అన్వేషించండి

Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 

హైదరాబాద్‌లో కొత్త కారు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు మారుతి సెలెరియో మంచి ఆప్షన్‌గా ఉంది. కేవలం 50 వేల రూపాయలనే కారు సొంతం చేసుకునే ఈఎంఐ ప్లాన్ పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సెలెరియో హైదరాబాద్ ఆన్-రోడ్ ధరలు 5.55 లక్షల నుండి ప్రారంభం.
  • 50 వేల డౌన్-పేమెంట్ తో రూ.5.10 లక్షల రుణం పొందవచ్చు.
  • సెలెరియో 26.68 kmpl మైలేజ్; అధునాతన ఫీచర్లతో అందుబాటులో.

Maruti Suzuki Celerio EMI Calculator: సొంతకారు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక కల. నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలు, నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల వేళ సామాన్యుల తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు కోసం వెతుకుతుంటారు. ఈ విభాగంలో మారుతి సుజుకి సంస్థ తిరుగులేదని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు మారుతి సెలెరియో ఒక మంచి ఎంపికగా ఉంటుంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈ కారుకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా, వినియోగదారులకు ఫైనాన్స్‌ పరంగా ఉన్న వెసులుబాట్లు, ఆన్‌రోడ్ ధరల వివరాలు మైలేజ్‌ సామర్థ్యాన్ని తెలుసుకోండి. 

హైదరాబాద్‌లో మారుతి సెలెరియో ఆన్‌రోడ్‌ ధరలు 

కారు కొనేముందు ఎక్స్‌షోరూమ్‌ ధర కంటే ఆన్‌రోడ్‌ ధరపై స్పష్టత ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్‌ వంటి అదనపు ఖర్చులు ఆన్‌రోడ్‌ ధరలో భాగమవుతాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెలెరియో 8 వేరియంట్‌లలో లభ్యమవుతోంది. 

బేస్ వేరియంట్‌ అయిన మారుతి సెలెరియో ఎల్‌ఎక్స్‌ఐ మాన్యువల్‌. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర 4, 69, 900 కాగా, హైదరాబాద్‌లో అన్ని పన్నులు కలిపి ఆన‌రోడ్ ధర సుమారు 5,55,000 నుంచి 5,60,000 వరకు ఉంటుంది. మారుతి సెలెరియో వీఎక్స్‌(మాన్యువల్‌)    ఆన్‌రోడ్ ధ సుమారు 6,14,000 నుంచి 6,18,000 పలుకుతోంది. మారుతి సెలెరియో వీఎక్స్‌ఐ(ఆటోమేటిక్‌) సిటీ ట్రాఫిక్‌లో సులంభంగా నడపాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. దీని ఆన్‌రోడ్ ధర సుమారు 6, 65, 000 నుంచి 6, 70, 000 రూపాయలుగా ఉంది. 

మారుతి సెలెరియో జెడ్‌ఎక్స్‌ఐ మాన్యువల్‌ ఆన్‌రోడ్ ధర 6,80,000 నుంచి 6,85,000 వరకు ఉంది. మారుతి సెలెరియో వీఎక్స్‌ఐ సీఎన్జీ అత్యధిక పొదుపు కోరుకునే వారికి సీఎన్జీ వేరియంట్‌ అందుబాటులో ఉంది. దీని ఆన్‌రోడ్‌ ధర సుమారు 7, 10, 000 నుంచి 7, 15, 500 వరకు ఉంది. మారుతి సెలరియో జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌ ఏఎంటీ అన్ని హంగులు కలిగిన టాప్ ఎండ్‌ వేరియంట్‌. దీని ఆన్‌రోడ్ ధర సుమారు 7, 95, 000 నుంచి 8,02,000 వరకు ఉంటుంది. 

50 వేల డౌన్‌పేమెంట్‌తో కారు ఇంటికి ఎలా తీసుకెళ్లాలి?

చాలా మంది వద్ద కారు కొనడానికి సరిపడా మొత్తం ఒకేసారి ఉండకపోవచ్చు. అటువంటి వారికి బ్యాంకులు అందించే ఎల్టీవీ నిష్పత్తి వరంగా మారుతుంది. మీ సిబిల్ స్కోర్‌ 750 కంటే ఎక్కువగా ఉంటే, ఆన్‌రోడ్ ధరలో 85 శాతం నుంచి 90 శాతం వకరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. 

ఉదాహరణకు మీరు సెలెరియో ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్‌ను ఎంచుకుని 50 వేల డౌన్‌పేమెంట్‌ చెల్లిస్తే, మిగిలిన 5,10,000 మొత్తాన్ని లోన్ రూపంలో పొందవచ్చు. సంవత్సరానికి సుమారు 9 శాతం వడ్డీ రేటు ప్రామాణికంగా తీసుకుంటే వేర్వేరు కాలపరిమితుల్లో ఈఎంఐ లెక్కలు ఇలా ఉంటాయి. 

ఏడేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 8,210 రూపాయలు  ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలకు 10, 585 రూపాయలు కట్టాలి. మూడేళ్ల కాలపరిమితికి తీసుకుంటే 16,220 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి. 

సెలెరియో మైలేజ్‌ ఎంత?

సెలెరియో ఇంత విజయవంతం కావడానికి దాని సరికొత్త కే110సి డబుల్ జెట్ ఇంజిన్ ప్రధాన కారణం. 1.0 లీటర్‌ సామర్థ్యం గల  ఇంజిన్‌ 66 బీహెచ్‌పీ పవర్‌, 89 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్‌ విషయానికి వస్తే, సెలెరియో భారతీయ రోడ్లపై సంచలనం సృష్టిస్తోంది. పెట్రోల్ వాహనం లీటరకు 25.24 kmpl నుంచి 26.68kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. అదే సీఎన్జీ అయితే కిలో 34.43km/kg మైలేజ్‌ అందిస్తుంది. 

బడ్జెట్ కారు అయినప్పటికీ మారుతి సుజుకీ ఇందులో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. 7 ఇంచ్‌ల స్మార్ట్ ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్‌ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్‌ వేరియంట్లలో హిల్‌ హోల్డ్ అసిస్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

కారు కొనుగోలు చేసే సమయంలో పండుగ ఆఫర్లు, లేదా కార్పొరేట్ డిస్కౌట్‌ గురించి డీలర్‌షిప్‌ల వద్ద ఆరా తీయడ మంచిది. దీని వల్ల మీరు 15వేల నుంచి 25వేల వరకు అదనంగా ఆదా చే ఛాన్స్ ఉంది. 

Frequently Asked Questions

హైదరాబాద్‌లో మారుతి సెలెరియో ఆన్‌రోడ్‌ ధరలు ఎలా ఉంటాయి?

బేస్ వేరియంట్ (LXI) ఆన్‌రోడ్ ధర సుమారు ₹5,55,000 నుంచి ₹5,60,000 వరకు ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ (ZXI ప్లస్ AMT) ధర ₹7,95,000 నుంచి ₹8,02,000 వరకు ఉంది.

మారుతి సెలెరియో మైలేజ్ ఎంత?

పెట్రోల్ వాహనం లీటరుకు 25.24 kmpl నుంచి 26.68 kmpl మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ వేరియంట్ కిలోకు 34.43 km/kg మైలేజ్ అందిస్తుంది.

మారుతి సెలెరియో కారును ₹50,000 డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చా?

అవును, సిబిల్ స్కోర్ 750 పైన ఉంటే, ఆన్‌రోడ్ ధరలో 85-90% వరకు లోన్ పొందవచ్చు. ₹50,000 డౌన్‌పేమెంట్‌తో ₹5,10,000 లోన్ తీసుకోవచ్చు.

మారుతి సెలెరియోలో ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

ఇందులో 7 ఇంచ్‌ల స్మార్ట్ ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Toyota Glanza Facelift లుక్‌ అదిరిపోయింది.. కొత్త ఇంజిన్, ADAS ఫీచర్లు, CNG ఆటోమేటిక్ కూడా!
2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌.. ధర రూ.6.99 లక్షలే! కేవలం రూ.11,000తో బుక్‌ చేసుకోవచ్చు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
Advertisement

వీడియోలు

IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget