అన్వేషించండి

కొత్త బ్రెజ్జాలో అదిరిపోయే 6 మార్పులు - టర్బో పవర్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, 5 స్టార్‌ రేటింగ్‌తో మరింత బలంగా మారుతి SUV

2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌, పెద్ద టచ్‌స్క్రీన్‌, 5 స్టార్‌ భారత్‌ NCAP రేటింగ్‌తో వచ్చిన అన్ని కీలక మార్పులను తెలుసుకోండి.

2026 Maruti Brezza Price And Features Telugu: భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్‌ SUVల్లో ఒకటైన 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఇప్పటికే ఈ విభాగంలో గట్టి పోటీ ఉండటంతో, కొత్త మోడల్‌లో పనితీరు, సౌకర్యం, సాంకేతికత & భద్రత పరంగా పలు కీలక అప్‌డేట్‌లను తీసుకొచ్చింది. ముఖ్యంగా విక్టోరిస్‌ నుంచి కొన్ని ప్రీమియం ఫీచర్లను తీసుకురావడంతో పాటు, ఫ్రాంక్స్‌లో ఉన్న టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను కూడా బ్రెజ్జాకు అందించింది. దీంతో కొత్త బ్రెజ్జా మరింత శక్తివంతమైన & ఆధునిక SUVగా మారింది.

ముఖ్యమైన మార్పులు

ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత పెద్ద మార్పు 1.0 లీటర్‌, 3 సిలిండర్‌ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ అందుబాటులోకి రావడం. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 110 హెచ్‌పీ శక్తి & 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్‌ ఫ్రాంక్స్‌లో ఉన్నప్పటికీ, అక్కడ 100 హెచ్‌పీ & 147.6 ఎన్ఎం టార్క్‌కే ట్యూన్‌ చేశారు. దీంతో బ్రెజ్జాలో మరింత మెరుగైన పనితీరు లభించనుంది.

ఇంజిన్‌తో పాటు ట్రాన్స్‌మిషన్‌లో కూడా కీలక మార్పు చేసింది మారుతి. టర్బో పెట్రోల్‌ వెర్షన్‌కు 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను జత చేసింది. అంతేకాదు, 1.5 లీటర్‌ సహజ శ్వాస పెట్రోల్‌ & CNG వెర్షన్‌లలో కూడా గతంలో ఉన్న 5-స్పీడ్‌కు బదులుగా ఇప్పుడు 6-స్పీడ్‌ మాన్యువల్‌ను స్టాండర్డ్‌గా అందిస్తోంది. దీని వల్ల హైవే ప్రయాణాల్లో ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గి, డ్రైవింగ్‌ అనుభవం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

CNG వెర్షన్‌ను ఎంచుకునే వినియోగదారులకు కూడా ఈసారి ఉపయోగకరమైన మార్పు చేసింది. సంప్రదాయంగా డిక్కీలో ఉండే CNG సిలిండర్‌కు బదులుగా వాహనం అడుగు భాగంలో CNG ట్యాంక్‌ను అమర్చింది. దీంతో, ట్రంక్‌లో సామాను పెట్టుకునేందుకు ఎక్కువ స్థలం లభిస్తుంది. అయితే ఈ మార్పు కారణంగా అన్ని వెర్షన్‌లలో స్పేర్‌ వీల్‌ను తొలగించింది. దానికి బదులుగా పంక్చర్‌ రిపేర్‌ కిట్‌ను అందిస్తోంది.

ఇది కూడా చదవండి: హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ

ఇంటీరియర్‌లో కూడా బ్రెజ్జా మరింత ప్రీమియంగా కనిపించేలా అప్‌డేట్‌ చేసింది. గతంలో ఉన్న 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌కు బదులుగా ఇప్పుడు విక్టోరిస్‌లో ఉన్నట్లే 10.1 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్‌ను కొత్త UI/UXతో అందించింది. అయితే 4 స్పీకర్లు & 2 ట్వీటర్ల ఆడియో వ్యవస్థను యథాతథంగా కొనసాగించింది.

వినియోగదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫ్రంట్‌ వెంటిలేటెడ్‌ సీట్లను కూడా చివరకు మారుతి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే హ్యుందాయ్‌ వెన్యూ, టాటా నెక్సాన్‌, స్కోడా కైలాక్‌, కియా సైరోస్‌ వంటి ప్రత్యర్థి మోడళ్లలో ఈ ఫీచర్‌ ఉండగా, బ్రెజ్జాలో మాత్రం ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు డ్రైవర్‌ & ముందు ప్రయాణికుడికి మరింత సౌకర్యం లభించనుంది. అలాగే కొత్త అంబియంట్‌ లైట్‌ రంగులు & లెదరెట్‌ సీట్లను కూడా జోడించింది.

ఇది కూడా చదవండి: 3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!

భద్రత పరంగా కూడా బ్రెజ్జాను మరింత బలోపేతం చేసింది. బ్లైండ్‌ స్పాట్‌ వార్నింగ్‌ సిస్టమ్‌, టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు & రియర్‌ క్రాస్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌ వంటి ఆధునిక ఫీచర్లను అందించింది. అయితే పూర్తి స్థాయి ADAS సూట్‌ను మాత్రం ఇంకా అందించలేదు.

ఈ అన్ని అప్‌డేట్‌లకు తోడు 2026 మారుతి బ్రెజ్జా భారత్‌ NCAP క్రాష్‌ పరీక్షల్లో పూర్తి 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. గత ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌కు భారత్‌ NCAP పరీక్షలు జరగలేదు. అయితే అంతకుముందు తరం బ్రెజ్జా గ్లోబల్‌ NCAPలో 4 స్టార్‌ రేటింగ్‌ను పొందింది. ప్రస్తుతం కూడా ఇదే గ్లోబల్‌-C ప్లాట్‌ఫామ్‌పై నిర్మించినప్పటికీ, దీనిని ఇప్పుడు మారుతి TECT ప్లాట్‌ఫామ్‌గా పేర్కొంటోంది. కొత్త ఫీచర్లు, శక్తివంతమైన టర్బో ఇంజిన్‌, మెరుగైన సేఫ్టీ & అధునాతన సౌకర్యాలతో 2026 బ్రెజ్జా కాంపాక్ట్‌ SUV విభాగంలో తన పోటీని మరింత బలపరిచేలా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget