అన్వేషించండి

Maruti Brezza Hyderabad On Road Price:హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా కొంటే ఆన్‌రోడ్ ప్రైస్‌ ఎంత? నెలకు ఎంత EMI చెల్లించాలి?

హైదాబాద్‌లో మారుతి బ్రెజ్జా ప్రారంభ ఆన్‌రోడ్ ధ సుమారు 8.80 లక్షలు కాగా, టాప్ వేరియంట్‌ ధర 16. 85 లక్షల వరకు ఉంటుంది. 20 శాతం డౌన్‌పేమెంట్‌ కొనుగోలు చేస్తే నెలకు 14, 600 చెల్లించాలి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా ఆన్‌రోడ్ ధరలు 8.8 లక్షల నుండి.
  • బేస్ వేరియంట్‌కు 1.76 లక్షలు డౌన్‌పేమెంట్, 14,613 ఈఎమ్‌ఐ.
  • కొనుగోలుకు కనీసం 65 వేల నెలవారీ ఆదాయం ఉండాలని నిపుణుల సూచన.
  • ఆఫర్లు, డిస్కౌంట్లు వినియోగించుకొని కారు కొనుగోలు చేయాలి.

Maruti Brezza Hyderabad On Road Price:హైదరాబాద్‌లో రోడ్లపై సొంత కారు డ్రైవ్‌ చేయాలనే కోరిక ప్రతి ఉద్యోగికి, వ్యాపారవేత్త, మధ్యతరగతి వ్యక్తికి ఉంటుంది. కంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి సుజుకి బ్రెజ్జా ఎప్పటికప్పుడు భారతీయుల ఫేవరెట్‌ ఛాయిస్‌గా నిలుస్తోంది. అయితే షోరూమ్‌లో చూస్తే ఎక్స్‌షోరూమ్‌ ధర ఒకటైతే, మన చేతికి వచ్చేసరికి పడే ఆన్‌రోడ్‌ ప్రైస్‌ మరొకటి. హైదరాబాద్‌లో బ్రెజ్జా వేరియంట్ల అసలు ఆన్‌రోడ్‌ ధర ఎంత? నెలకు ఎంత ఈఎమ్‌ఐ పడుతుంది? మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా ఈ కారు సేఫ్‌గా కొనుగోలు చేయాలి అంటే మీ నెలవారీ శాలరీ లేదా ఆదాయం ఎంత ఉండాలి? 

హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా అన్‌రోడ్ ప్రైస్‌ 

హైదరాబాద్‌లో కారు కొనేటప్పుడు కేవలం ఎక్స్‌షోరూమ్‌ ధర చూసి బడ్జెట్‌ ఫిక్స్‌ చేసుకుంటే పొరపాటే. తెలంగాణ రాష్ట్రంలో లైఫ్‌ ట్యాక్స్‌, ఇన్సూరెన్స్‌, డిజిటల్‌ రిజిస్ట్రేషన్, టీడీఎస్‌, ఇతర ఫాస్టాగ్‌ ఫీజులు కలిపితే ఆన్‌రోడ్‌ ప్రైస్ గణనీయంగా మారుతుంది. 
ప్రస్తుతం మారుతి బ్రెజ్జా ఎక్స్‌-షోరూమ్‌ ధర 7.40 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్‌ వేరియంట్‌కు 13. 71లక్షల వరకు ఉంటుంది. కానీ మన హైదరాబాద్‌ పరిధిలో బేస్ వేరియంట‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర 7.40 లక్షలు కాగా తెలంగాణ ఆర్టీవో పన్నులు, ఇన్సూరెన్స్‌ కలిపి ఆన్‌రోడ్‌ ధర 8.80 లక్షల వరకు చేరుకుంటుంది. మిడ్‌ వేరియంట్ ఆన్‌రోడ్ ధర 10.95లక్షల నుంచి 11.80 లక్షల మధ్య ఉంటుంది. టాప్‌ ఎండ్ వేరియంట్‌ ఆన్‌రోడ్ రేటు 16.85 లక్షల నుంచి 17.04లక్షల వరకు ఉంటుంది. 

ఈఎంఐ, డౌన్‌పేమెంట్‌ వివరాలు ఇవే 

కారును పూర్తిగా క్యాష్‌తో కంటే 80 శాతం 90 వరకు బ్యాంక్‌లోన్‌ ద్వారా కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. సాధారణంగా బ్యాంకులు 8.5 నుంచి 9.5 శాతం వరకు వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి. బేస్‌ వేరియంట్‌ తీసుకుంటే డౌన్‌పేమెంట్‌ దాదాపు 1.76 లక్షలు చెల్లించాలి. అప్పుడు 7.04 లక్ష రూపాయల రుణం పొందవచ్చు. దీనికి వడ్డీ రేటు 9శాతం ఉంటే, ఐదేళ్ల కాలపరిమితికి తీసుకుంటే నెలు 14, 613 పడుతుంది. ఏడేళ్ల కాలపరిమితికి తీసుకుంటే 11, 310 రూపాయల ఈఎంఐ చెల్లించాలి. 

టాప్ వేరియంట్‌ లోన్‌పై తీసుకుంటే డౌన్‌పేమెంట్‌ 3.37 లక్షలు చెల్లించాలి.  మిగతా 13. 48 లక్షలు రుణం రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ 9 శాతం ఉంటే ఐదేళ్ల కాలపరిమితికి నెలకు 27, 980 చెల్లించాలి. ఏడేళ్ల టెన్యూర్‌కు నెలకు 21, 650 రూపాయలు కట్టాలి. 

నెలకు ఎంత ఆదాయం/శాలరీ వస్తే బ్రెజ్జా కొనడం మంచిది?

ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం కారు కొనుగోలు చేసేటప్పుడు 20/4/10 సూత్రాన్ని పాటించాలి. అంటే ఆన్‌రోడ్‌ ధరలో  20 శాతం డౌన్‌పేమెమంట్‌ చెల్లించాలి. దీనికి సొంత నిధులు ఉండాలి. నాలుగేళ్ల గడువు లోన్ క్లియర్ చేయించాలి. మీ నెలవారీ ఆదాయంలో కారు EMI వాటా 15శాతానికి మించకూడదు. పెట్రోల్/ సీఎన్జీ రన్నింగ్‌ ఖర్చులు, మెయింటెనెన్స్‌ కలిపినా మీ టెక్‌ హోమ్‌ శాలరీలో 20 శాతం లోపే ఉండాలి. 

ఈ లెక్కల ప్రకారం బేస్‌ వేరియంట్‌ కొనుగోలు చేయాలంటే మీకు కనీసం 65 వేల నుంచి 75వేల జీతం వస్తూ ఉండాలి. మిడ్ వేరియంట్‌ కొనుగోలు చేయాలంటే మీ నెల జీతం 90 వేల నుంచి లక్షా పదివేల వరకు ఉండాలి. టాప్ వేరియంట్‌ కొనుగోలు చేయాలంటే మీ నెల వారీ సంపాదన లక్షా 30 వేల నుంచి 1 లక్షా 50 వేల వరకు ఉండాలి.  

కారు అనేది డిప్రిషియేటింగ్ అసెట్‌. కాబట్టి షోరూమ్‌ లోన్ తీసుకునే ముందు మీ వద్ద ఉన్న పాత కారు ఎక్స్చేంజ్‌ బోనస్‌, పండుగ ఆఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లను క్లెయిమ్ చేయండి. 

Frequently Asked Questions

హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా ఆన్‌రోడ్ ధర ఎక్స్‌-షోరూమ్ ధర కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది?

తెలంగాణలో లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి అదనపు ఛార్జీలు ఉంటాయి. అందుకే ఎక్స్‌-షోరూమ్ ధర కంటే ఆన్‌రోడ్ ధర మారుతుంది.

హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా బేస్, మిడ్, టాప్ వేరియంట్ల ఆన్‌రోడ్ ధరలు ఎంత?

బేస్ వేరియంట్ ధర సుమారు 8.80 లక్షలు. మిడ్ వేరియంట్ 10.95 లక్షల నుంచి 11.80 లక్షల మధ్య ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర 16.85 లక్షల నుంచి 17.04 లక్షల వరకు ఉంటుంది.

మారుతి బ్రెజ్జా కొనుగోలు చేయడానికి నెలవారీ ఆదాయం ఎంత ఉండాలి?

బేస్ వేరియంట్ కోసం 65 వేల నుండి 75 వేలు, మిడ్ వేరియంట్ కోసం 90 వేల నుండి 1.10 లక్షలు ఉండాలి. టాప్ వేరియంట్ కొనుగోలు చేయాలంటే 1.30 లక్షల నుండి 1.50 లక్షల జీతం అవసరం.

బ్రెజ్జా బేస్ వేరియంట్ కోసం ఐదేళ్ల టెన్యూర్‌కు నెలవారీ ఈఎంఐ ఎంత ఉంటుంది?

బేస్ వేరియంట్‌కు 1.76 లక్షలు డౌన్‌పేమెంట్ చేసి, 7.04 లక్షల రుణం తీసుకుంటే, 9% వడ్డీతో ఐదేళ్లకు నెలకు 14,613 రూపాయల ఈఎంఐ వస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌ - మరికొన్ని రోజుల్లో రేట్లు పెంచబోతున్న హ్యుందాయ్‌
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Embed widget