునే కస్టమర్ల కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. Mahindra Thar Roxx Star Edition కంపెనీ 5 డోర్ ఆధారంగా రూపొందించిన ప్రత్యేక ఎడిషన్. ఇందులో స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే అనేక మార్పులు చేశారు. ఎక్స్‌టీరియర్‌లో కొత్త డిజైన్ ఎలిమెంట్లు, ఎక్స్‌క్లూజివ్ బ్యాడ్జింగ్, కొన్ని ప్రీమియం ఫినిష్‌ గమనించవచ్చు. 

కారు ఇంటీరియర్ 

మహీంద్రా థార్ ఎక్స్ స్టార్ ఎడిషన్ ఇంటీరియర్‌లో కూడా స్పెషల్ థీమ్, ప్రీమియం అప్హోల్స్ట్రీ, కొత్త డిజైన్ ఎలిమెంట్లు ఇచ్చారు. ఇవి దీన్ని Thar Roxx నుంచి ప్రత్యేకంగా చేస్తాయి. తమ SUVలో ప్రత్యేక గుర్తింపు, ప్రీమియం ఫీల్ కోరుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఈ ఎడిషన్‌ను ప్రత్యేకంగా రూపొందించింది.

మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు

కారు ధర ఎంత?

హైదరాబాద్‌లో Mahindra Thar Roxx Star Edition ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు 19.70 లక్షల రూపాయలు. అయితే, ఎంచుకున్న వేరియంట్, ఇంజిన్, డ్రైవ్ సిస్టమ్ ఆధారంగా ధరలు పెరుగతాయి. ఆన్ రోడ్ ధర అయితే రూ. 23 లక్షలు ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ లిమిటెడ్‌గా అందుబాటులోకి తెచ్చారు. అందుకే దీనికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ. 

Thar Roxx Star Edition డిజైన్ దీన్ని అత్యంత ప్రత్యేకంగా చేస్తుంది. ఇందులో ఫ్రంట్ గ్రిల్, బాడీపై ఎక్స్‌క్లూజివ్ స్టైలింగ్ ఎలిమెంట్లు ఇచ్చారు. అలాగే Star Edition ప్రత్యేక బ్యాడ్జింగ్ ఇచ్చారు. అదనంగా కొత్త అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ ఫినిష్, కొన్ని ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్లు ప్రీమియం లుక్ ఇస్తాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో ప్రీమియం సీట్ అప్హోల్స్ట్రీ, అంబియంట్ లైటింగ్, కొత్త డాష్‌బోర్డ్ ఫినిష్, మెరుగైన నాణ్యత గల మెటీరియల్‌ను ఉపయోగించారు. క్యాబిన్ గతంతో పోలిస్తే మరింత లగ్జరీగా అనిపిస్తుంది.


మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు

ఈ కారు ప్రత్యేకతలివే

Mahindra ఈ స్పెషల్ ఎడిషన్‌లో దాదాపు అన్ని మోడ్రన్ ఫీచర్లను చేర్చింది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, పనోరమిక్ సన్‌రూఫ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ చార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!

ఇంజిన్, పనితీరు

మహీంద్రా Thar Roxx Star Editionలో స్టాండర్డ్ Thar Roxxలో ఇచ్చే అదే ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 2 ఇంజిన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉన్నాయి. కొన్ని వేరియంట్లలో 4x4 డ్రైవ్ సిస్టమ్ ఉంది, దీంతో ఈ SUV గుంతల రోడ్లు, పర్వతాలు, బురద, ఇసుక ప్రాంతాల్లో కూడా అద్భుతంగా దూసుకెళ్తుంది. 

Mahindra Thar Roxx Star Editionను స్ట్రాంగ్ బాడీ, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, మోడ్రన్ 4x4 సిస్టమ్‌తో రూపొందించారు. ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కు కావాల్సిన అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవి టఫ్ రూట్లలో కూడా మెరుగైన కంట్రోల్, స్థిరత్వాన్ని నిలుపుతాయి. 

సేఫ్టీ పరంగా కూడా ఈ SUV చాలా బెస్ట్. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, అనేక అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. 


మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు

హాట్ టాపిక్‌గా మారిన SUV

బాలీవుడ్ నటి మలైకా అరోరా తరచూ తన లైఫ్‌స్టైల్, రిలేషన్‌లతో వార్తల్లో ఉంటారు. తాజాగా ఆమె గ్యారేజీలోకి Mahindra Thar Roxx Star Edition చేరడంతో ఈ SUV పాపులారిటీ ఒక్కసారిగా పెరిగింది. 

 

Frequently Asked Questions

మలైకా అరోరా కొనుగోలు చేసిన కొత్త వాహనం ఏమిటి?

ఇది మహీంద్రా థార్ రోక్స్ స్టార్ ఎడిషన్, కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్. ఇది స్ట్రాంగ్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో ప్రీమియం డిజైన్ కలిగి ఉంది.

మహీంద్రా థార్ రోక్స్ స్టార్ ఎడిషన్ యొక్క ప్రత్యేక డిజైన్ అంశాలు ఏమిటి?

దీని ఎక్స్‌టీరియర్‌లో కొత్త డిజైన్ ఎలిమెంట్లు, ఎక్స్‌క్లూజివ్ బ్యాడ్జింగ్, కొత్త అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ ఫినిష్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో ప్రీమియం అప్హోల్స్ట్రీ, అంబియంట్ లైటింగ్ ఉంటాయి.

ఈ మహీంద్రా థార్ రోక్స్ స్టార్ ఎడిషన్ ధర ఎంత?

హైదరాబాద్‌లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు 19.70 లక్షల రూపాయలు. ఆన్ రోడ్ ధర అయితే రూ. 23 లక్షలు ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget