అన్వేషించండి

Royal Enfield Himalayan 750 వచ్చేస్తోంది.. క్రూజ్‌ కంట్రోల్‌, TPMS సహా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు

Royal Enfield Himalayan 750 అధికారిక చిత్రాలు విడుదలయ్యాయి. Cruise Control, Traction Control, TPMS, రెండు రకాల వీల్స్, ఐదు రంగుల వివరాలు తెలుసుకోండి.

Royal Enfield Himalayan 750 Details: కొంతకాలంగా టెస్ట్ మ్యూల్స్ రూపంలో కనిపిస్తూ, టీజర్లతో ఆసక్తి పెంచుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 ఎట్టకేలకు అధికారికంగా బయటకు వచ్చింది. కంపెనీ ఇప్పటివరకు ఈ బైక్ పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. ఇప్పుడు.. ఈ మోటార్‌సైకిల్‌ డిజైన్, రంగులు, కొన్ని ముఖ్యమైన ఫీచర్లకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 3న ఇటలీలోని మిలన్‌లో ప్రారంభం కానున్న EICMA 2026 వేదికగా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారు చేస్తున్న బైక్‌లలో ఇదే అత్యధిక ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోడల్‌గా నిలవనుంది. దీని ఇంజిన్ సామర్థ్యం 750cc లేదా దానికి దగ్గరగా ఉంటుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. భారత మార్కెట్లో ఈ బైక్‌ను ఈ నెల ‍(నవంబర్‌) చివరిలో జరిగే Motoverse 2026 సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది.

 హిమాలయన్ 750లో కీలక ఫీచర్లు

ఇప్పటికే బయటికొచ్చిన వివరాల ప్రకారం, Himalayan 750లో చాలా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉండనున్నాయి. వీటిలో క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), అడ్జస్టబుల్ సస్పెన్షన్ ముఖ్యమైనవి.

బైక్ కుడివైపు స్విచ్ క్యూబ్‌పై క్రూజ్‌ కంట్రోల్‌ బటన్లు కూడా అధికారిక ఫొటోల్లో కనిపించాయి. అలాగే కొత్త LED హెడ్‌లైట్ అసెంబ్లీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫీచర్లన్నీ అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉంటాయా? లేక కొన్ని ప్రత్యేక వేరియంట్లకే పరిమితం చేస్తారా? అనేది EICMAలో పూర్తి వివరాలు వెల్లడైన తర్వాతే స్పష్టమవుతుంది.

వీల్స్ విషయంలోనూ రెండు ఆప్షన్లు ఉన్నాయి. అల్లాయ్ వీల్స్‌తో పాటు క్రాస్-స్పోక్ వీల్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు రకాల వీల్స్‌లోనూ ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: 2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి

 ఐదు రంగుల్లో అందుబాటులోకి..

Himalayan 750 మొత్తం ఐదు రంగుల్లో కనిపించింది, అవి - అంటార్కిటిక్ సిల్వర్, సైబీరియా వైట్, వైకింగ్ బ్రాంజ్, టెక్టోనిక్ బ్లాక్, అజ్టెక్ గ్రీన్.

వేరియంట్ల వివరాలపై ప్రస్తుతం పూర్తి స్పష్టత లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత మోడళ్లలో అనుసరించిన విధానాన్ని పరిశీలిస్తే, రంగుల ఆధారంగా వేరియంట్ల ధరల్లో తేడాలు ఉండవచ్చని అంచనా.

Antarctic Silver రంగులో ఉన్న బైక్‌కు ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక యాక్సెసరీలు అమర్చారు. దీనికి ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఇది టాప్ వేరియంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్‌లో కనిపిస్తున్న యాక్సెసరీలు మోడల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాక్సెసరీ కేటలాగ్‌పై కూడా ఒక అంచనాను ఇస్తున్నాయి.

Siberia White, Viking Bronze రంగుల బైక్‌లలోనూ ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ఉన్నాయి. అయితే వీటిలో యాక్సెసరీలు కొంత తక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఇవి మధ్యస్థాయి వేరియంట్లు కావచ్చని భావిస్తున్నారు.

మరోవైపు Tectonic Black, Aztec Green రంగుల్లో కనిపించిన బైక్‌లకు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి బేస్ వేరియంట్లు అయ్యే అవకాశం ఉందని అంచనా.

ఇది కూడా చదవండి: ట్రాఫిక్‌లో క్లచ్ బాధ వద్దు.. రూ.6 లక్షల్లో వచ్చే ఈ 6 సెకండ్ హ్యాండ్ ఆటోమేటిక్ కార్లను పరిశీలించండి

 పూర్తి వివరాలు ఎప్పుడు తెలుస్తాయి?

Himalayan 750 గతంలో చాలాసార్లు టెస్ట్ రైడ్స్ సందర్భంగా కనిపించింది. ఇప్పుడు విడుదలైన అధికారిక చిత్రాల్లో బైక్ డిజైన్‌ను మరింత స్పష్టంగా చూడవచ్చు. ముఖ్యంగా వీల్స్, స్విచ్ క్యూబ్, యాక్సెసరీల వివరాలు బయటపడ్డాయి.

నవంబర్ 3న మిలన్‌లో EICMA 2026 ప్రారంభం కానుంది. అక్కడ, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన అత్యాధునిక మోటార్‌సైకిల్‌గా పేర్కొంటున్న Himalayan 750కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించే అవకాశం ఉంది.

భారత్‌లో ఈ బైక్ లాంచ్ నవంబర్ చివర్లో జరిగే Motoverse 2026లో ఉండవచ్చని అంచనా. ఇంజిన్ పనితీరు, వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధర వంటి వివరాలు అధికారిక ప్రకటన తర్వాతే తెలియనున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Certificate of Deposit: పాత కారు ఇచ్చి కొత్త కారు కొంటున్నారా? ఈ ఒక్క సర్టిఫికెట్‌తో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించుకోవచ్చు!
పాత కారును స్క్రాప్ చేస్తే కొత్త కారుపై భారీ ఆదా.. దాదాపు రూ.30.000 వరకు రాయితీ!
Maruti Cars Price Hike: కొత్త కారు కొనేవాళ్లకు షాక్.. నాలుగోసారి రేట్లు పెంచిన మారుతి సుజుకి
మారుతి సుజుకి కార్ల ధరలు పెంపు.. ఆల్రెడీ అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
Hero Splendor Plus Price Hike: కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన హీరో కంపెనీ.. బైక్ ధరలు పెరిగాయి, అయినా నో టెన్షన్
కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన హీరో కంపెనీ.. బైక్ ధరలు పెరిగాయి, అయినా నో టెన్షన్
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS NZ 1st Test Result: తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం
తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం, డ్రాగా ముగిసిన మ్యాచ్
Hyderabad Terror Attack: హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
AP Panchayat Elections Phase 1: ఏపీ గ్రామ పంచాయతీ తొలి పోరు.. 3191 స్థానాలకు 26న పోలింగ్.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం!
ఏపీ గ్రామ పంచాయతీ తొలి పోరు.. 3191 స్థానాలకు 26న పోలింగ్.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం!
Who is Kota Rukmini: జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ డిప్యూటీ సీఎం డిమాండ్.. రాహుల్ గాంధీ వద్దకు చేరిన ప్రతిపాదన! కేబినెట్ విస్తరణలో కొత్త మలుపు?
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
Bisleri Water సురక్షితం కాదు.. పరిమితికి మించి బ్రొమేట్‌, రసాయనాలు గుర్తింపు: FSSAI కీలక ప్రకటన
YSRCP Organizational Revamp: డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
Bhogi Movie : హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్‌కు 'భోగి' డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే?
Embed widget