అన్వేషించండి

Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?

Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ ఆన్‌రోడ్ ప్రారంభ ధర సుమారు 12.80 లక్షలుగా ఉండగా, టాప్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌ మోడ్‌ 24.16 లక్షల వరకు ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ ఎస్‌యూవీకి ప్రస్తుతం భారీ డిమాండ్.
  • 5-స్టార్ సేఫ్టీ, అడాస్‌, సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో విక్టోరిస్ పోటీనిస్తోంది.
  • హైదరాబాద్‌లో విక్టోరిస్‌ ఆన్‌రోడ్‌ ధర రూ.12.80 లక్షల నుంచి ప్రారంభం.
  • మోడల్‌ను బట్టి రూ.2 లక్షల డౌన్‌పేమెంట్‌తో ఈఎంఐలు మొదలవుతాయి.

Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి రోడ్ల నుంచి విజయవాడ నేషనల్‌ హైవే వరకు ప్రతి చోటా ఇప్పుడు కొత్త తరహా క్యాబిన్ కంఫర్ట్‌, పవర్‌- ప్యాక్డ్‌ మైలేజ్‌ ఇచ్చే కాంపాక్ట్‌ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ రేసులో మారుతి సుజుకి నుంచి మార్కెట్‌లోకి అడుగు పెట్టిన మారుతి విక్టోరిస్‌ కారు ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. స్టైలిష్‌ లుక్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, లెవల్‌-2 అడా్ వంటి హై ఎండ్‌ ఫీచర్స్‌తో వచ్చిన ఈ ఎస్‌యూవీ మిడ్‌ సైజ్ సెగ్మెంట్‌లోని హ్యుందాయ్‌ క్రెటా, టాటా సియోరా, టయోటా హైరైడర్‌ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. 

అయితే హైదరాబాద్‌లో కొత్త కారు కొనాలి అంటే షోరూమ్‌ ధర ఒకటే తెలుసుకుంటే సరిపోదు. అన్ని ట్యాక్స్‌లు కలిసి ఉన్న ఆన్‌రోడ్‌ ప్రైస్ తెలుసుకుంటే తప్ప మీరు ముందడుగు వేయలేరు. దీని ఆధారంగానే మీరు డౌన్‌పేమెంట్‌, ఈఎంఐ వివరాలపై స్పష్టమైన అభిప్రాయానికి వస్తారు. 

హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ ఆన్‌రోడ్ ప్రైస్

మారుతి విక్టోరిస్‌ భారత మార్కెట్‌లో 10,50 లక్షల ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధరతో లభిస్తుంది. దీని టాప్ ఎండ్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌ ధర 19.99 లక్షల వరకు ఉంటుంది. అయితే హైదరాబాద్‌లో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తెలంగాణ రవాణా శాఖ విధించే 12 శాతం నుంచి 14 శాతం ఆర్టీవో లైఫ్‌ ట్యాక్స్‌ కాంప్రెహెన్సివ్‌ ఇన్సూరెన్స్‌, టీసీస్‌, ఆప్షనల్‌ యాక్సెసరీస్‌ కలిపి ఆన్‌ రోడ్‌ ధర మారుతుంది. 

బేస్‌ వేరియంట్‌ ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ వేరియంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర 10.50 లక్షలు కాగా, హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర సుమారు 12.80 లక్షల వరక ఉంటుంది. మిడ్‌ వేరియంట్‌ వీఎక్స్‌ఐ, జీఎ్స్‌ఐ పెట్రోల్‌, సీఎన్జీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు 11.80 లక్షల నుంచి 14.57 లక్షల వరకు ఉంటాయి. హైదరాబాద్‌లో వీటి ఆన్‌రోడ్‌ ధర 14.36 లక్షల నుంచి 17.09 లక్షల పరిధిలో ఉంటుంది. టాప్‌ వేరియంట్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఏడబ్ల్యూడీ వెహికల్స్‌ ఎక్స్‌షోరూమ్‌ ధరలు 16.38 లక్షల నుంచి 19.99 లక్షల వరకు ఉండగా, భాగ్యనగరంలో వీటి ఆన్‌రోడ్‌ ధర 19.84 లక్షల నుంచి 24.16 లక్షల వరకు ఉంటుంది. 

బేస్‌ వేరియంట్‌ ఎల్‌ఎక్స్‌ఐ మాన్యువల్‌ డౌన్‌పేమెంట్‌-ఈఎంఐ లెక్కలు

మారుతి విక్టోరిస్‌ ఎల్‌ఎక్స్‌ఐ 1.5ఎల్‌ పెట్రోల్‌ మాన్యువల్‌ వేరియంట్‌ తక్కువ బడ్జెట్‌లో ఎస్‌యూవీ అనుభూతిని పొందాలనుకునే వారికి మంచి ఎంపిక. హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ధర 12, 80,000. మినిమమ్‌ డౌన్‌పేమెంట్‌  రెండు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీరు 10, 80,000 రూపాయలు బ్యాంక్‌లోను తీసుకోవచ్చు. దీనికి వడ్డీ దాదాపు 9 శాతం ఉంటుంది. ఈ వడ్డీ బ్యాంకులు, మీ సిబిల్ స్కోరును బట్టి మారుతుంది. ఈ లెక్క ప్రకారం ఏ నెల ఎంత ఈఎంఐ చెల్లించాలో చూద్దాం. 

ఈ మొత్తాన్ని మూడేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే నెలకు 34,350 రూపాయలు చెల్లించాలి. ఇలా చెల్లిస్తే మీరు మొత్తంగా 1, 56, 600 రూపాయలు వడ్డీ చెల్లించాలి. అదే మొత్తాన్ని ఐదేళ్ల కాలపరిమితికి తీసుకుంటే నెలకు 22, 420 రూపాయలు కట్టాలి. అదే ఏడేళ్లకు తీసుకుంట్ నెలకు 17, 360 రూపాయల ఈఎంఐ చెల్లించాలి.

మిడ్‌ వేరియంట్స్‌ అయిన వీఎక్స్‌ఐ &జీఎక్స్‌ఐ సిటీ డ్రైవింగ్ కోసం ఆటోమేటిక్‌ లేదా తక్కువ రన్నింగ్ కాస్ట్ కోరుకునే వారికి సీఎన్జీ వేరియంట్‌ చాలా యూజ్ అవుతుంది. హైదరాబాద్‌లో దీని ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 14, 36,000 రూపాయలు. దీనికి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు డౌన్‌పేమెంట్ చెల్లించాలి. 9 శాతం వడ్డీతో మిగతా 11, 86, 000 రూపాయలను బ్యాంక్ లోన్‌గా ఐదేళ్లు తీసుకుంటే నెలు 24, 620 రూపాయలు చెల్లించాలి. అదే ఏడేళ్లకు తీసుకుంటే 19,060 రూపాయలు చెల్లించాలి. 

మారుతి విక్టోరిస్ సీఎన్జీ వేరియంట్‌ వీఎక్స్‌ఐ సీఎన్జీలో అండర్ బాడీ ట్యాంక్‌ టెక్నాలజీ వల్ల బూట్‌ స్పేస్ ఏ మాత్రం తగ్గదు. దీని ఆన్‌రోడ్‌ ధర 15, 56,000 రూపాయలు. దీనికి రెండున్నర లక్షల రూపాయలను డౌన్‌ పేమెంట్ చెల్లించాలి. మిగతా 13 లక్షల రూపాయలకు పైగా నగదును 9 శాతానికి బ్యాంకు లోనుగా తీసుకోవాలి. 5 ఏళ్లకు తీసుకుంటే నెలకు 27, 110 రూపాయలు, ఏడేళ్లకు తీసుకుంటే నెలకు 20, 990 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

టాప్ వేరియంట్ తీసుకుంటే పనోరమిక్‌ సన్‌రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్‌ సీట్లు, లెవెల్‌ -2 అడాస్‌ సెక్యూరిటీ, 28.65kmpl మైలేజ్‌ ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌లోని జీఎక్స్ఐ ప్లస్‌ స్ట్రాంగ్ హైబ్రిడ్‌ ఆన్‌రోడ్ ధర 23,53,000 రూపాయలు. దీని కోసం మూడున్నర లక్షలు డౌన్‌పేమెంట్ చెల్లించాలి. మిగతా ఇరవై లక్షలను 9 శాతం వడ్డీకి బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు లోన్‌ను ఐదేళ్లకు తీసుకుంటే నెలకు 41, 580 రూపాయలు చెల్లించాలి. ఏడేళ్లకు తీసుకుంటే 32, 200రూపాయలు చెల్లించాలి. 

Frequently Asked Questions

మారుతి విక్టోరిస్ కారు యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

ఇది స్టైలిష్ లుక్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్‌ మరియు లెవల్‌-2 అడా్ వంటి హై-ఎండ్ ఫీచర్లతో వస్తుంది. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మంచి క్యాబిన్ కంఫర్ట్ మరియు మైలేజీని అందిస్తుంది.

హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్ ఆన్‌రోడ్ ధర ఎంత?

హైదరాబాద్‌లో బేస్ వేరియంట్ ఆన్‌రోడ్ ధర సుమారు 12.80 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ బలమైన హైబ్రిడ్ మోడల్ ధర 24.16 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

మారుతి విక్టోరిస్ ఆన్‌రోడ్ ధరను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?

వాహనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తెలంగాణ రవాణా శాఖ విధించే ఆర్టీవో లైఫ్ ట్యాక్స్ (12-14%), కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్, టీసీఎస్, మరియు ఆప్షనల్ యాక్సెసరీస్ ధరను మారుస్తాయి.

మారుతి విక్టోరిస్ బేస్ వేరియంట్‌కు హైదరాబాద్‌లో కనిష్ట డౌన్‌పేమెంట్ ఎంత?

బేస్ వేరియంట్ ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ మాన్యువల్‌కు హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర 12.80 లక్షలు. దీనికి కనిష్టంగా రెండు లక్షల రూపాయలు డౌన్‌పేమెంట్‌గా చెల్లించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget