అన్వేషించండి

Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్లు.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే కొనాలనిపించాల్సిందే!

మహీంద్ర స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌కు ముందే పూర్తిగా లీకైంది. కొత్త 10.25 అంగుళాల స్క్రీన్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్‌, కొత్త అల్లాయ్‌ వీల్స్‌తో పాటు పాత ఇంజిన్‌ ఎంపికలను కొనసాగించే అవకాశం ఉంది.

2026 Mahindra Scorpio N Price And Features Telugu: మహీంద్ర తన అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటైన స్కార్పియో Nకు త్వరలో ఫేస్‌లిఫ్ట్‌ అప్‌డేట్‌ను తీసుకురానుంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ SUV పూర్తిగా లీక్‌ కావడంతో కొత్త మోడల్‌లో వచ్చే మార్పులు మార్కెట్‌కు ముందే తెలిసిపోయాయి. బయట డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసినప్పటికీ, లోపలి క్యాబిన్‌లో మాత్రం పలు కొత్త ఫీచర్లను జోడించినట్లు స్పై ఫొటోలు వెల్లడిస్తున్నాయి. వచ్చే నెలలో ఈ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ను మహీంద్ర అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.

బాహ్య రూపం
బయటి డిజైన్‌ను పరిశీలిస్తే, ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న స్కార్పియో Nతో పోలిస్తే పెద్దగా మార్పులు కనిపించవు. కొత్త డిజైన్‌తో అల్లాయ్‌ వీల్స్‌ను అందించడం ప్రధాన మార్పుగా నిలిచింది. ఇవి ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే మరింత ఆధునికంగా కనిపిస్తున్నాయి. ముందు భాగంలో గ్రిల్‌, LED హెడ్‌ల్యాంప్స్‌, స్కార్పియన్‌ తోక ఆకారంలో ఉండే ఫాగ్‌ ల్యాంప్స్‌, బంపర్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. వెనుక భాగంలో కూడా LED టెయిల్‌ ల్యాంప్స్‌, బంపర్‌ డిజైన్‌, కిటికీల చుట్టూ క్రోమ్‌ బీడింగ్‌, సిల్వర్‌ రూఫ్‌ రైల్స్‌, డోర్‌ హ్యాండిల్స్‌పై క్రోమ్‌ స్ట్రిప్స్‌, వీల్‌ ఆర్చ్‌లపై బ్లాక్‌ క్లాడింగ్‌ యథాతథంగానే కొనసాగుతున్నాయి.

అంతర్గత డిజైన్‌
క్యాబిన్‌లో మాత్రం గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రౌన్‌ & బ్లాక్‌ డ్యూయల్‌ టోన్‌ థీమ్‌ను కొనసాగించిన మహీంద్ర, థార్‌ రాక్స్‌ను పోలిన ఫ్రీ స్టాండింగ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ను అందించింది. అలాగే పూర్తిగా డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లేను కూడా జోడించింది. థార్‌ రాక్స్‌లో ఈ రెండు స్క్రీన్ల పరిమాణం 10.25 అంగుళాలు ఉండగా, స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో కూడా అదే పరిమాణం ఉండే అవకాశం ఉంది. సెంటర్‌ AC వెంట్స్‌ను ఇప్పుడు టచ్‌స్క్రీన్‌కు కింద అమర్చారు. సెంటర్‌ కన్సోల్‌పై స్విచ్‌ల డిజైన్‌ను కూడా కొత్తగా రూపొందించారు.

ఇది కూడా చదవండి: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు

ఫీచర్లు
ఫీచర్ల పరంగా కూడా ఈ SUV మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. తొలిసారిగా పానోరమిక్‌ సన్‌రూఫ్‌ను అందించే అవకాశముందని సమాచారం. అలాగే వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 12 స్పీకర్‌ Sony ఆడియో సిస్టమ్‌, పవర్డ్‌ డ్రైవర్‌ సీట్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు వంటి ఫీచర్లు కొనసాగనున్నాయి. దీంతో ప్రయాణికులకు మరింత ప్రీమియం అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది మహీంద్ర.

ఇంజిన్‌ ఎంపికల్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 203 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తూ 6 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉండనుంది. మాన్యువల్‌తో 370 ఎన్‌ఎం & ఆటోమేటిక్‌తో 380 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ కూడా కొనసాగనుంది. లోయర్‌ వేరియంట్లలో 132 హెచ్‌పీ శక్తి & 300 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తే, హయ్యర్‌ వేరియంట్లలో 175 హెచ్‌పీ శక్తి లభిస్తుంది. మాన్యువల్‌తో 370 ఎన్‌ఎం & ఆటోమేటిక్‌తో 400 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్‌ ఇంజిన్‌తో 4x4 ఎంపిక కూడా అందుబాటులోనే ఉండనుంది. ఇందులో లో రేంజ్‌ ట్రాన్స్‌ఫర్‌ కేస్‌ను కూడా కొనసాగించనున్నారు.

ఇది కూడా చదవండి: కొత్త బ్రెజ్జాలో అదిరిపోయే 6 మార్పులు - టర్బో పవర్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, 5 స్టార్‌ రేటింగ్‌తో మరింత బలంగా మారుతి SUV

ధరలు
ప్రస్తుతం మహీంద్ర స్కార్పియో N ధరలు రూ.13.49 లక్షల నుంచి రూ.24.95 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) వరకు ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్‌ అప్‌డేట్‌తో ధరల్లో స్వల్ప పెరుగుదల ఉండే అవకాశం ఉంది. విడుదల అనంతరం ఈ SUV Mahindra XUV 7XO, Hyundai Alcazar, Tata Safari & MG Hector కు గట్టి పోటీ ఇవ్వనుంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
బజాజ్ చేతక్ EVని ఇంటికి తెచ్చుకోవడానికి లోన్‌ ఫెసిలిటీ.. కనీస డౌన్‌పేమెంట్‌, EMI పూర్తి వివరాలు
Bajaj Chetak C2501 ఎలక్ట్రిక్ స్కూటర్‌.. నెలకు కేవలం రూ.1500 EMIతో మీ సొంతం!
చలికాలంలో కారు తీసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ 5 యాక్సెసరీస్ ఉంటే టెన్షన్ ఉండదు!
ఈ చలికాలంలో కారు డ్రైవింగ్ సేఫ్‌గా సాగాలంటే.. ఈ 5 యాక్సెసరీస్ తప్పనిసరి!
గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget