Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
2027 వన్డే వరల్డ్ కప్ దగ్గరపడుతుండటంతో టీమిండియా స్క్వాడ్ సెలక్షన్ పై తీవ్ర చర్చ మొదలయింది. 2011 తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్ గెలవకపోవడంతో ఈసారి శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్, రవిచంద్రన్ అశ్విన్ తమ ప్రెడిక్టెడ్ స్క్వాడ్స్‌ను వెల్లడించారు.
సునీల్ గవాస్కర్ ఎంచుకున్న జట్టులో గిల్, రోహిత్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్‌లతో టాప్-5 బలంగా ఉందన్నాడు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, ఆల్‌రౌండర్లుగా హార్దిక్, నితీష్ కుమార్ రెడ్డిలను ఎంచుకోవడం సరైన నిర్ణయమని అన్నారు. స్పిన్ విభాగంలో అక్షర్, జడేజా, కుల్దీప్‌లతో పాటు పేసర్లుగా బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌లను సెలెక్ట్ చేసుకున్నారు.
మరోవైపు స్పిన్ లెజెండ్ అశ్విన్ ఎంపిక అందరినీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలని అశ్విన్ కోరాడు. సౌత్ ఆఫ్రికా పిచ్‌లకు భువీ స్వింగ్ బాగా ఉపయోగిపడుతుందని, అతనిని ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడించి సిద్ధం చేయాలని సూచించాడు. అందరినీ షాక్‌కి గురిచేస్తూ రిషభ్ పంత్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలను అశ్విన్ 'నో' కేటగిరీలో పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ట్రెండింగ్ వార్తలు






















