అన్వేషించండి

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో పాటు BaaS ఆఫర్ - నిజంగా మంచి ఆఫర్‌!

క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌ను హ్యుందాయ్ కంపెనీ ప్రకటించింది. BaaS ఆప్షన్‌తో ప్రారంభ ధరను కూడా భారీగా తగ్గించింది.

Creta Electric Price, Range And Features Telugu: హ్యుందాయ్ కంపెనీ, తన పాపులర్‌ ఎలక్ట్రిక్ SUV "క్రెటా ఎలక్ట్రిక్"ను కొనేవాళ్ల కోసం కొత్త అస్యూర్డ్ బైబ్యాక్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ కింద, ఈ కారును కొనుగోలు చేసినవాళ్లకు 3 సంవత్సరాలు లేదా 45,000 కి.మీ. వరకు (ఏది ముందుగా పూర్తైతే అది వర్తిస్తుంది) 60 శాతం అస్యూర్డ్ బైబ్యాక్ విలువ అందిస్తామని కంపెనీ వెల్లడించింది. సంస్థ నిర్దేశించిన నిబంధనలు & షరతులకు లోబడి ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

రీసేల్ గురించి బెంగ అక్కర్లేదు!
ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసిన తర్వాత దాని రీసేల్ విలువ ఎలా ఉంటుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అలాంటి వినియోగదారుల విశ్వాసాన్ని పెంచేందుకు హ్యుందాయ్ ఈ బైబ్యాక్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. భవిష్యత్‌లో వాహనాన్ని విక్రయించాలనుకున్నప్పుడు, కనీస విలువకు హామీ ఉండటంతో యూజర్లకు ఇది మంచి ఆఫర్‌గా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం, మన మార్కెట్లో హ్యుందాయ్ అందిస్తున్న అందుబాటు ధర EV.. "క్రెటా ఎలక్ట్రిక్". దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.18.03 లక్షల నుంచి రూ.23.67 లక్షల వరకు ఉంది. క్రెటా ఎలక్ట్రిక్‌ కొనాలనే కోరిక ఉన్నప్పటికీ, ఈ ధరను భరించలేనివాళ్ల కోసం ఈ కంపెనీ Battery as a Service (BaaS) ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ విధానంలో వాహనం ప్రారంభ ధర రూ.10.99 లక్షల నుంచి మొదలవుతుంది. బ్యాటరీ కోసం 42 kWh వెర్షన్‌పై ప్రతి కి.మీ.కి రూ.3.90 చొప్పున చెల్లించాలి.

ఇది కూడా చదవండి: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే!

బ్యాటరీ ఆప్షన్లు
క్రెటా ఎలక్ట్రిక్‌లో రెండు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను హ్యుందాయ్ అందిస్తోంది. ఇందులో 42 kWh బ్యాటరీ & 51.4 kWh లాంగ్ రేంజ్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 42 kWh బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్ఠంగా 420 కి.మీ. ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 510 కి.మీ. వరకు రేంజ్ లభిస్తుందని తెలిపింది.

పెర్ఫార్మెన్స్‌
పనితీరు పరంగా కూడా క్రెటా ఎలక్ట్రిక్ ఆకట్టుకునేలా ఉంది. ముందు చక్రాలకు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తి అందుతుంది. లాంగ్ రేంజ్ వెర్షన్‌లో 171 hp పవర్ ఉత్పత్తి అవుతుంది. చిన్న బ్యాటరీ వెర్షన్‌లో 135 hp సామర్థ్యం గల మోటార్‌ను అందించారు. పెద్ద బ్యాటరీ ప్యాక్‌ల కారణంగా, నగర ప్రయాణాలతో పాటు లాంగ్‌ జర్నీలకు కూడా ఈ SUV అనువుగా ఉంటుందని హ్యుందాయ్ చెబుతోంది.

చార్జింగ్ 
7.4 kW AC ఛార్జర్‌తో 42 kWh బ్యాటరీని 10 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటలు పడుతుంది. 51.4 kWh బ్యాటరీకి సుమారు 7 గంటల 15 నిమిషాల సమయం అవసరం. 100 kW సామర్థ్యమున్న DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే రెండు బ్యాటరీలూ 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 39 నిమిషాల్లో ఛార్జ్ అవుతాయని కంపెనీ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌

మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో క్రెటా ఎలక్ట్రిక్‌కు గట్టి పోటీ ఉంది. టాటా సియెర్రా EV, టాటా కర్వ్ EV, విన్ ఫాస్ట్ VF6, మహీంద్రా BE 6, ఎంజీ ZS EV, టయోటా ఈబెల్లా & మారుతి ఈ విటారా వంటి మోడళ్లతో ఇది పోటీపడుతోంది. వీటిలో విన్ ఫాస్ట్, ఎంజీ, టయోటా & మారుతి తమ ఎలక్ట్రిక్ వాహనాలపై బైబ్యాక్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. టాటా & మహీంద్రా ప్రస్తుతం అలాంటి పథకాలను అందించడం లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

7 సీటర్‌ హైబ్రిడ్ SUV 'MG Hector Tomahawk' లాంచ్.. పెట్రోల్‌, ఛార్జింగ్‌ కలిపి 1100km పైగా కంబైన్డ్‌ రేంజ్‌
లీటరుకు ఏకంగా 40km మైలేజ్.. 1100km పైగా కంబైన్డ్‌ రేంజ్‌తో MG కొత్త PHEV 'తోమహాక్‌' లాంచ్!
7 సీట్లు, 517 కి.మీ. రేంజ్, 204hp పవర్.. రూ.19.49 లక్షలకే MG Hector Tomahawk EVలో చాలా ప్రత్యేకతలు
MG కొత్త 7-సీటర్‌ ఎలక్ట్రిక్ SUV 'Tomahawk' లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 517 కి.మీ. రేంజ్‌!
మిత్సుబిషి 'పజెరో' ఈజ్ బ్యాక్.. సెప్టెంబర్ 2న కొత్త SUV ఆవిష్కరణ, దమ్మున్న ఆఫ్‌రోడింగ్‌ కారు!
మళ్లీ వస్తున్న మిత్సుబిషి 'పజెరో'.. ఈసారి మరింత మోడ్రన్‌, మరింత పవర్‌ఫుల్‌!
కార్లు, బైకుల హెడ్‌లైట్లకు కొత్త రూల్స్‌! హైబీమ్ వాడితే అలర్ట్.. వెలుగు తగ్గనుందా?
కార్లు, బైకుల్లో హైబీమ్‌ హెడ్‌లైట్లకు చెక్‌.. వెలుతురు విషయంలోనూ కీలక మార్పులు!
Advertisement

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణం ఏంటి? ఏడుగురు ప్రాణాలు తీసింది ఎవరు?
Singareni Goldmine: సింగరేణి సిరి.. బంగారు గనుల తవ్వకం చేపట్టనున్న తెలంగాణ
సింగరేణి సింగారం.. మన ఇంటి బంగారం.. గోల్డ్‌ మైన్ తవ్వుతున్న తెలంగాణ
Viral News: జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
జైలు నుంచి తప్పించుకొని ప్రభుత్వం టీచర్ అయిన నిందితుడు! 40 ఏళ్ల తర్వాత చిక్కిన మహబూబాబాద్‌ బెస్ట్ టీచర్‌ స్టోరీ!
Rakhi Gift Ideas : రాఖీ పండక్కి మీ చెల్లి/అక్కకు వీటిని బహుమతిగా ఇవ్వండి.. సింపుల్ అండ్ బెస్ట్ ఛాయిస్​
రాఖీ పండక్కి మీ చెల్లి/అక్కకు వీటిని బహుమతిగా ఇవ్వండి.. సింపుల్ అండ్ బెస్ట్ ఛాయిస్​
GV Narayanarao : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
Quinoa vs Rice : అన్నానికి బదులు క్వినోవా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా వండుకోవాలంటే
అన్నానికి బదులు క్వినోవా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా వండుకోవాలంటే
YSRCP North Andhra Leaders: వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
వారసుల కోసం ఉత్తరాంధ్ర వైఎస్ఆర్‌సీపీ నేతల మాస్టర్ ప్లాన్లు - భవిష్య్త ఇచ్చే పార్టీలోకేనా ?
Nepal Flash Floods: నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
నేపాల్‌లో వరదలు.. తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
Embed widget