అన్వేషించండి

Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్

హోండా ADV160 రాకతో ప్రీమియం మాక్సీ స్కూటర్ విభాగంలో పోటీ మరింత పెరిగింది. ADV160, హీరో Xoom 160 & యమహా Aerox 155 ఇంజిన్, ఫీచర్లు, పనితీరు, బరువు & బ్రేకింగ్ పరంగా పూర్తి పోలిక ఇదే.

Honda ADV160 Price And Features Telugu: భారత ప్రీమియం మాక్సీ స్కూటర్ మార్కెట్‌లో ఇప్పటికే హీరో Xoom 160, యమహా Aerox 155 మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు హోండా కూడా ADV160 మోడల్‌ను ఆవిష్కరించింది. అడ్వెంచర్ స్టైల్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ & అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ స్కూటర్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. అంతేకాదు, భారత్‌లో తొలిసారిగా E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో వస్తున్న స్కూటర్‌గా కూడా ADV160 ప్రత్యేకతను సొంతం చేసుకుంది.

ఇంజిన్ 
హోండా ADV160లో 157cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 16.3 hp శక్తి & 14.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హీరో Xoom 160లోని 156cc ఇంజిన్ 14.9 hp శక్తి & 14 Nm టార్క్‌ను అందిస్తే, యమహా Aerox 155లోని 155cc ఇంజిన్ 15 hp శక్తి & 13.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే శక్తి & టార్క్ పరంగా ADV160నే అగ్రస్థానంలో నిలిచింది.

పవర్ టు వెయిట్ రేషియోలో కూడా ADV160దే పైచేయి. ఇది టన్నుకు 122.6 hp అందిస్తుండగా, Aerox 155 టన్నుకు 119 hpతో రెండో స్థానంలో ఉంది. హీరో Xoom 160 టన్నుకు 104.9 hpతో మూడో స్థానంలో నిలిచింది. దీనికి ప్రధాన కారణం దాని బరువు ఎక్కువగా ఉండటమే.

ఇది కూడా చదవండి: హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ

బరువు & పరిమాణాల విషయానికి వస్తే, Aerox 155 కేవలం 126 కిలోల బరువుతో ఈ పోలికలో అత్యంత తేలికైన స్కూటర్. ADV160 బరువు 133 కిలోలు కాగా, హీరో Xoom 160 142 కిలోలతో అత్యంత బరువైన మోడల్‌గా ఉంది. వీల్‌బేస్ పరంగా Aerox 155కు 1350 మి.మీ.తో స్వల్ప ఆధిక్యం ఉంది. అయితే సీటు ఎత్తు పరంగా ADV160లో 780 మి.మీ. ఉండటంతో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది.

ఇంధన ట్యాంక్ సామర్థ్యంలో కూడా హోండా స్కూటర్ ముందంజలో ఉంది. ADV160లో 8 లీటర్ల ట్యాంక్ ఉండగా, హీరో Xoom 160లో 7 లీటర్లు, Aerox 155లో 5.5 లీటర్ల ట్యాంక్ మాత్రమే ఉంది. దీంతో ఒకసారి ట్యాంక్ నింపితే ADV160 ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది.

బ్రేకింగ్ & సస్పెన్షన్ 
ఈ మూడు స్కూటర్లలోనూ టెలిస్కోపిక్ ముందు సస్పెన్షన్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్లు & సింగిల్ ఛానల్ ABS అందిస్తున్నారు. ADV160 & Xoom 160లో 240 మి.మీ. ముందు డిస్క్ బ్రేక్ ఉండగా, Aerox 155లో 230 మి.మీ. డిస్క్ బ్రేక్ ఉంది. హీరో Xoom 160లో ముందు టైర్ వెడల్పుగా ఉండగా, Aerox 155లో వెనుక టైర్ మరింత వెడల్పుగా ఉంటుంది. ADV160 మాత్రం ముందు 14 అంగుళాల చక్రం & వెనుక 13 అంగుళాల చక్రంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: Nissan Tekton కొనాలా, వద్దా? పూర్తి విశ్లేషణ - కొనడానికి 3 కారణాలు, దూరంగా ఉండడానికి 3 కారణాలు

ఫీచర్లు 
ఈ విషయంలోనూ ADV160 స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఈ మూడింటిలో అత్యధికంగా లభిస్తుంది.

మరోవైపు హీరో Xoom 160 & యమహా Aerox 155లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, కీ లెస్ ఇగ్నిషన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇవి TFT బదులుగా LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఉపయోగిస్తున్నాయి. ట్రాక్షన్ కంట్రోల్ మాత్రం Aerox 155లో ఉంది. హీరో Xoom 160 అడ్వెంచర్ స్టైల్ డిజైన్‌తో ప్రత్యేక గుర్తింపును పొందుతోంది.

మొత్తంగా (పేపర్‌పై) చూసుకుంటే.. హోండా ADV160 శక్తివంతమైన ఇంజిన్, అత్యుత్తమ పవర్ టు వెయిట్ రేషియో, పెద్ద ఇంధన ట్యాంక్, అధునాతన ఫీచర్లు & ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో పూర్తి ప్యాకేజీగా కనిపిస్తోంది. అయితే Aerox 155 తక్కువ బరువు కారణంగా స్పోర్టీ రైడింగ్ అనుభూతిని అందిస్తే, హీరో Xoom 160 అడ్వెంచర్ స్టైల్ & బలమైన రోడ్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఎంపికగా నిలుస్తోంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
హోండా ADV160 vs హీరో Xoom 160 vs యమహా Aerox 155 - యూత్‌కి తగిన స్కూటర్‌ ఏది?
జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
యువతకు కవాసాకి బంపర్ గిఫ్ట్.. Z900 కొంటే ఇవి కూడా 'ఫ్రీ'గా మీ సొంతం!
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget