అన్వేషించండి

కియా సైరోస్ EV లాంచ్‌ - 526 km రేంజ్‌, ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, BaaS స్కీమ్‌తో తక్కువ రేటు!

భారత్‌లో కియా సైరోస్ EV రూ13.50 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. 42kWh & 51.4kWh బ్యాటరీ ఆప్షన్లు, గరిష్టంగా 526km రేంజ్‌, Level 2 ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.

Kia Syros EV Price Range Features: దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంటూ, కియా ఇండియా కొత్త సైరోస్ EVను లాంచ్‌ చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.13.50 లక్షలుగా నిర్ణయించగా, టాప్ వేరియంట్ ధర రూ.20 లక్షల వరకు ఉంది. ఇదే సమయంలో, "బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌" (Battery as a Service (BaaS)) పథకం కింద ఈ మోడల్‌ను కేవలం రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఈ పథకంలో, ప్రతి కిలోమీటర్‌ వినియోగానికి అదనంగా రూ.3.30 చెల్లించాల్సి ఉంటుంది.

కియా సిరీస్‌లో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే. కారెన్స్ క్లావిస్ EV తర్వాత కంపెనీ నుంచి వచ్చిన రెండో మాస్ మార్కెట్ EV కూడా ఇదే. అయితే ధర పరంగా చూస్తే టాటా నెక్సాన్ EV & మహీంద్రా XUV 3XO EV కంటే ఇది కొంత ఖరీదైనదిగా నిలుస్తోంది. ఈ కారు డెలివరీలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి.

కియా సైరోస్ EVను HTK, HTK+, HTX, HTX+ & X-Line అనే ఐదు ట్రిమ్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో HTK వేరియంట్ ధర రూ.13.50 లక్షలు, HTK+ రూ.15 లక్షలు, HTX రూ.16 లక్షలు. Extended Range (ER) మోడళ్లలో HTK+ ER రూ.17 లక్షలు, HTX ER రూ.18 లక్షలు, HTX+ ER రూ.19.50 లక్షలు కాగా, టాప్ X-Line ER వేరియంట్ ధర రూ.20 లక్షలుగా నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?

బ్యాటరీలు - రేంజ్‌
ఈ ఎలక్ట్రిక్ SUVలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు - 42kWh & 51.4kWh ఉన్నాయి. ఇవే బ్యాటరీలు కియా కారెన్స్ క్లావిస్ EV & హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే పరిమాణంలో చిన్న SUV కావడంతో సైరోస్ EV మరింత ఎక్కువ రేంజ్‌ను అందిస్తోంది. 51.4kWh బ్యాటరీతో గరిష్టంగా 526 కి.మీ. ARAI సర్టిఫైడ్ రేంజ్‌ను కంపెనీ ప్రకటించింది. 42kWh బ్యాటరీతో 443 కి.మీ. వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ రేంజ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో అత్యుత్తమమని కియా పేర్కొంది.

పనితీరు పరంగా కూడా సైరోస్ EV ఆకట్టుకుంటుంది. 51.4kWh బ్యాటరీ ఉన్న వేరియంట్‌లో 171 hp పవర్‌, 255 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్ మోటార్‌ను అందించారు. 42kWh వేరియంట్‌లో 135 hp పవర్‌, 255 Nm టార్క్ లభిస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్ కేవలం 8.1 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ పనితీరు టాటా నెక్సాన్ EV & మహీంద్రా XUV 3XO EV కంటే మెరుగ్గా ఉండటం విశేషం.

ఛార్జింగ్ విషయంలో కూడా కియా పలు ఎంపికలను అందిస్తోంది. 7.4kW & 10.8kW AC ఛార్జర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 7.4kW AC ఛార్జర్‌తో 42kWh బ్యాటరీని 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటలు పడుతుంది. 51.4kWh బ్యాటరీకి 7 గంటల 15 నిమిషాలు అవసరం. 100kW DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే పెద్ద బ్యాటరీని కేవలం 39 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: టయోటా టైసర్ ప్లస్‌లు & మైనస్‌లు ఇవే - కొనే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

డిజైన్‌
డిజైన్ పరంగా చూస్తే పెట్రోల్ సైరోస్‌తో పోలిస్తే పెద్దగా మార్పులు లేవు. వెనుక భాగంలో ఉండే ఫ్యూయల్ ఫిల్లర్ స్థానంలో ముందు ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. ముందు & వెనుక LED లైటింగ్‌, బాడీ క్లాడింగ్‌, బంపర్ డిజైన్‌, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ICE మోడల్‌లో ఉన్నట్లుగానే ఉన్నాయి. ఈ SUV మొత్తం తొమ్మిది రంగుల్లో లభిస్తుంది. X-Line వేరియంట్ మాత్రం Xclusive Matte Graphite & Aurora Black Pearl రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇంటీరియర్‌
క్యాబిన్‌లో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, 12.3 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లేతో కూడిన Trinity Panoramic Display ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వైర్‌లెస్ Apple CarPlay & Android Auto, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌, 8 స్పీకర్ల Harman Kardon ఆడియో సిస్టమ్‌, పనోరమిక్ సన్‌రూఫ్‌, 64 రంగుల యాంబియంట్ లైటింగ్‌, డ్యుయల్ కెమెరా డ్యాష్‌క్యామ్‌, 16 లీటర్ల ఫ్రంక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కియా సైరోస్ EV ప్రత్యేకతల్లో వెంటిలేటెడ్‌, రిక్లైనింగ్‌, స్లైడింగ్ రియర్ సీట్లు ముఖ్యమైనవి. ఈ ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో మరే ప్రత్యర్థి SUVలో లేదు. ముందు సీట్లు కూడా పవర్డ్ & వెంటిలేటెడ్‌గా ఉన్నాయి. భద్రత కోసం Level 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, Electronic Stability Control (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, ముందు పార్కింగ్ సెన్సర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లను కియా అందించింది.

అదనంగా, సైరోస్ EV కొనుగోలుదారులకు కంపెనీ జీవితకాల బ్యాటరీ వారంటీని అందిస్తోంది. అలాగే మూడు సంవత్సరాల తర్వాత గరిష్టంగా 80 శాతం వరకు రీసేల్ విలువ లభించే Assured Buyback Programmeను కూడా ప్రకటించింది. దీని వల్ల దీర్ఘకాల యాజమాన్యంపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేసింది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget