అన్వేషించండి

526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?

ధరలు, బ్యాటరీ, రేంజ్‌, పనితీరు & ఫీచర్లను పోల్చితే Kia Syros EV అత్యధిక రేంజ్‌తో ముందంజలో నిలిచింది. అయితే ధర పరంగా Nexon EV అత్యంత అందుబాటులో ఉంది.

Kia Syros EV vs Nexon EV vs XUV 3XO EV: కియా కంపెనీ, తన అత్యంత చిన్న ఎలక్ట్రిక్‌ SUV అయిన Syros EV ని ఇటీవలే లాంచ్‌ చేసింది. ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.13.50 లక్షలుగా నిర్ణయించిన ఈ మోడల్‌ నేరుగా Tata Nexon EV & Mahindra XUV 3XO EVలకు సవాల్‌ విసురుతోంది. పరిమాణం, బ్యాటరీ, రేంజ్‌, పనితీరు, ఛార్జింగ్‌ & ధరల పరంగా ఈ మూడు SUVల మధ్య ఉన్న తేడాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పరిమాణం

 
కియా సైరోస్ EV
టాటా నెక్సాన్ EV
మహీంద్రా XUV 3XO EV
పొడవు
 
3,995mm
3,995mm
3,990mm
వెడల్పు
 
1,805mm
1,802mm
1,821mm
ఎత్తు
 
1,670mm
1,625mm
1,653mm
వీల్‌బేస్
 
2,550mm
2,498mm
2,600mm
గ్రౌండ్ క్లియరెన్స్
 
-
190-205mm
190mm
బూట్ స్పేస్
 
-
350 litres
364 litres

Kia Syros EV & Tata Nexon EV రెండింటి పొడవు 3,995 మిల్లీమీటర్లు కాగా, Mahindra XUV 3XO EV పొడవు 3,990 మిల్లీమీటర్లు. వెడల్పులో XUV 3XO EV 1,821 మిల్లీమీటర్లతో ముందుంది. Syros EV వెడల్పు 1,805 మిల్లీమీటర్లు కాగా, Nexon EV వెడల్పు 1,802 మిల్లీమీటర్లు. ఎత్తులో మాత్రం Syros EV 1,670 మిల్లీమీటర్లతో ఈ మూడు SUVల్లోనే అత్యధికంగా ఉంది. వీల్‌బేస్‌ పరంగా XUV 3XO EV 2,600 మిల్లీమీటర్లతో అగ్రస్థానంలో ఉండగా, Syros EVకు 2,550 మిల్లీమీటర్లు & Nexon EVకు 2,498 మిల్లీమీటర్ల వీల్‌బేస్‌ ఉంది. Syros EV గ్రౌండ్‌ క్లియరెన్స్‌ & బూట్‌ స్పేస్‌ వివరాలను Kia ఇంకా వెల్లడించలేదు.

బ్యాటరీ & పనితీరు 
Kia Syros EV రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. 42kWh & 51.4kWh బ్యాటరీలను కంపెనీ అందిస్తోంది. Tata Nexon EVలో 30kWh & 45kWh బ్యాటరీలు ఉండగా, Mahindra XUV 3XO EVలో ఒక్క 39.4kWh బ్యాటరీ మాత్రమే లభిస్తుంది. Syros EVలోని 51.4kWh బ్యాటరీ ఈ విభాగంలోనే అతిపెద్దది కావడం విశేషం.

ఇది కూడా చదవండి: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే!

రేంజ్‌ 
ఈ విషయంలో కూడా Kia Syros EV ఆధిపత్యం చాటుతోంది. 42kWh బ్యాటరీతో 443 కిలోమీటర్ల ARAI రేంజ్‌ లభిస్తుండగా, 51.4kWh బ్యాటరీతో ఏకంగా 526 కిలోమీటర్ల రేంజ్‌ను కంపెనీ ప్రకటించింది. Tata Nexon EVలో 30kWh బ్యాటరీతో 275 కిలోమీటర్లు & 45kWh బ్యాటరీతో 489 కిలోమీటర్ల రేంజ్‌ లభిస్తుంది. Mahindra XUV 3XO EV ఒక్కసారి ఛార్జ్‌తో 351 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అంటే టాప్‌ వేరియంట్‌లో Syros EV, Nexon EV కంటే 37 కిలోమీటర్లు & XUV 3XO EV కంటే 175 కిలోమీటర్లు ఎక్కువ రేంజ్‌ను అందిస్తోంది.

పెర్ఫార్మెన్స్‌
పనితీరు పరంగా కూడా Syros EV ఆకట్టుకుంటోంది. చిన్న బ్యాటరీ వేరియంట్‌ 135 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయగా, పెద్ద బ్యాటరీ వేరియంట్‌ 171 హెచ్‌పీ శక్తిని అందిస్తుంది. Nexon EVలో 129 హెచ్‌పీ & 144 హెచ్‌పీ ఎంపికలు ఉండగా, XUV 3XO EV 150 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే టార్క్‌ విషయంలో Mahindra XUV 3XO EV 310 ఎన్ఎంతో అగ్రస్థానంలో ఉంది. Syros EV రెండు వేరియంట్లలోనూ 255 ఎన్ఎం టార్క్‌ను అందిస్తే, Nexon EV 215 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: కియా సైరోస్ EV లాంచ్‌ - 526 km రేంజ్‌, ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, BaaS స్కీమ్‌తో తక్కువ రేటు!

ఛార్జింగ్‌ 
7.4kW AC ఛార్జర్‌తో Syros EV 42kWh బ్యాటరీ పూర్తిగా ఛార్జ్‌ కావడానికి 6 గంటలు పడుతుంది. 51.4kWh బ్యాటరీకి 7 గంటల 15 నిమిషాలు అవసరం. Nexon EVలో చిన్న బ్యాటరీకి 4 గంటల 18 నిమిషాలు & పెద్ద బ్యాటరీకి 6 గంటల 36 నిమిషాలు పడుతుంది. XUV 3XO EVను 7.2kW AC ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి సుమారు 6 గంటల 50 నిమిషాలు పడుతుంది. DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌లో Syros EV 100kW సపోర్ట్‌తో ముందంజలో ఉంది. Nexon EV 60kW & XUV 3XO EV 50kW DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు మాత్రమే మద్దతు ఇస్తాయి.

ధరలు 
Tata Nexon EV అత్యంత చవకైన ఎంపికగా నిలుస్తోంది. దీని ధరలు రూ.12.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల వరకు ఉన్నాయి. Mahindra XUV 3XO EV ధర రూ.13.89 లక్షల నుంచి రూ.14.96 లక్షల వరకు ఉంది. Kia Syros EV ధర రూ.13.50 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండటంతో టాప్‌ వేరియంట్‌ అత్యంత ఖరీదైనదిగా నిలుస్తోంది.

BaaS
అయితే Kia ఒక ప్రత్యేకమైన Battery-as-a-Service (BaaS) పథకాన్ని కూడా అందిస్తోంది. ఈ పథకం ద్వారా Syros EV ప్రారంభ ధర కేవలం రూ.7.99 లక్షలకు తగ్గుతుంది. అయితే బ్యాటరీ అద్దెగా ప్రతి కిలోమీటర్‌కు రూ.3.99 చెల్లించాల్సి ఉంటుంది. Nexon EV & XUV 3XO EVల్లో ఇలాంటి అవకాశం లేదు.

మొత్తంగా చూస్తే ఎక్కువ రేంజ్‌, పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన మోటార్‌, వేగవంతమైన DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కోరుకునే వారికి Kia Syros EV అత్యుత్తమ ఎంపికగా కనిపిస్తోంది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్‌ SUV కావాలనుకునే వారికి Tata Nexon EV సరైన ప్రత్యామ్నాయం. మంచి టార్క్‌, విశాలమైన వీల్‌బేస్‌తో డ్రైవింగ్‌ అనుభవాన్ని కోరుకునే వారికి Mahindra XUV 3XO EV కూడా బలమైన పోటీదారుగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!
స్కార్పియో ఎన్‌ కంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్స్‌.. మహీంద్రా కొత్త లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ వచ్చేసింది!
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌.. టయోటా, ఇసుజుకి స్ట్రాంగ్‌ కాంపిటీషన్‌!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget