2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
2027 KTM 200 Dukeలో రైడ్ బై వైర్, రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్ వంటి ఫీచర్లు వచ్చాయి. ధర, ఇంజిన్, ఇతర మార్పుల వివరాలు తెలుసుకోండి.

KTM 200 Duke Details In Telugu: కేటీఎం, తన 200 డ్యూక్ బైక్‌కు 2026లో రెండోసారి అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటికే, ఈ ఏడాది ప్రారంభంలో కొత్త కలర్, పెద్ద ఫ్రంట్ డిస్క్, తేలికైన అల్లాయ్ వీల్స్‌ను పరిచయం చేసింది. తాజా అప్‌డేషన్‌లో మరిన్ని రైడర్ ఎయిడ్స్, ఎలక్ట్రానిక్ ఫీచర్లను జోడించింది. ఇంజిన్, ఛాసిస్‌లో మాత్రం మార్పులు చేయలేదు. కొత్త 2027 KTM 200 Duke గురించి తెలుసుకోవాల్సిన ఏడు ముఖ్యమైన విషయాలు ఇవే.
1. ఇంజిన్, ఛాసిస్‌లో మార్పులున్నాయా?
కొత్త KTM 200 Dukeలో ఇంజిన్ మారలేదు. ఇందులో పాత 199.5cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 10,000rpm వద్ద 25hp పవర్, 8,000rpm వద్ద 19.3Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా అలాగే ఉంది. అయితే బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను కొత్తగా జోడించారు.
ఛాసిస్ విషయంలోనూ మార్పులు లేవు. బైక్‌లో ట్యూబ్యులర్ ట్రెల్లిస్ ఫ్రేమ్, బోల్ట్-ఆన్ సబ్‌ఫ్రేమ్‌ను కొనసాగించారు. ముందు భాగంలో WP Apex తయారు చేసిన 43mm USD ఫోర్క్, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి.
2. ఎన్ని కలర్ ఆప్షన్లు ఉన్నాయి?
కొత్త 200 Duke మొత్తం నాలుగు రంగుల్లో లభిస్తుంది. వీటిలో Liquid Carbon, Slate Grey కొత్త కలర్ ఆప్షన్లు. Dark Galvano, Electronic Orange రంగులను పాత మోడల్ నుంచి కొనసాగించారు.
ఈ అప్‌డేట్‌లో.. గతంలో పరిచయం చేసిన Atlantic Blue రంగును నిలిపివేశారు. రంగులు మినహా ఇతర అంశాల్లో ఈ నాలుగు వేరియంట్ల మధ్య ఎలాంటి తేడాలు లేవు. అన్నింటి ధర కూడా ఒకేలా ఉంటుంది.
ఇది కూడా చదవండి: 125 యూనిట్లు.. 6 నిమిషాలు! రికార్డు స్థాయిలో అమ్ముడైన Royal Enfield Classic 650 Hypershift స్పెషల్ ఎడిషన్
3. స్టాండర్డ్ ఫీచర్లలో ఏం కొత్తగా వచ్చాయి?
కొత్త అప్‌డేట్‌లో 200 Dukeకు ఎక్కువ ప్రయోజనం కలిగించే మార్పులు ఫీచర్ల విషయంలోనే ఉన్నాయి. ఇందులో Rain, Street అనే రెండు రైడింగ్ మోడ్‌లు, రైడ్ బై వైర్ థ్రాటిల్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్‌ను జోడించారు.
ట్రాఫిక్‌లో తరచూ బైక్ ఆపడం, మళ్లీ ముందుకు కదలడం వంటి సందర్భాల్లో ఉపయోగపడే Crawl Assist ఫీచర్ కూడా అందించారు.
ఈ ఏడాది ప్రారంభంలోనే KTM తేలికైన అల్లాయ్ వీల్స్, 320mm ఫ్రంట్ డిస్క్‌ను పరిచయం చేసింది. ఇది పాత డిస్క్ కంటే 20mm పెద్దది. ఈ రెండు ఫీచర్లు మొదట Gen 3 390 Dukeలో వచ్చాయి. వెనుక డిస్క్ మాత్రం 230mmగానే ఉంది. డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా లభిస్తుంది.
2024లోనే Gen 3 250 Duke, 390 Duke నుంచి తీసుకున్న 5-అంగుళాల TFT స్క్రీన్‌ను 200 Dukeలో అందించారు. ప్రస్తుతం పెద్ద 250 Dukeలో కూడా లేని ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు 200 Dukeలో ఉండటం విశేషం.
4. 250 Duke కోసం అదనంగా రూ.19,000 చెల్లిస్తే ఏం లభిస్తుంది?
200 Duke కంటే రూ.19,000 ఎక్కువ చెల్లించి 250 Duke కొనుగోలు చేస్తే అదనంగా 6hp పవర్, 5.7Nm టార్క్ లభిస్తాయి. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో ఈ అదనపు పవర్, టార్క్ ఉపయోగపడతాయి.
డిజైన్ విషయంలోనూ రెండు బైక్స్ మధ్య తేడా ఉంది. 250 Dukeలో తాజా Gen 3 డిజైన్ లాంగ్వేజ్ ఉండగా, 200 Duke మాత్రం ఆరేళ్ల క్రితం నాటి Gen 2 డిజైన్‌ను కొనసాగిస్తోంది.
250 Dukeకు మారితే, 200 Dukeలో ఉన్న రెండు కొత్త ఫీచర్లు (రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్) అందుబాటులో ఉండవు. 250 Dukeకు ఈ ఫీచర్లు ఎప్పుడు యాడ్ అవుతాయనే విషయాన్ని KTM ఇంకా వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: కోటికి పైగా ధర తగ్గిన జేమ్స్ బాండ్ లగ్జరీ కార్లు.. కొత్త ధరలు చూశారా
5. 200 Dukeలో క్రూయిజ్ కంట్రోల్ ఉందా?
లేదు. కొత్త అప్‌డేట్ తర్వాత కూడా KTM 200 Dukeలో క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులో లేదు. ఈ ఫీచర్ కావాలనుకునేవారికి KTM 390 Duke లేదా 390 Duke R మాత్రమే ఎంపికలుగా ఉన్నాయి.
6. ఇతర 200cc బైక్స్‌తో పోలిస్తే ధర ఎందుకు ఎక్కువ?
KTM 200 Duke మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచీ ప్రీమియం సెగ్మెంట్‌లోనే కొనసాగుతోంది. తాజా అప్‌డేట్ తర్వాత కూడా అదే విధానాన్ని కంపెనీ కొనసాగించింది.
కొత్త ఎలక్ట్రానిక్ ఫీచర్లు, స్పోర్టీ హ్యాండ్లింగ్, పనితీరుకు ఉన్న బ్రాండ్ గుర్తింపుతో అధిక ధరకు న్యాయం చేయాలని KTM చూస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యంత ఖరీదైన 200cc బైక్ ఇది మాత్రం కాదు. ఆ స్థానాన్ని కొత్త Yamaha R2 దక్కించుకుంది. దీని ప్రారంభ ధర రూ.2.30 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.2.53 లక్షల వరకు ఉంది.
7. కొత్త KTM 200 Duke ధర ఎంత?
కొత్త ఫీచర్లను జోడించిన నేపథ్యంలో 200 Duke ఎక్స్‌షోరూమ్ ధరను రూ.1,554 పెంచారు. దీంతో దీని ధర రూ.2.07 లక్షలకు చేరింది.
KTM లైనప్‌లో దీని పైన 250 Duke రూ.2.26 లక్షల ధరతో అందుబాటులో ఉంది. దీని కింద 160 Duke TFT వెర్షన్ రూ.1.91 లక్షల ధరతో లభిస్తుంది.
మొత్తంగా చూస్తే.. 2027 KTM 200 Dukeలో ఇంజిన్, ఛాసిస్ మారకపోయినా, రైడర్ ఎయిడ్స్ విషయంలో గణనీయమైన అప్‌డేట్ వచ్చింది. రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్ వంటి ఫీచర్లు ఈ బైక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. అయితే 250 Dukeతో పోలిస్తే డిజైన్ పాతదిగా ఉండటం, క్రూయిజ్ కంట్రోల్ లేకపోవడం వంటి అంశాలను కూడా కొనుగోలుదారులు పరిగణనలోకి తీసుకోవాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















