అన్వేషించండి

Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్

Road Safety Tips | బండి నడిపేటప్పుడు చేసే చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. బ్రేకులు, టైర్లు, డ్రైవర్ అలసట, అతివేగం, ABS, TPMS వంటి అంశాలపై నిపుణులు చెప్పిన కీలక సేఫ్టీ సూచనలు తెలుసుకోండి.

Driving safety tips Telugu: కారైనా, బైక్‌ అయినా, స్కూటర్‌ అయినా.. అది ఎంత ఖరీదైనదైనా.. అందులో ఎన్ని హైటెక్ ఫీచర్లు ఉన్నా.. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం జరగడానికి రెప్పపాటు కాలం చాలు. చాలామంది స్పీడ్ పెంచడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు కానీ, అదే బండిలో ఉన్న సేఫ్టీ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మాత్రం సమయం కేటాయించరు. ఇదే చాలా ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.

మన మెదడు క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉన్నా, గంటకు 100 కి.మీ. వేగంతో వెళ్తున్న వాహనాన్ని అదుపు చేయాలంటే ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితి వచ్చిన తర్వాత స్పందించే లోపే చాలా ఆలస్యం అయిపోతుంది. అందుకే వాహనం పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడం చాలా ముఖ్యం.

ప్రమాదాలను నివారించే సింపుల్‌ టిప్స్‌

బ్రేక్ వేస్తే కిర్రుమనే శబ్దం వస్తుందా? బ్రేక్ వేసినప్పుడు వాహనం ఒకవైపుకు లాగుతుందా? అయితే బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయి ఉండొచ్చు లేదా బ్రేక్ ఆయిల్ సమస్య ఉండొచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సర్వీస్ సెంటర్‌కు వెళ్లి తనిఖీ చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే బ్రేకింగ్ సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి.

లాంగ్ డ్రైవ్‌లలో చాలామందిని వేధించే మరో సమస్య డ్రైవర్ అలసట. వరుసగా ఆవలింతలు రావడం, కళ్లపాపలు భారంగా అనిపించడం మైక్రో స్లీప్‌కు సంకేతాలు. ఒకట్రెండు సెకన్లపాటు కళ్లు మూసుకుపోయినా భారీ ప్రమాదం జరగొచ్చు. ముఖ్యంగా వేకువజామున ప్రయాణించే సమయంలో మధ్యలో ఆగి నీళ్లు తాగడం, ముఖం కడుక్కోవడం లేదా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి.

ఇది కూడా చదవండి: కొత్త బ్రెజ్జాలో అదిరిపోయే 6 మార్పులు - టర్బో పవర్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, 5 స్టార్‌ రేటింగ్‌తో మరింత బలంగా మారుతి SUV

టైర్ల పరిస్థితిని కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గాలి తక్కువగా ఉంటే వాహనం సరిగ్గా వేగం అందుకోదు. ఇంజిన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది. అన్ని టైర్లలో సమాన గాలి లేకపోతే వాహనం ఒక వైపుకు లాగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా బ్రేక్ వేయకుండా యాక్సిలరేటర్‌ను వదిలి వాహనం వేగం సహజంగా తగ్గేలా చేయాలి.

మరో పెద్ద సమస్య అతి వేగం & అతి బరువు. వాహనం మోయగల సామర్థ్యాన్ని మించి సామగ్రి ఎక్కిస్తే షాక్ అబ్జార్బర్లు కుంగిపోతాయి. ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో అధిక వేగంతో వెళ్తే వాహనం వైబ్రేట్ అవుతుంది. స్పీడోమీటర్‌పై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచి రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించడం ఉత్తమ మార్గం.

స్టీరింగ్ అకస్మాత్తుగా వణకడం లేదా ఒకే వైపుకు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని చిన్న సమస్యగా తీసుకోవద్దు. అలాంటి సమయంలో స్టీరింగ్‌ను బలంగా తిప్పే ప్రయత్నం చేయకుండా గట్టిగా పట్టుకుని నెమ్మదిగా వాహనాన్ని రోడ్డు పక్కకు తీసుకెళ్లాలి. తర్వాత మాత్రమే సమస్య ఏంటో పరిశీలించాలి.

ఇది కూడా చదవండి: XP100, Power100, Speed100పై కేంద్రం కీలక ప్రకటన - E20ని మించిన ఇంధనంపైనా క్లారిటీ

ఈ రోజుల్లో కార్లలో TPMS, ABS, Vehicle Dynamic Control వంటి ఆధునిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి ఎలా పనిచేస్తాయో చాలామందికి తెలియదు. టైర్‌లో గాలి తగ్గితే TPMS వార్నింగ్ లైట్ వెంటనే వెలుగుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ABS ఉన్న వాహనాల్లో అత్యవసర పరిస్థితుల్లో బ్రేక్‌ను సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల వాహనం స్కిడ్ కాకుండా నియంత్రణలో ఉండే అవకాశం పెరుగుతుంది.

హైవేలపై ఎక్కువసేపు ఒకే వేగంతో ప్రయాణించిన తర్వాత సాధారణ రోడ్లపైకి వచ్చినప్పుడు కొంతమంది డ్రైవర్లు రోడ్డుపై పూర్తి దృష్టి పెట్టలేకపోతారు. ఈ పరిస్థితిని నిపుణులు హిప్నాసిస్ ఎఫెక్ట్‌గా చెబుతున్నారు. అందుకే హైవే నుంచి బయటకు వచ్చిన వెంటనే వేగాన్ని తగ్గించి పరిసరాలపై పూర్తి దృష్టి పెట్టాలి.

ప్రమాదాలను పూర్తిగా ఆపడం ఎవరి చేతిలో ఉండకపోయినా, చిన్న జాగ్రత్తలు మాత్రం పెద్ద ప్రమాదాలను తప్పించగలవు. స్పీడ్ కంటే సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వడం, వాహనాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయించడం & ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై అవగాహన పెంచుకోవడం ప్రతి డ్రైవర్ బాధ్యత. రోడ్డుపై నిజమైన హీరో అంటే వేగంగా వెళ్లేవాడు కాదు.. సురక్షితంగా గమ్యానికి చేరుకునేవాడే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

వాహనంలోని భద్రతా ఫీచర్లను ఎందుకు తెలుసుకోవాలి?

ప్రమాదాలను నివారించడానికి సేఫ్టీ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం ముఖ్యం. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే, ఎన్ని హైటెక్ ఫీచర్లు ఉన్నా ప్రమాదం జరగవచ్చు.

వాహన బ్రేకుల్లో సమస్య ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

బ్రేక్ వేసినప్పుడు కిర్రుమనే శబ్దం వస్తే, లేదా వాహనం ఒకవైపుకు లాగితే బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయి ఉండవచ్చు లేదా బ్రేక్ ఆయిల్ సమస్య ఉండవచ్చు. వెంటనే తనిఖీ చేయించాలి.

డ్రైవర్ అలసట సంకేతాలు ఏమిటి?

వరుసగా ఆవలింతలు రావడం, కళ్లపాపలు భారంగా అనిపించడం డ్రైవర్ అలసటకు, మైక్రో స్లీప్‌కు సంకేతాలు. ఇలాంటి సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం.

వాహన టైర్ల పరిస్థితి ఎందుకు ముఖ్యం?

టైర్లలో గాలి తక్కువగా ఉంటే వాహనం సరిగ్గా వేగం అందుకోదు, ఇంజిన్‌పై ఒత్తిడి పడుతుంది. టైర్లలో గాలి సమానంగా లేకపోతే వాహనం ఒకవైపుకు లాగవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget